• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ కేబినెట్ వినతికి కేంద్రం నో-సీబీఐ కుదరక సీఐడీతో సరి-చంద్రబాబు, లోకేష్ హ్యాపీ

|

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత టీడీపీ ప్రభుత్వ అక్రమాలను తవ్వితీసే పనిలో నిమగ్నమైంది. రాజధాని అమరావతితో పాటు గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి మరీ విచారణ చేయించింది. చివరికి మంత్రుల ఉపసంఘం చేసిన ఓ సిఫార్సును జగన్ కేబినెట్ ఆమోదించి కేంద్రానికీ పంపింది. అయితే దీనికి కేంద్రం ససేమిరా అనడంతో ప్రభుత్వం ఇరుకనపడింది. చేసేది లేక తన అధికారులనే రంగంలోకి దించుతోంది.

టీడీపీ ఎమ్మెల్యేల్ని తొలగించాల్సిందే- రాష్ట్రం దివాలా- నీరోలా జగన్ - బీజేపీ విష్ణు కామెంట్స్టీడీపీ ఎమ్మెల్యేల్ని తొలగించాల్సిందే- రాష్ట్రం దివాలా- నీరోలా జగన్ - బీజేపీ విష్ణు కామెంట్స్

జగన్ సర్కార్ కు మరో షాక్

జగన్ సర్కార్ కు మరో షాక్

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలను వెలికితీసేందుకు జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మంత్రులతో ఉపసంఘాలు వేయడంతో పాటు సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్ధల్ని రంగంలోకి దించి ప్రత్యర్ధి టీడీపీని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వానికి ఈసారి కేంద్రం నుంచి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే అమరావతి విషయంలో తీసుకున్న నిర్ణయాన్నే కేంద్రం మరో ఆరోపణకూ వర్తింపచేయడంతో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పడం లేదు. చేసేది లేక తన అనుచర గణాన్నే నమ్ముకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది.

ఫైబర్ నెట్ పై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం నో

ఫైబర్ నెట్ పై సీబీఐ దర్యాప్తుకు కేంద్రం నో


గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఏపీ ఫైబర్ నెట్ సామాగ్రి కొనుగోలు విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైసీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. తాము అధికారంలోకి రాగానే దీనిపై సీబీఐ దర్యాప్తు చేయిస్తామని పదే పదే చెప్పిన వైసీపీ... ఆ నిర్ణయాన్ని అమల్లో పెట్టింది. మంత్రుల ఉపసంఘంతో ఫైబర్ నెట్ అక్రమాలపై ప్రాధమికంగా నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం.. దీనిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేబినెట్లో నిర్ణయం కూడా తీసుకుంది. ఈ ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం దీన్ని తిరస్కరంచింది.

 సీఐడీతో సరిపెడుతున్న జగన్

సీఐడీతో సరిపెడుతున్న జగన్


ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌లో గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తునకు ఏపీ సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌, కేబుల్‌ కనెక్షన్లు ఇవ్వాలని గత టీడీపీ సర్కార్ నిర్ణయించింది. సెట్‌ టాప్‌ బాక్సులు సహా సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం టెండర్లు పిలిచింది. వీటిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. గుత్తేదారుకు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే విమర్శలు వచ్చాయి. అవకతవకలపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ, ఛైర్మన్‌లు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఈఏడాది ఫిబ్రవరిలో లేఖల ద్వారా కోరారు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన మీదట కేసు దర్యాప్తును ఏపీ నేరపరిశోధన విభాగానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరణాత్మక నివేదిక సమర్పించాలని సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది.

  Weather Update : Two More Days Heavy Rains In AP & Telangana | Oneindia Telugu
   కేంద్రం నిర్ణయంపై చంద్రబాబు, లోకేష్ హ్యాపీ

  కేంద్రం నిర్ణయంపై చంద్రబాబు, లోకేష్ హ్యాపీ


  తమ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నారని వైసీపీ సర్కార్ ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన లోకేష్ కు భారీ ఊరటనిచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐతో దర్యాప్తు చేయిస్తే ఈ వ్యవహారంలో వీరి అక్రమాలను బయటపెట్టొచ్చని వైసీపీ సర్కార్ భావించినా అది సాధ్యం కాలేదు. దీంతో సీఐడీతో జరిపిస్తున్న దర్యాప్తును మాత్రమే వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సీఐడీ తమను టార్గెట్ చేస్తుందంటూ హైకోర్టులో పలు కేసులు దాఖలు చేసిన చంద్రబాబు ఈ వ్యవహారాన్ని కూడా ఆ గాటన కట్టేందుకు వీలు కలుగుతుందనే ప్రచారం జరుగుతోంది.

  English summary
  after central government rejects cbi probe over tdp regime ap fibernet irregularites, jagan government orders cid inquiry.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X