వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామరాజుకు మరో ఝలక్.. లోక్ సభలో సీటు మార్చిన వైసీపీ... మరో ఇద్దరికీ.

|
Google Oneindia TeluguNews

వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార సర్వం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ధిక్కార సర్వం వినిపిస్తున్న ఆయనపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసిన వైసీపీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. దీన్ని లోక్ సభ సచివాలయం కూడా ఆమోదించడంతో రెబెల్ ఎంపీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Recommended Video

YSRCP MP Raghurama Krishnam Raju met JP Nadda రఘురామరాజు ను లోక్ సభలో వెనక సీటుకు పంపేసిన YCP

రూటుమార్చిన వైసీపీ.. రఘురామకృష్ణంరాజు అరెస్టు తప్పదా ? ఇవాళ మరో ఎమ్మెల్యే ఫిర్యాదు...రూటుమార్చిన వైసీపీ.. రఘురామకృష్ణంరాజు అరెస్టు తప్పదా ? ఇవాళ మరో ఎమ్మెల్యే ఫిర్యాదు...

లోక్ సభలో పార్టీల బలాబలాల ఆధారంగా ఎంపీలకు సీట్లు కేటాయిస్తారు. అందులోనూ పార్టీల విజ్ఞప్తి మేరకు ఎంపీలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. పార్టీలో ప్రాధాన్యం కలిగిన ఎంపీలకు ముందు సీట్లు కాస్త ప్రాధాన్యం తక్కువగా ఉన్న వారికి, జూనియర్లకు వెనుక సీట్లు కేటాయిస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇందుకు మినహాయింపు కూడా ఉంటుంది. ఇక లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉన్న వైసీపీకి కూడా తమ ఎంపీల సీటింగ్ ఎక్కడుండాలో నిర్ణయించుకునే హక్కుంది. దీంతో పార్టీని ధిక్కరిస్తున్న ఎంపీ రఘురామరాజుకు వెనక సీటుకు పంపేసింది.

after disqualification complaint, ysrcp now changes rebel mp raghuramarajus seat in ls

తాజా మార్పు ప్రకారం నాలుగో లైన్లో ఉన్న రఘురామరాజు సీటును ఏడో లైన్ కు మార్చేశారు. దీని ప్రకారం 379 సీటులో ఉన్న ఆయన ఇప్పుడు 445 సీటులో కూర్చోవాల్సి ఉంటుంది. గతంలో ఈ సీటులో ఉన్న రాజమండ్ర ఎంపీ మార్గాని భరత్.. నాలుగో లైన్ కు వచ్చారు. వీరితో పాటు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ను కూడా ముందు వరుసలకు మార్చారు.

English summary
in another shock to its rebel mp raghurama krishnam raju, ysrcp has changed his seat in loksabha. as per the change now he has to sit in the place of his colleague mp margani bharat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X