గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్ర‌బాబు ఏం చెప్ప‌బోతున్నారు: ఫ‌లితాల త‌రువాత తొలి సారిగా:ఇక అదే కేరాఫ్ అడ్ర‌స్..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఫ‌లితాల త‌రువాత... తొలిసారి కేడ‌ర్ ముందుకు చంద్ర‌బాబు..!! || Oneindia Telugu

ఏపీలో ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు కేడ‌ర్ ముందుకొస్తున్నారు. ఈ నెల 23న ఫ‌లితాలు వెల్ల‌డ‌యిన త‌రువాత ఆయ‌న పూర్తిగా త‌న నివాసానికే ప‌రిమితమ‌య్యారు. ఫ‌లితాల త‌రువాత తొలిసారిగా ఎన్టీఆర్ జ‌యంతి వేడుక‌ల్లో పాల్గొనేందుకు చంద్ర‌బాబు పార్టీ రాష్ట్ర కార్యాల‌యానికి వ‌స్తున్నారు. మ‌రి..చంద్ర‌బాబు ఏం చెప్ప‌బోతున్నారు..కేడ‌ర్‌కు ఏం సందేశం ఇస్తారు..ప్ర‌తిప‌క్ష నేత‌గా కొన‌సాగుతారా...

చంద్ర‌బాబు తొలి సారిగా..
ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం..ముఖ్య‌మంత్రిగా రాజీనామా..టీడీపీ అధినేత‌గా తొలిసారి ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత టీడీపీ రాష్ట్ర కార్యాల‌యానికి చంద్ర‌బాబు వ‌చ్చారు. ఎన్టీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగే కార్య‌క్ర‌మాల్లో పాల్గొని..ఆ త‌రువాత కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే, చంద్ర‌బాబు కార్య‌క‌ర్త‌ల‌కు ఇప్పుడు ఏం చెబుతారు. ఇప్ప‌టికే త‌న‌ను క‌లిసిన పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మన పని మనం చిత్తశుద్ధితో చేశాం.

After Election Results TDP Chief Chandra babu first time coming to Party state office in Guntur

ఎంత శక్తి ఉంటే అంత శక్తినీ ప్రజలకు మేలు చేయడానికే వెచ్చించాం. మనమేం తప్పు చేయలేదు. ఇది ధైర్యంగా ఉండాల్సిన సమయం. ఏం ఫర్వాలేదు. మంచి రోజులు వస్తాయి. కష్టాలు తాత్కాలికం' అని ధైర్యం చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప‌రాజ‌యం భారాన్ని మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో చంద్ర‌బాబు డైజెస్ట్ చేసుకోలేక పోతున్నారు. దీంతో..ఇప్పుడు ఓపెన్‌గా ఆయ‌న ఏం మాట్లాడుతార‌నేది ఆస‌క్తి క‌రం.

ఇక కేరాఫ్ అడ్ర‌స్ అక్క‌డే..
ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో పార్టీ రాష్ట్ర కార్యాల‌యానికి చంద్ర‌బాబు చాలా త‌క్కువ‌గా వ‌చ్చేవారు. త‌న నివాసం నుండే పార్టీ కార్య‌క్ర‌మాలు ప‌ర్య‌వేక్షించేవారు. అయితే, ఇప్పుడు ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత పూర్తిగా పార్టీ శ్రేణులకే అందుబాటులో ఉండాల‌ని నిర్ణ‌యించారు. దీంతో..ఇక నుండి ప్ర‌తీ రోజు మూడు గంట‌ల పాటు పార్టీ రాష్ట్ర కార్యాల‌యా నికి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు.

After Election Results TDP Chief Chandra babu first time coming to Party state office in Guntur

ఇక చంద్ర‌బాబు కేరాఫ్ అడ్ర‌స్ అదే అవ్వ‌నుంది. ఇక‌, బుధ‌వారం పార్టీ లెజిస్లేచ‌ర్ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఆ స‌మావేశంలో పార్టీ ఫ్లోర్ లీడ‌ర్‌గా ఎవ‌రిని ఎన్నుకుంటార‌నేది ఆస‌క్తి క‌ర‌మే. చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉంటారా ఉండ‌రా అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక‌, చంద్ర‌బాబు చేసే వ్యాఖ్య‌లు..తీసుకొనే నిర్ణ‌యాలు ప్ర‌తీదీ ఆస‌క్తి క‌ర‌మే.

English summary
After Election Results TDP Chief Chandra babu first time coming to Party state office in Guntur. Interest creating on Chandra babu message to party cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X