India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీ రఘురామ మిడిల్ డ్రాప్ - భీమవరం టూర్ : రైలెక్కారు - మధ్యలోనే..ఏం జరిగింది..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీ కాసేపట్లో భీమవరం చేరుకోనున్నారు. ప్రధాని కార్యక్రమంలో తాను హాజరవుతానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కొద్ది రోజులుగా చెప్పుకొచ్చారు.కోర్టుకు వెళ్లి మరీ భద్రత కావాలని కోరారు. కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కానీ, భీమవరంకు రైళ్లో బయల్దేరి మరీ..మధ్యలోనే డ్రాప్ అయ్యారు. అర్ద్రరాత్రి చోటు చేసుకున్న ఈ హైడ్రామా ప్రధాని పర్యటన వేళ..హాట్ టాపిక్ గా మారింది. అల్లూరి సీతారామ రాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా ప్రధాని భీమవరంకు వస్తున్నారు. అక్కడ 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు. అదే సమయంలో భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.

రైళ్లో బయల్దేరి ..డ్రాప్ అయ్యారు

రైళ్లో బయల్దేరి ..డ్రాప్ అయ్యారు

భీమవరం ప్రాంతం నర్సాపురం పార్లమెంటరీ పరధిలోకి వస్తుంది. దీంతో..స్థానిక ఎంపీ రఘురామ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నిర్ణయించారు. కానీ, గతంలో చోటు చేసుకున్న పరిణామాలతో ముందుగానే న్యాయస్థానం ద్వారా భద్రత కల్పించాలని కోరారు. భీమవరం వెళ్లేందుకు హెలికాప్టర్ అనుమతి అడిగారు. కానీ, హెలికాప్టర్ కు అనుమతి లభించలేదు. భద్రత విషయంలో మాత్రం హైకోర్టు ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో..ఆదివారం రాత్రి ఎంపీ రఘురామ నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో భీమవరం బయల్దేరారు. కానీ, రైలు ఎక్కిన కాసేపటికే దిగేసారు. తిరిగి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. తాను భీమవరం పర్యటన రద్దు చేసుకున్నట్లుగా ఎంపీ వెల్లడించారు.

కారణం చెప్పిన ఎంపీ - అదేనా జరిగింది

కారణం చెప్పిన ఎంపీ - అదేనా జరిగింది


రైళ్లో తనను కొందరు అనుసరిస్తారనే అనుమానం వ్యక్తం చేసారు. భీమవరంలో ఉన్న తన అనుచరులతో పాటు మరికొందరిని స్థానిక పోలీసులు బైండోవర్ల పేరిట స్టేషన్‌కు తీసుకెళ్లి హింసించారని ఆరోపించారు. వారి కుటుంబ సభ్యులతో తనకు ఫోన్‌ చేయించి తాను కార్యక్రమానికి రాకుండా ఉంటే వాళ్లని వదిలేస్తామని చెప్పారని వివరించారు. దీంతో..తాను పర్యటన రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనే వారి జాబితా ప్రధాని కార్యాలయం నుంచి స్థానిక యంత్రాంగానికి అందింది. కానీ ,అందులో రఘురామ పేరు లేదు. ఎనిమిది మంది మాత్రం ప్రధానితో పాటుగా వేదికను షేర్ చేసుకోనున్నారు.

చివరి నిమషంలో నిర్ణయం మార్పు

చివరి నిమషంలో నిర్ణయం మార్పు

అయితే, ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో.. చట్ట ప్రకారం వ్యవహరిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు అన్నారు. రఘురామ భీమవరం వస్తున్నట్లు తమకు సమాచారం లేదని చెప్పారు. అంతేకాదు.. పీఎంవో నుంచి వచ్చిన జాబితాలోనూ ఎంపీ రఘురామ పేరు లేదని స్పష్టం చేశారు. ఎంపీ రఘురామ వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకుంటామన్న డీఐజీ.. చట్టప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారు. దీంతో.. ప్రధాని మోదీ -సీఎం జగన్ ఇతర ప్రముఖులో కలిసి పాల్గొనే కార్యక్రమంలో రఘురామ పాల్గొంటారా లేదా అనే ఉత్కంఠకు చివరకు రఘురామ ముగింపు ఇచ్చారు. తానంతటగా తానే రైలెక్కి ..మధ్యలోనే డ్రాప్ అయి..తాను భీమవరం వెళ్లటం లేదని క్లారిటీ ఇచ్చారు.

English summary
After hi drama at late night, MP Raghu Rama Cancelled his Bhimavam tour in last minute. He started in train, but suddenly dropped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X