అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ అంటే టాలీవుడ్‌కు చిన్న‌చూపా: రియ‌ల్ హీరోకు రీల్ హీరోలు దూరమెందుకు: స‌మీక‌ర‌ణాలే కార‌ణ‌మా..!

|
Google Oneindia TeluguNews

తెలుగు సినీ పరిశ్ర‌మ‌. రాష్ట్ర విభ‌జ‌న వ‌ర‌కూ మొత్తం హైద‌రాబాద్ కేంద్రంగానే ఉండేది. ఇప్పుడు అక్కడే ఉంది. పూర్తిగా హైదార‌బాద్ కేంద్రంగానే సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన స‌మావేశాలు..ఎన్నిక‌లు..నిర్ణ‌యాలు సాగుతున్నా యి. ఏపిలో ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు సినీ ప్ర‌ముఖులు జ‌గ‌న్ వద్ద‌కు చేరారు. ఎన్నిక‌ల త‌రువాత వారు దూరం గానే ఉంటున్నా రు. ఇక‌, ఏపీలో సినీ ప‌రిశ్ర‌మ గురించి చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో కొంద‌రు సినీ ప్ర‌ముఖులు వ‌చ్చి నాడు స‌మావేశ‌మ‌య్యారు. విశాఖ కేంద్రంగా సినీ ప‌రిశ్ర‌మ అభివృద్ది చేస్తామ‌ని నాటి ప్ర‌భుత్వం చెప్పింది. అయితే, ఇక ఇప్పుడు జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత టాలీవుడ్ ప్ర‌ముఖుల తీరు విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వు తోంది..ఎందుకుంటే..

మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ..అర్బన్ హౌసింగ్ స్కీమ్ పై సీఎం నజర్మరో సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ..అర్బన్ హౌసింగ్ స్కీమ్ పై సీఎం నజర్

Recommended Video

సీఎం జగన్ ను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి..?
జ‌గ‌న్ అంటే ఇంత చిన్న‌చూపా...

జ‌గ‌న్ అంటే ఇంత చిన్న‌చూపా...

ఏపీ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం చేసి నెల రోజుల పూర్త‌యింది. అనేక రంగాల ప్ర‌ముఖులు జ‌గ‌న్‌ను వ‌చ్చి క‌లిసారు. ఏపీలో అభివృద్దికి త‌మ వంతు స‌హ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఏపీని అన్ని రంగాల్లో ముందుంచుతామ‌ని జ‌గ‌న్ సైతం చెప్పుకొచ్చారు. అయితే, టాలీవుడ్ ప్ర‌ముఖులు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను క‌ల‌వ‌లేదు. ఇక్క‌డే కాదు ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత జ‌గ‌న్ ప‌లు మార్లు హైద‌రాబాద్ వెళ్లారు. అక్క‌డ క‌నీసం జ‌గ‌న్‌ను క‌లిసే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్ వ‌ద్ద‌కు ప‌లువ‌రు సినీ ప్ర‌ముఖులు వ‌చ్చి జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇప్పుడు వారిలో కొంద‌రు జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత ఒక్క‌సారి క‌ల‌వ‌లేదు. ఏపీలో సైతం త‌మ సినిమాలు ప్ర‌ద‌ర్శిస్తుంటేనే త‌మ‌కు క్రేజ్..ఆదాయం వ‌స్తుంద‌నే విష‌యం వారు మ‌ర్చిపోతున్న‌ట్లున్నారు. కొంద‌రు మాత్రం సినిమాల‌కు రాయితీ లు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మాత్రం ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు చేస్తున్నారు. అయితే, గ‌తంలో ఎవ‌రు సీఎం అయినా సినీ రంగ ప్ర‌ముఖులు వ‌చ్చి మ‌ర్యాద పూర్వ‌కంగా క‌ల‌వ‌టం.. సినీ ప‌రిశ్ర‌మ అభివృద్దికి చ‌ర్య‌ల మీద చ‌ర్చ‌లు చేయ‌టం ఆన‌వాయితీ. కానీ, ఇప్పుడు అలా జ‌ర‌గ‌టం లేదు.

"మా" నేత‌లు ఎక్క‌డ‌..చంద్ర‌బాబు స‌మ‌యంలో ఇలాగే చేసారా..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో తెలంగాణ‌..ఆంధ్ర ప్రాంతానికి చెందిన సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఉన్నారు. మా అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా న‌రేష్ ఉన్నారు. ఆయ‌న త‌న అధ్య‌క్ష హోదాలో ఒక్క సారి కూడా త‌న కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌తో క‌లిసి ఏపీ ముఖ్య‌మంత్రిని క‌ల‌వాల‌నే ఆలోచ‌న చేయలేదు. త‌మ ప‌రిశ్ర‌మ‌కు కావాల్సిన‌వి హైద‌రాబాద్‌లో ఉన్నాయి .. తమ‌కు ఏపీతో ప‌ని ఏంట‌ని భావిస్తున్నారా..లేక ఏపీలోనూ త‌మ సినిమాలు ఆడితేనే త‌మ‌కు గుర్తింపు అనే విష‌యం ఉద్దేశ పూర్వ‌కంగా మ‌ర్చిపోయారో తెలియటం లేదు. ఇక‌, రాఘ‌వేంద్ర రావు లాంటి ప్ర‌ముఖులు చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో క‌లిసి వ‌చ్చి చంద్ర‌బాబును అనేక సార్లు క‌లిసేవారు. ఏపీలో ప‌రిశ్ర‌మకు అవ‌కాశాలు.. అభివృద్ది గురించి చ‌ర్చించేవారు. చంద్ర‌బాబు హాయంలో ముఖ్య‌మంత్రిగా ఆయ‌న‌కు గుర్తింపు ఇచ్చి ఇప్పుడు జ‌గ‌న్ విష‌యంలో మాత్రం సినీ రంగ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు ఇంత ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారో అర్దం కావ‌టం లేద‌ని వైసీపీ నేత‌లు..అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

ఆ స‌మీక‌ర‌ణాలే ప్ర‌భావితం చేస్తాయా..

ఆ స‌మీక‌ర‌ణాలే ప్ర‌భావితం చేస్తాయా..

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ధానంగా నాలుగు కుటుంబాల ఆధిప‌త్యంలో ఉంది. మెగా కుటుంబం నుండి ప‌వ‌న్ ఇప్ప‌టికే ఏపీలో పాలకొల్లులో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చారు. అయితే రాజ‌కీయంగా..సినీ హీరోగా క్రేజ్ ఉన్న ప‌వ‌న్ సైతం మా నేత‌ల‌ను క‌లుపుకొని వ‌చ్చి ఏపీలో సినీ ప‌రిశ్ర‌మ అభివృద్దికి ప్ర‌య‌త్నాలు చేయ‌టం లేదు. ఇక‌, మా ప్ర‌తినిధుల‌కు ఏపీ సీఎంను క‌ల‌వాల‌నే ఆలోచ‌న రావ‌టం లేదు. మా లో ఎక్కువ మంది ఏపీ మూలాలు ఉన్న‌వారే. రాఘ‌వేంద్ర రావు..ద‌గ్గుబాటి వార‌సులు..అల్లు అర‌వింద్..త‌మ్మారెడ్డి భ‌ర‌ధ్వాజ‌.. అశ్వినీద‌త్ లాంటి వారు కార‌ణాలు తెలియ‌క‌పోయినా జ‌గ‌న్ తో ఇప్ప‌టి దాకా స‌మావేశం కాలేదు. జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా ఉండే నాగార్జున సైతం సినీ ప‌రిశ్ర‌మ గురించి చ‌ర్చించిన సంద‌ర్బాలు లేవు. త‌న కుటుబంతో స‌న్నిహితంగా ఉండే జ‌గ‌న్‌తో స‌మావేశానికి మా ఛైర్మ‌న్ న‌రేష్ ఆలోచ‌న కూడా చేయ‌లేదు. ఇక‌, వైసీపీలోనే ఉన్న రోజా..విజ‌య్ చంద‌ర్‌..జీవిత లాంటి వారు త‌మ ఇండ‌స్ట్రీకి చెందిన వారిని ఏపీకి తెచ్చే సాహ‌సం చేయ‌టం లేదు. అయితే, చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉంటే అదే వ‌ర్గం ప్ర‌భావితం చేస్తున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు ఇలాగే వ్య‌వ‌హ‌రించే వారా అని జ‌గ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. ఇది ఖ‌చ్చితంగా ఏపీ సీఎంను చిన్నచూపు చూడ‌టంగానే భావిస్తామంటున్నారు.

English summary
After huge victory by YCP chief Jagan it looks like Movie Artist Association have not met him. News is making rounds that YCP wokers and Jagan Fans are unhappy with MAA. During Chandra Babu tenure MAA have had frequent meetings, recalled party worker who is also familiar with movies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X