కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపకు మరో వరమిచ్చిన వైఎస్ కుటుంబం- ఎయిర్ పోర్టులో నైట్ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్...

|
Google Oneindia TeluguNews

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని వరుసగా ఎందుకు గెలిపిస్తారని గతంలో ఓ పెద్దాయన అక్కడి ఓటర్లను అడిగిప్పుడు, ఆయనైతే ఏదో ఒక రోజు సీఎం అవుతాడు, తమ కష్టాలు తీరుస్తాడని చెప్పారంట. ఆ తర్వాత సీఎం అయిన వైఎస్ కడప జిల్లాకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన కుమారుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కడప జిల్లాకు వరుసగా వరాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో కడప ఎయిర్ పోర్టులో విమానాల నైట్ ల్యాండింగ్ అవకాశాన్ని కూడా సాధించారు.

కడప ఎంపీ, సీఎం జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఎయిర్ పోర్టు అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. రెండోసారి ఎంపీగా గెలిచిన అవినాష్ కడప ఎయిర్ పోర్టు అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఈసారి అధికారంలో ఉండటం, కేంద్రంలో ఎన్డీయే రూపంలో అనుకూలమైన ప్రభుత్వం ఉండటంతో కడపలో రాత్రి వేళ విమానాలు దిగేలా పలుమార్లు ఢిల్లీలో అటవీశాఖ అధికారులను కలిసి అవినాష్ విన్నవించారు. అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి.

after jagans brother avinashs efforts, centre gives nod for nighlanding in kadapa airport

ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డ్ మీటింగ్ లో కడప ఎయిర్ పోర్టులో నైట్ ల్యాండింగ్ అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

నాలుగు అబ్ స్టాకిల్ లైట్ల ఏర్పాటుకు అనుమతిచ్చారు.

ఇందులో రెండు ప్రాంతాలు కడప ఫారెస్ట్ డివిజన్ లోని లంకమల్ల అభయారణ్యం కాగా...

మరో రెండు ప్రొద్దుటూరు సబ్ ఫారెస్ట్ డివిజన్ లోని నాగార్జున సాగర్- శ్రీశైలం పులుల సంరక్షణ ప్రాంతం...

Recommended Video

Andhra Pradesh Reports 796 New Covid-19 Cases, Overall Crosses 12,000 || Oneindia Telugu

వీటి ఏర్పాటుకు అనుమతి ఇస్తూ వైల్డ్ లైఫ్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

English summary
after jagan's brother and ysrcp mp ys avinash reddy's efforts, centre has given nod for nighlanding of flights in kadapa airport. being chirman for airport advisory committee avinash put all his efforts to make it possible.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X