వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాలు-సినిమా: జూ ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్‌కు పంచ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మొన్న జూనియర్ ఎన్టీఆర్, నేడు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు రాజకీయ పంచ్‌ని చవి చూశారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ఎలా ఉందనే విషయాన్ని పక్కన పెడితే.. పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేశారనే వాదనలు వినిపించాయి.

అదే సమయంలో ఓ టాప్ హీరో కాబట్టి సినిమా ఎలా ఉందనే విషయమై చర్చ జరగడం సహజమేనని కూడా చెప్పవచ్చు. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రానికి ఉద్దేశ్యపూర్వకంగా నెగిటివ్ టాక్ తీసుకు వచ్చారనే వాదనల నేపథ్యంలో గతంలో హీరో జూనియర్ ఎన్టీఆర్ దమ్ము చిత్రం కూడా పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

పొలిటిక్స్‌కు దెబ్బ: పవన్ కల్యాణ్ సర్దార్‌పై కుట్ర?పొలిటిక్స్‌కు దెబ్బ: పవన్ కల్యాణ్ సర్దార్‌పై కుట్ర?

2012 ఏప్ర్లిల్ నెలలో జూ ఎన్టీఆర్ దమ్ము చిత్రం విడుదలయింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వారసత్వంపై జోరుగా చర్చ సాగుతోంది. ఓ వైపు చంద్రబాబు తనయుడు, మరోవైపు ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయలో జూనియర్ నటించిన దమ్ము చిత్రాన్ని చూడవద్దని ఉద్దేశ్యపూర్వకంగా సందేశాలు వెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి.

After Jr NTR, Pawan Kalyan faces Political heat?

వారసత్వ పోరు, ఆ సినిమా చూడవద్దని సందేశాలు వెళ్లిన ప్రభావం 'దమ్ము' చిత్రం పైన పడిందని ఆ తర్వాత తేలిందని చెబుతుంటారు. కొంత తేడా ఉన్నప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలోను అదే జరిగిందని అంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ ఎన్నికల్లో టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల పైన దృష్టి సారించలేదు.

కాపు కాసినప్పుడు: పవన్ డైలాగ్ ఎవరి గురించి..?కాపు కాసినప్పుడు: పవన్ డైలాగ్ ఎవరి గురించి..?

అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ సిద్ధమవుతారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా గురించి నెగిటివ్ టాక్ ఉద్దేశ్యపూర్వకంగా తెరపైకి తీసుకు వచ్చారనే వాదనలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాపై ఎప్పుడూ లేని విధంగా, ఇతర మాస్ హీరోల సినిమాల విషయంలో జరగని విధంగా నెగెటివ్ టాక్ వచ్చేసిందని వాదనలు వినిపించిన విషయం తెలిసిందే. నిజానికి, భారీ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సినిమాకు రషెస్ లేకపోయినా, విఫలమైనా వారం, పది రోజుల దాకా అది బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు.

After Jr NTR, Pawan Kalyan faces Political heat?

మాస్ హీరోల విషయంలో నెగెటివ్‌ టాక్‌ను ప్రచారం చేయడానికి కూడా మీడియా ముందుకు రాదు. కానీ, పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. మొదటి ఆట నుంచే ఆ సినిమాపై నెగటివ్ టాక్ ప్రారంభమైంది. అలా కావడం వెనక రాజకీయపరమైన కుట్ర ఏదైనా జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉండగా, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోందని కూడా అంటున్నారు. ఈ చిత్రం మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం ప్రీమియర్ షో రికార్డ్‌లను సైతం బ్రద్దలు కొట్టింది. బాహుబలి తర్వాత అమెరికాలో రెండో అతి పెద్ద ఓపెనర్ తెలుగు చిత్రంగా నమోదు అయ్యింది.

English summary
After Jr NTR, Pawan Kalyan faces Political heat?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X