వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ నాతో చెప్పారు, మోడీకి తెలిసిపోయింది: బాబుపై ఊగిపోయిన షర్మిల

చంద్రబాబు ఓ తుప్పు అని, చంద్రబాబు గురించి ప్రధాని మోడీకి తెలిసిందని, ఆ ఒక్క పప్పు (నారా లోకేష్) తప్ప ఇక చంద్రబాబు పప్పులు ఉడకవని వైసిపి నేత షర్మిల ఆదివారం నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: చంద్రబాబు ఓ తుప్పు అని, చంద్రబాబు గురించి ప్రధాని మోడీకి తెలిసిందని, ఆ ఒక్క పప్పు (నారా లోకేష్) తప్ప ఇక చంద్రబాబు పప్పులు ఉడకవని వైసిపి నేత షర్మిల ఆదివారం నిప్పులు చెరిగారు.

నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నిర్వహించిన ప్లీనరీలో రెండో రోజు ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 'వేదిక మీద ఉన్న పెద్దలకు, నాయకులకు, వైసిపి సైనికులకు, రాలేకపోయిన వైయస్ అభిమానికి.. మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు శిరస్సు వంచి, చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది' అని షర్మిల తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

జగన్.. వినాలి: చంద్రబాబు దుమ్ముదులిపిన లక్ష్మీపార్వతిజగన్.. వినాలి: చంద్రబాబు దుమ్ముదులిపిన లక్ష్మీపార్వతి

జగన్ నాతో అన్న మాటలు గుర్తున్నాయి

జగన్ నాతో అన్న మాటలు గుర్తున్నాయి

రాష్ట్రం చీల్చబడిన సమయంలో, 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు లాగా రుణమాఫీ చేస్తానని ఒక్క అబద్దం ఆడితే అప్పుడే వైసిపి అధికారంలోకి వచ్చి ఉండేదని షర్మిల అన్నారు. కానీ ఇచ్చిన మాట తప్పటం కంటే ప్రతిపక్షంలో కూర్చోవడమే ఇష్టమని, ఇచ్చిన మాట తప్పి పొందే అధికారం తనకు వద్దని జగన్ తనతో అన్న మాటలు తనకు ఇంకా గుర్తుకు ఉన్నాయన్నారు.

Recommended Video

Ysrcp Sitting MLA's Anxity For Tickets In 2019 Elections
5 లక్షలు.. జగన్‌కు పెద్ద మెజార్టీ, చంద్రబాబుకే చిన్నది

5 లక్షలు.. జగన్‌కు పెద్ద మెజార్టీ, చంద్రబాబుకే చిన్నది

నిజానికి 2014 ఎన్నికల్లో వైసిపికి వచ్చిన ఓట్లు కోటీ ముప్పై లక్షలు, టిడిపికి వచ్చిన ఓట్లు కోటి ముప్పై అయిదు లక్షలు అన్నారు. కేవలం 5 లక్షల ఓట్ల మెజార్టీతో టిడిపి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ మెజార్టీ జగన్‌కు ఒక్క కడపలోనే వచ్చిందన్నరు. ఒక ఎంపీ సీటుకు 5 లక్షల మెజార్టీ పెద్ద విషయం కానీ, రాష్ట్రవ్యాప్తంగా టిడిపికి వచ్చిన మెజార్టీ చాలా చిన్న విషయం అన్నారు. జగన్‍‌కు దాదాపు ఆరు లక్షల మెజార్టీ వచ్చిందన్నారు. ఆ చిన్న మెజార్టీ కూడా టిడిపికి వచ్చింది చంద్రబాబు ముఖం చూసి కాదన్నారు.

ఏ మోడీని అయితే రాక్షసుడు అన్నాడో..

ఏ మోడీని అయితే రాక్షసుడు అన్నాడో..

గతంలో ఏ మోడీని అయితే రాక్షసుడు అని చంద్రబాబు తిట్టారో, అదే మోడీ మద్దతుతో వచ్చిందన్నారు. ఏ వ్యవసాయం అయితే దండుగ అన్నారో, అదే రైతులకు రుణమాఫీ అని తప్పుడు వాగ్ధానం చేస్తే వచ్చిందన్నారు. అధికారం శాశ్వతం అని వీర్రవీగుతన్న చంద్రబాబు అందరినీ మోసం చేశాడన్నారు. ఎన్నికలకు ముందు హోదా తెస్తానని చెప్పారని, ఇప్పుడు దానిని నీరుగార్చి, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. అబద్దాలతో ఒకసారి అందర్నీ మోసం చేయవచ్చునని, కానీ అన్నిసార్లు అందర్నీ మోసం చేయడం అసాధ్యమని పసుపుపార్టీ తెలుసుకోవాలన్నారు. 2014లో ఓ అబద్దం చెల్లిందని, ఇప్పుడు చంద్రబాబు నైజం తెలిసిందన్నారు.

చంద్రబాబు గురించి మోడీకి తెలిసింది, ఆ పప్పు తప్ప

చంద్రబాబు గురించి మోడీకి తెలిసింది, ఆ పప్పు తప్ప

చంద్రబాబు అవినీతి ఖ్యాతి దేశమంతా పాకిందని షర్మిల అన్నారు. చంద్రబాబు అవినీతి మోడీకి కూడా తెలిసిందని, ఇక ఆయన పప్పులు ఉడకవన్నారు. ఆయన ఇంట్లో ఉన్న ఆ ఒక్క పప్పు తప్ప అని నారా లోకేష్‌ను ఉద్దేశించి అన్నారు.

చంద్రబాబుకు అది లేదు

చంద్రబాబుకు అది లేదు

దేవుడి దృష్టిలో కూడా చంద్రబాబు పాపం పండిందన్నారు. ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలని, అది చంద్రబాబుకు ఎప్పుడూ లేదన్నారు. ఆయనకు తెలిసింది వెన్నుపోటే అన్నారు.

పిరికి చంద్రబాబు.. రాజకీయ వ్యభిచారి

పిరికి చంద్రబాబు.. రాజకీయ వ్యభిచారి

బాబువి ఎప్పుడు వెన్నుపోటు రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలే అన్నారు. చంద్రబాబువి నీచమైన, దిగజారిన రాజకీయాలు అన్నారు. లేదంటే వైసిపి నుంచి గెలిచిన వారిని ఆశ చూపించి టిడిపిలో చేర్పించుకొని, రాజకీయ వ్యభిచారానికి ఎలా పాల్పడుతారని ప్రశ్నించారు. ఇప్పటికీ వారిచేత రాజీనామాలు చేయించి, ఎన్నికలకు వెళ్లి వారిని గెలిపించుకునే దమ్ము పిరికి చంద్రబాబుకు లేదన్నారు. ఆయనకు చేతనయింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని, అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎంపీలను, ఎమ్మెల్యేలను, కార్పోరేటర్లను కొనగలడన్నారు.

చంద్రబాబు నిప్పా, తుప్పా

చంద్రబాబు నిప్పా, తుప్పా

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా, విచారణ జరగకుండా చంద్రబాబు తప్పించుకొని తిరుగుతున్నాడన్నారు. ఇలాంటి చంద్రబాబు నిప్పా, లేక తుప్పా చెప్పాలన్నారు. చంద్రబాబు తుప్పే అన్నారు. వైసిపి బలం వైయస్ పైన ప్రజలకు ఉన్న అభిమానం, జగన్‌పై ఉన్న నమ్మకం అన్నారు. ఈ బలం ఏ పార్టీకి లేదన్నారు. ఈ బలం మన సొంతం అన్నారు. దేవుడి దయ, ప్రజల అండ వైసిపికి పుష్కలంగా ఉన్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మనమంతా బాణాలై దూసుకెల్దామన్నారు. విజయం నిశ్చయం అని షర్మిల అన్నారు. మళ్లీ చెప్తున్నా.. ఇచ్చిన మాట తప్పడం మా రక్తంలో లేదని, అబద్దాలు చెప్పడంలో మా వద్ద లేదని, వైసిపి విలువలు, విశ్వసనీయతలు కలిగిన పార్టీ అని, వైసిపి రైతుల పక్ష పార్టీ అని, దళితుల పక్షం, గిరిజనులు, మైనార్టీలు, పేదలు, ప్రత్యేక హోదా పక్షం అని షర్మిల అన్నారు. రాబోతుంది రాజన్న రాజ్యమని, తేబోతుంది జగనన్న అన్నారు. దీనిని సాధ్యం చేయబోతుంది దేవుడి దీవెన అని, ఇది తథ్యం అని, సెలవు అన్నారు.

నిన్న (శనివారం) తన తండ్రి పుట్టిన రోజు అని, 68వ జయంతి అని, నాన్న లేని లోటు మాటల్లో చెప్పలేనిది అన్నారు. రుణమాఫీ, విద్యుత్ మాఫీ.. ఇలా ఎన్నో పథకాలతో ప్రజలు , రైతులు సంతోషంగా ఉండేలా చేశారన్నారు. తాను రైతు పక్షపాతినని గర్వంగా ఫీలయ్యేవారన్నారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ వంటి వాటితో వైయస్ ఎంతోమంది తలరాతలు మార్చివేశారన్నారు. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు వైయస్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన చేసిన రికార్డ్ ముఖ్యమంత్రి వైయస్ అన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు.

ప్రజలు సంతోషంగా ఉండాలన్నది వైయస్ కోరిక అయితే, జగన్ సంకల్పం అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడటం వైయస్ నైజం అయితే, అది జగన్ సిద్ధాంతం అన్నారు.

English summary
After long time, YSR Congress party chief YS Jagan's sister Sharmila fired at A CM Nara Chandrababu Naidu in YSRCP plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X