వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రమణ దీక్షితులుపై జగన్ సీరియస్- మాదిరెడ్డి తర్వాత ఆయనేనా ? తెచ్చిపెట్టుకున్న వాళ్లే...

|
Google Oneindia TeluguNews

విధేయతకు పెద్దపీట వేస్తారని పేరున్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆయన విశ్వాసంగా తెచ్చిపెట్టుకున్న వాళ్లే వరుసగా షాకులిస్తున్నారా ? ఆర్టీసీ, ఏపీఐఐసీ వంటి కీలక సంస్ధల్లో పదవులిచ్చిన మాదిరెడ్డి ప్రతాప్ కు తాజాగా జారీ చేసిన షోకాజ్ నోటీసులు జారీ చేయడం వెనుక కారణమిదేనా ? ఇప్పుడు టీటీడీలో పాలనపై విమర్శలు చేసిన ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కూడా జగన్ ఆగ్రహానికి గురయ్యారా ? తర్వాత వేటు ఆయనపైనే ఉంటుందా ? ఇప్పుడు ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది.

జగన్ కు వరుస షాకులు..

జగన్ కు వరుస షాకులు..

ఏపీలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 151 ఎమ్మెల్యేల మెజారిటీతో అధికారంలో ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నీ దాదాపు ఏకపక్షమే. వీటిని విమర్శించేందుకు విపక్షాలు ఎప్పుడూ ముందుంటున్నాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా.. స్వపక్షంలోని వారు సైతం ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడితే... అందులోనూ కావాలని తెచ్చిపెట్టుకున్న వారు సైతం బహిరంగ విమర్శలు చేస్తుంటే ఎలా ఉంటుందో సీఎం జగన్ కు మెల్లమెల్లగా అర్దమవుతోంది. దీంతో స్వపక్షమైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇదే కోవలో ఒకప్పుడు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అంతా తానై వ్యవహరించిన వారిలో ఒకరైన ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ కు తాజాగా షోకాజ్ నోటీసు జారీ అయింది.

రమణ దీక్షితులు వ్యాఖ్యలతో..

రమణ దీక్షితులు వ్యాఖ్యలతో..


మాదిరెడ్డి ప్రతాప్ వ్యవహారం ఓ వైపు కలకలం రేపుతుండగానే... టీటీడీ పాలనపై ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తాజాగా ట్విట్టర్ ద్వారా బహిరంగ వ్యాఖ్యలకు దిగారు. కరోనా వైరస్ సోకుతున్నా టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ మాత్రం దర్శనాలను కొనసాగిస్తున్నారని,
టీటీడీలో పాలన చూస్తుంటే గత టీడీపీ పాలన, సీఎం చంద్రబాబు అరాచకాలు గుర్తొస్తున్నాయంటూ రమణదీక్షితులు చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాలని జగన్ ను ఆయన కోరారు. ఇదే అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలంటే ఆయనకు చాలా మార్గాలున్నాయి. కానీ రమణదీక్షితులు మాత్రం ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

జగన్ సీరియస్..

జగన్ సీరియస్..

టీటీడీ పాలనపై గతంలో ఓసారి విమర్శలు చేసి చంద్రబాబు హయాంలో ఉద్వాసనకు గురైన ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఇప్పుడు తాజాగా మరోసారి దాదాపు అవే విమర్శలు చేయడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఉద్వాసనకు గురైన తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తే తనకు తిరిగి పదవి ఇప్పించాలని తిరిగిన రమణదీక్షితులు ఇప్పుడు ప్రధాన అర్చక పదవిలోకి వచ్చాక అదే తరహాలో విమర్శలకు దిగడం, అదీ చంద్రబాబు పాలనతో పోల్చడంతో జగన్ సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని తేల్చాలని టీటీడీ ఛైర్మన్ గా ఉన్న బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలిసింది.

వైవీ సుబ్పారెడ్డి చర్యలు...

వైవీ సుబ్పారెడ్డి చర్యలు...

జగన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి రమణదీక్షితులు వ్యవహారంపై వివరాలు అడిగి తెప్పించుకున్నారు. టీటీడీలో అర్చకులకు కరోనా సోకిన అంశానికి రాజకీయ రంగు పులమడం సరికాదని ఆ తర్వాత ఆయన వ్యాఖ్యానించారు. గౌరవ ప్రధాన అర్చకులుగా ఉంటూ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని చురకలు అంటించారు. తమ ప్రభుత్వం వచ్చాక గౌరవ ప్రధాన అర్చకులుగా నియమించి గౌరవ వేతనాన్ని ఇస్తున్నా ఇలా చేయడం బాగోలేదన్నారు. తక్షణ చర్యగా రమణదీక్షితులను పిలిపించి మాట్లాడమని ఈవో, అదనపు ఈవోను సుబ్బారెడ్డి ఆదేశించారు. ఆ తర్వాత కూడా పరిస్ధితిలో మార్పు లేకపోతే మాత్రం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

Tirumala Darshans Should Stop : Ramana Deekshitulu - ఆపాల్సిన అవసరం ఏముంది ? YV Subba Reddy
 తెచ్చిపెట్టుకున్న వాళ్లే...

తెచ్చిపెట్టుకున్న వాళ్లే...


తాజాగా మాదిరెడ్డి ప్రతాప్ వ్యాఖ్యల వ్యవహారం మర్చిపోక ముందే రమణదీక్షితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో జగన్ తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తాను ఏరికోరి తెచ్చిపెట్టుకున్న వాళ్లే ఇలా బహిరంగ వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతుంటే చేసేది లేక ఇక చర్యలకు దిగుతున్నట్లు అర్ధమవుతోంది. అందుకే ఇప్పటికే మాదిరెడ్డి ప్రతాప్ కు షోకాజ్ నోటీసు పంపిన జగన్ సర్కారు.. రమణదీక్షితులు వివరణ తీసుకుని, సంతృప్తికరంగా లేకపోతే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
after issues show cause notice to ips officer madireddy pratap, cm jagan is looking serious on ttd priest ramana dikshitulu's recent controversial comments on ttd administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X