వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ఫ్రమ్ సౌత్ కొరియా.. పారాసెటిమాల్ తర్వాత జగన్ మరో షాకింగ్ కామెంట్- ఆడుకుంటున్న నెటిజన్లు...

|
Google Oneindia TeluguNews

రాజకీయ నేతలు, కీలక స్ధానాల్లో ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడినా దానికి ప్రాధాన్యముంటుంది. వారు మాట్లాడే విషయాన్ని బట్టి అది వారికి కొన్నిసార్లు పాజిటివ్ గానూ మరికొన్ని సార్లు నెగిటివ్ గానూ ఫోకస్ అవుతుంటుంది. ఇదే క్రమంలో తాజాగా ఏపీ సీఎం జగన్ కరోనా వైరస్ కు సంబంధించి చేస్తున్న కామెంట్లను నెటిజన్లు ఆడుకుంటున్నారు. తొలుత కరోనా వైరస్ కు పారాసెటిమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పిన జగన్, తాజాగా కరోనా వైరస్ కొరియాలో పుట్టిందంటూ మరో షాకింగ్ వ్యాఖ్య చేశారు. దీన్ని నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

 కరోనాకు పారాసెటిమాల్...

కరోనాకు పారాసెటిమాల్...

కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికలను కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన సీఎం జగన్.. ఎన్నికల వాయిదాకు కరోనాయే కారణమంటూ నిమ్మగడ్డ చూపిన కారణాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అదే సమయంలో కరోనా వైరస్ ప్రభావం రాష్ట్రంలో ఏమీ లేదని, అయినా కరోనా వైరస్ కు భయపడాల్సిందేముందని, పారాసెటిమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందని, బ్లీచింగ్ పౌడర్ తో పరిసరాలు శుభ్రం చేసుకోవాలని సూచించారు. అంతకుముందే తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపుగా ఇలాంటి కామెంట్లే చేశారు. దీంతో నెటిజన్లు వీరిద్దరినీ సామాజిక మాధ్యమాల్లో ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటివరకూ ఇదే హైలెట్ కాగా.. తాజాగా జగన్ మరో షాకింగ్ కామెంట్ చేశారు.

కరోనా కేరాఫ్ కొరియా..

కరోనా కేరాఫ్ కొరియా..

దేశవిదేశాలను కుదిపేస్తున్న కరోనా వైరస్ ముందుగా చైనాలోనే పుట్టిందని ప్రస్తుతం మన దేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. మరికొందరైతే మరో అడుగు ముందుకేసి చైనా ఉద్దేశపూర్వకంగానే ఈ వైరస్ ను తయారు చేసి ప్రపంచంపైకి వదిలిందని, లేదు లేదు వాణిజ్య యుద్ధాల్లో భాగంగా అమెరికానే దీన్ని తయారు చేసి చైనాపై వదిలిందని, అక్కడి నుంచి మిగతా దేశాలకు వ్యాపించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ తొలిసారిగా కరోనా వైరస్ దక్షిణ కొరియాలో పుట్టిందని, అక్కడి నుంచి ప్రపంచానికి వ్యాపించిందని సీఎం జగన్ నిన్న ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

పదేపదే చెప్పాక.. ఆ తర్వాత..

పదేపదే చెప్పాక.. ఆ తర్వాత..

తన ప్రెస్ మీట్లో కరోనా వైరస్ కొరియాలో పుట్టిందని రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత ఎందుకో జగన్ కు దీనిపై అనుమానం వచ్చిందో లేక పక్కనే ఉన్న ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి అందించారో కానీ చివరికి వాస్తవం తెలుసుకున్నారు. జవహర్ రెడ్డి అసలు వాస్తవం చెప్పడంతో జగన్ వెంటనే తన మాటల్లో తప్పును తెలుసుకున్నారు. చైనాలో పుట్టిన కరోనా ఆ తర్వాత కొరియా వెళ్లి అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందినట్లు చివరికి జగన్ చెప్పుకొచ్చారు. జగన్ వ్యాఖ్యలతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు సైతం అవాక్కయ్యారు.

వెంటనే రెచ్చిపోయిన నెటిజన్లు...

వెంటనే రెచ్చిపోయిన నెటిజన్లు...

కరోనా వైరస్ చైనాకు బదులుగా కొరియా నుంచి మన దేశానికి వచ్చిందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రెస్ మీట్ పూర్తయ్యే లోపే నెటిజన్లు ఆడుకోవడం మొదలుపెట్టారు. విపక్ష పార్టీలకు చెందిన సోషల్ మీడియా టీమ్ లు వెంటనే రంగంలోకి దిగిపోయాయి. రకరకాల హావభావాలు, హస్యనటుడు బ్రహ్మనందం రియాక్షన్లు అన్నీ కలిపి ఇంటర్ నెట్లో వైరల్ చేసేశారు. దీంతో ఇప్పుడు ట్రోలింగ్ చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. సీఎం స్ధాయిలో ఉన్న వ్యక్తికి కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీటికి కౌంటర్ ఇవ్వలేక వైసీపీ సోషల్ మీడియా అష్టకష్టాలు పడుతోంది.

English summary
after paracetamol, andhra cm ys jagan's comments over origin of coronavirus goes viral on internet. in his yesterday's press meet jagan reveals that coronavirus came from south korea instead of china.later that he was corrected his dialogue, but netizens troll his earlier comment only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X