• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వచ్చే నెల 14న పవన్ భారీ సభ?: మోడీపై అవిశ్వాసం.. టీడీపీ-వైసీపీలకు గట్టి షాక్!

|

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ మేరకు మార్చి 14వ తేదీన పార్టీ స్థాపించి నాలుగేళ్లు అవుతుంది. రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పష్టమైన విధివిధానాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.

పవన్‌తో కలిసి పని చేస్తానో లేదో, రాజకీయం అర్థం తెలియదు, నేనే రాజకీయాలు చేస్తున్నా: జేపీ

ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో నిర్వహించాలని భావిస్తున్నారని అంటున్నారు. ప్లీనరీ రూపంలో లేదా భారీ బహిరంగ సభగా నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందు నిర్వహించే కార్యక్రమం కాబట్టి బహిరంగ సభ అయితేనే బాగుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది.

మోడీపై వ్యూహం, జగన్‌కు నో ఛాన్స్, బాబు లెక్క ఇదీ!: టీడీపీకి విన్-విన్ సిచ్యుయేషన్

జేఎఫ్‌సీ భేటీ

జేఎఫ్‌సీ భేటీ

ఇదిలా ఉండగా, ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు లెక్క తేల్చేందుకు పవన్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్ర, శని.. రెండు రోజుల పాటు కమిటీ సమావేశమైంది. శనివారం సమావేశం ముగిసిన అనంతరం పవన్‌తో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు.

మోడీ నటిస్తే కనుక, కేవలం మంత్రమే: పవన్ కళ్యాణ్ హోదా డిమాండ్‌కు జేపీ షాక్

అవిశ్వాసం తర్వాత రాజీనామా

అవిశ్వాసం తర్వాత రాజీనామా

జేఎఫ్‌సీ ఈ సమావేశాల్లో వాస్తవాల ఆధారంగా సమాచారం సేకరించి విశ్లేషించిందని ఉండవల్లి చెప్పారు. హోదా పొందిన కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు పెద్దగా అభివృద్ధి కాలేదనే సాకుతో ఇక్కడ ఇవ్వమంటే ఎలా అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత ఎంపీలు రాజీనామా చేస్తే దేశమంతా గుర్తించే వీలుందన్నారు. మోడీపై అవిశ్వాసం పెట్టాలన్నారు. అప్పుడే వారి చిత్తశుద్ధి తెలుస్తుందన్నారు. టీడీపీ, వైసీపీలు బీజేపీకి, మోడీకి భయపడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్ విసరడం గమనార్హం. ఓ విధంగా ఇది వారిని ఇరకాటంలో పెట్టే అంశం అంటున్నారు.

కేంద్రం పైనే పవన్ జేఎఫ్‌సీ అభ్యంతరం, ముగ్గురితో అసలు లెక్క, లెక్కచెప్పనున్న ఏపీ

టీడీపీ, వైసీపీ ఎంపీలకు షాక్

టీడీపీ, వైసీపీ ఎంపీలకు షాక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆయన టీడీపీ, వైసీపీ ఎంపీలకు ప్రత్యేక హోదా విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో ఎంపీలు రాజీనామా చేయవచ్చునని లేదా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చునని వ్యాఖ్యానించారు.

అతన్ని ఆంధ్రావాడివి అన్నారు!: పవన్ సంచలన 'విషయం', పార్లమెంటును ముద్దాడిన మోడీ..

విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు

విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనా సమితి ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి జనసేన మద్దతిచ్చింది. ఇందులో జనసేన ప్రతినిధులు పాల్గొంటారని పవన్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఏపీ జేఎఫ్‌సీకి 118 పేజీల రిపోర్టును పంపించింది.

English summary
The Joint Facts Finding Committee (JFC) constituted by Jana Sena leader Pawan Kalyan, concluded the two-day deliberations here on Saturday. Committee member Vundavalli demands that the TDP and YSRCP members should move a no-confidence motion againt the Centre
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X