వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ షాక్: రజనీకాంత్ తర్వాత.. ప్రభాస్‌కు మోడీ బంపరాఫర్?

ప్రముఖ నటుడు, బాహుబలి స్టార్ ప్రభాస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ప్రముఖ నటుడు, బాహుబలి స్టార్ ప్రభాస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బంపరాఫర్ ఇచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

చదవండి: చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న బిజెపి

దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్నేయడం, సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం అర్రులు చాచడం చూస్తుంటే ఈ ఊహాగానాలను తప్పుపట్టలేమని చెప్పవచ్చు.

బాహుబలితో సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రభాస్ పెదనాన్న బీజేపీ నాయకులు. వాజపేయి హయాంలో ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు.

పెదనాన్న ద్వారా గాలం

పెదనాన్న ద్వారా గాలం

కృష్ణంరాజు ద్వారా ప్రభాస్‌కు బీజేపీ గాలం వేస్తోందని అంటున్నారు. ప్రభాస్‌ను బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకునేలా బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తోందంటున్నారు.

ఈ విషయాన్ని కృష్ణంరాజు దృష్టికి కూడా ప్రధాని మోడీ తీసుకు వెళ్లారని, దానిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారని ప్రచారం సాగుతోంది. మరి బీజేపీ లేదా మోడీ కోరికను కృష్ణం రాజు చెబితే ప్రభాస్ అంగీకరిస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

దక్షిణాదిపై కన్నేసింది.. అందుకే

దక్షిణాదిపై కన్నేసింది.. అందుకే

బీజేపీకి ఉత్తరాదిన మంచి బలం ఉంది. కానీ దక్షిణాదిన అంతగా బలంగా లేదు. 2019 నాటికి దక్షిణాదిన బలం పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కేరళ రాష్ట్రాలపై దృష్టి సారించింది.

తెలుగు రాష్ట్రాల్లోను.

తెలుగు రాష్ట్రాల్లోను.

కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అలాగే తెలంగాణ, ఏపీల్లోను బలం పెంచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.

రజనీకాంత్ కోసం అర్రులు చాస్తోంది

రజనీకాంత్ కోసం అర్రులు చాస్తోంది

తమిళనాడులో జయలలిత మృతి అనంతరం రాజకీయం గందరగోళంలో పడింది. దానిని క్యాష్ చేసుకునేందుకు కమలం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోస పన్నీరుసెల్వం, పళనిస్వామి వర్గాలతో.. అన్ని ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. రజనీకాంత్ కోసం కూడా అర్రులు చాస్తోంది. ఆయన ఏం చెప్పనప్పటికీ.. ఆయనను మా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని పదేపదే చెబుతోంది. రజని పార్టీలో చేరితే సీఎం అభ్యర్థి అని కూడా బిజెపి చెబుతోంది.

ప్రభాస్‌పై ఊహాగానాలు కొట్టి పారేయలేనివి

ప్రభాస్‌పై ఊహాగానాలు కొట్టి పారేయలేనివి

తమిళనాడులో బలం పెంచుకునేందుకు సూపర్ స్టార్‌ను పదేపదే తమ పార్టీలోకి రావాలని కోరుతున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లోను బలం పెంచుకునేందుకు ప్రభాస్‌ను ఉపయోగించుకుంటుందనే ఊహాగానాలు కొట్టిపారేయడానికి వీల్లేకుండా ఉన్నాయి. పార్టీ బలం పెంచుకునేందుకు ఏ అంశాన్ని బీజేపీ వదిలేయడం లేదు.

ప్రభాస్ చెప్పాల్సిందే

ప్రభాస్ చెప్పాల్సిందే

ప్రస్తుతం ప్రభాస్ సినిమా రంగంలో మంచి స్టేజ్‌లో ఉన్నారు. తన పెదనాన్న కృష్ణం రాజుతో కలిసి ప్రధాని మోడీని, ఇతర బిజేపీ నేతలను కలవవచ్చు. దానిని బిజెపి తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. కానీ సినిమా రంగంలో మంచి స్టేజ్‌లో ఉన్న ప్రభాస్... ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టరనే చెప్పవచ్చు. కృష్ణం రాజు కూడా కేవలం నేతలతో కలపడం వరకు తప్పితే రాజకీయ ఊబిలోకి లాగరనే చెప్పవచ్చు.

నిన్నటి దాకా పవన్ కళ్యాణ్

నిన్నటి దాకా పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీలో తమ బలం పెంచుకునేందుకు బీజేపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించుకుందామని భావించింది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో ఆయన దూరం జరిగారు. బీజేపీ నేతలు ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ హోదా కోసమే మద్దతిచ్చిన పవన్... ఆ హామీ నెరవేరకపోయేసరికి కమలం పార్టీకి దూరం జరిగారు. హోదా ఇస్తే పరిస్థితి వేరేవిధంగా ఉండేదని అంటున్నారు.

English summary
After Superstar Rajinikanth, BJP trying to drag Telugu Star Prabhas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X