• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాయిరెడ్డి మళ్లీ వేశారు.. బీజేపీ డోసిచ్చినా.. జగన్ రాజభవనాలపై టీడీపీ.. రఘురామపై మరో ఫిర్యాదు..

|

ముందు ఇల్లు చక్కబెట్టుకోమని, మాటిమాటికీ మా పేరు వాడొద్దని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్లీ అదే పని చేశారు. వాళ్లనీ వీళ్లనీ తిట్టి.. చివరికి బీజేపీపైకే బాణాలు వదిలారు. మరోవైపు, సీఎం జగన్ నివాసంలో చిల్లర ఖర్చులు తడిసిమోపెడవుతుండటాన్ని టీడీపీ తప్పుపట్టింది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో వివాదంపైనా ప్రతిపక్షం గట్టిగానే సమాధానం చెప్పింది. ఇటు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మరో ఫిర్యాదు నమోదైంది.

జగన్ కు భారీ షాక్..అంతే గట్టిగా రివర్స్ ఎటాక్ - నీటి ప్రాజెక్టులపై వేడి.. తాజా వరదతో టెన్షన్ తగ్గేనా

వేడి తగ్గకముందే..

వేడి తగ్గకముందే..

టీడీపీకి చెందిన మిడతల దండు బీజేపీని కబ్జా చేస్తోన్నదని, కాషాయదళంలోని కొందరు నేతలు చంద్రబాబుకు చీకటి మిత్రులుగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ సాయిరెడ్డి ఇటీవల చేసిన కామెంట్లపై తీవ్రదుమారం చెలరేగింది. అవసరమైతే, టీడీపీతోపాటు వైసీపీని కూడా ఏదైనా చేయగల సత్తా బీజేపీకి ఉందని, సాయిరెడ్డి ముందుగా తన పార్టీని కాపాడుకోవాలని ఏపీ బీజేపీ ఇన్ చార్జి సునీల్ దేవధర్ కౌంటర్ ఇచ్చారు. అదే క్రమంలో పలువురు బీజేపీ నేతలు సైతం వైసీపీ ఎంపీపై మాటలదాడి చేశారు. రెండ్రోజుల గ్యాప్ లో వేడి తగ్గకముందే సాయిరెడ్డి మళ్లీ తన విమర్శలకు పదును పెట్టారు..

మోదీతో జగన్ దోస్తీ..

మోదీతో జగన్ దోస్తీ..

ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతిలో దాని అధినేత రాధాకృష్ణ ఆదివారం రాసిన ప్రత్యేక వ్యాసంపై స్పందిస్తూ సాయిరెడ్డి మరోసారి బీజేపీపై కామెంట్లు చేశారు. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైెఎస్ జగన్ బంధం సఖ్యంగానే ఉందని స్పష్టం చేశారు. ‘‘ఏంటి కిట్టు కేరాఫ్ ఆంధ్రజ్యోతి, రాజధాని వ్యవహారంపై బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తమరే చెప్తారా? బీజేపీకి మంచి పాలనా అనుభవం వుంది. మీ ఉచిత సలహాలు ఏల? కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు వున్నాయ్. అంతలా భయపడకు - నీ పార్టనర్ చంద్రబాబు కోసం తెరవెనుక ప్రయత్నాలు కొనసాగించు''అని ట్విటర్ లో రాసుకొచ్చారు.

ఎపీ రఘురామ వివాదంలో మరో మలుపు.. అరెస్టు భయంతో రక్షణ కోరిన రెబల్.. వైసీపీ ఫిర్యాదుల వెల్లువతో..

ట్రంప్, జిన్ పింగ్‌ ప్రస్తావన..

ట్రంప్, జిన్ పింగ్‌ ప్రస్తావన..

‘ఫామ్ హౌజ్ పాలిటిక్స్' పేరుతో ప్రచురితమైన కథనంలో సాయిరెడ్డి-బీజేపీ నేతల మధ్య సాగిన మాటయుద్ధాన్ని హైలైట్ చేయడంతో వైసీపీ ఎంపీ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘‘ప్రధాని మోదీ మనసులో ఏముందో తొంగి చూస్తావు. సీఎం జగన్ ఆలోచనేంటో ఆర్నెల్ల ముందే పసిగట్టేస్తున్నావ్. ఇలానే వదిలేస్తే ట్రంప్, జిన్ పింగ్ ల రహస్యాలను కూడా బయటపెట్టేస్తావ్. నువ్వు చెప్పేదాన్ని వెర్రి గొర్రెల్లా జనం నమ్మేస్తారనుకున్నావా? ఇది 21వ శతాబ్దం. ఏడాదికే ఎన్నికలంటూ ఎత్తుకున్నావేంటి?''అంటూ రాధాకృష్ణపై విమర్శలు చేశారు.

ఊరికో రాజభవనం..

ఊరికో రాజభవనం..

సీఎం జగన్ ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారని, క్యాంప్ ఆఫీసులో ఒక్క మీటింగ్ లోనే రూ.43లక్షల విలువైన మజ్జిగ తాగారని, గుడిసెల్లో కూలీలను ఖాళీ చేయిస్తూ, జగన్ మాత్రం రాజప్రసాదాల్లో నివసిస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. దానికి కొనసాగింపుగా.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరికొన్ని వ్యాఖ్యలు జోడించారు. ‘‘ప్రజా ధనంతో దుబారా సబబు కాదు సీఎం గారూ.. మంచినీళ్లు, మజ్జిగ కోసం కోటి రూపాయలు, కరెంట్ పని, కుర్చీల కోసం 4 కోట్ల రూపాయలా? జనం సొమ్ముతో విలసాలు ఏంటి? ఊరికో రాజ భవనం నిర్మించుకోవడం మీకు ఫ్యాషన్ అయినా వాటిని నిర్వహించే స్తోమత రాష్ట్ర ప్రజలకు లేదు..''అని బుద్ధా ఫైరయ్యారు.

 వీసా రెడ్డి.. అంత అమాయకులమా?

వీసా రెడ్డి.. అంత అమాయకులమా?

విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుపై టీడీపీకి చెందిన దళిత నేత వర్ల రామయ్య అభ్యంతరాలు వ్యక్తం చేయడాన్ని వైసీపీ ఎంపీ తప్పు పట్టారు. ‘‘మాట్లాడితే దళిత నాయకుడిని అంటావ్.. అంబేద్కర్ స్మృతివనం కట్టాలని జగన్ సర్కారు ప్రతిపాదిస్తే కుదరదంటావా? దళితులకు, ప్రత్యేకించి మీకు అన్యాయం చేసింది ఎవరో తెలీదా..''అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వీటికి బదులిస్తూ వర్ల రామయ్య వైసీపీపై ఎదురుదాడి చేశారు. ‘‘వీసా రెడ్డి గారూ! నా భాష మీకు అర్థం అవలేదు. స్వరాజ్ మైదానం కోర్టు వ్యాజ్యం లో వుంటే దాన్ని స్మృతివనం కోసం ఎలా ఇస్తారని నా ప్రశ్న? ఈ వివరాలు తెలియకుండా దళితులను మాయ చేస్తే, అంత అమాయకులుగా కనిపిస్తున్నామా?''అని వర్ల మండిపడ్డారు.

  Corona చికిత్సను Aarogyasri పరిధిలో చేర్చిన AP ప్రభుత్వం.. రేట్ ఫిక్స్! || Oneindia Telugu
  రఘురామపై వైసీపీ మరో ఫిర్యాదు..

  రఘురామపై వైసీపీ మరో ఫిర్యాదు..

  సొంతపార్టీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మరో ఫిర్యాదు నమోదైంది. పార్టీకి, పార్టీలోని వ్యక్తుల ప్రతిష్టకు భంగం, నాయకులను అవమానించేలా రఘురామ అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ లు ఇదివరకే ఫిర్యాదులు చేయగా, ఇప్పుడు మంత్రి శ్రీరంగనాథ అనుచరుడైన దంతులూరి రామచంద్రరాజు పెనుగొండ స్టేషన్ లో రఘురామపై మరో ఫిర్యాదు చేశారు. మంత్రి శ్రీరంగనాథ, ఆయన కుమారుడి ఇమేజ్‌ను కించపరిచేలా రఘురామ మాట్లాడారని, ఇళ్లస్థలాలు, ఇసుక అక్రమ తరలింపుపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెబల్ ఎంపీపై ఇప్పటికే నరసాపురం, పోడూరు, తణుకు స్టేషన్లలో ఫిర్యాదులున్న సంగతి తెలిసిందే.

  English summary
  Days after ap bjp incharge Sunil Deodhar slams vijayasai reddy, the ysrcp mp once again drags bjp while criticizing tdp. buddha venkanna, varla ramaiah slams cm jagan and ysrcp on cm expenditure and sc's issue.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X