• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ సర్కార్లో మరో రెండు స్కాంలు-ఇప్పటికే సీఎంఆర్ఎఫ్, చలానా, తెలుగు అకాడమీ-ఏం జరుగుతోంది ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం తమ అజెండా అమల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో అక్రమార్కులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే సీఎంఆర్ఎఫ్, నకిలీ చలానాలు, తెలుగు అకాడమీలో చోటు చేసుకున్న స్కాంలపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా మరో రెండు స్కాంలపై పోలీసులకు ఇవాళ ఫిర్యాదులు అందాయి. దీంతో వైసీపీ సర్కార్లో ఈ వరుస స్కాంల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది.

వైసీపీ సర్కార్లో స్కాంల గోల

వైసీపీ సర్కార్లో స్కాంల గోల

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక నవరత్నాల మ్యానిఫెస్టో అమలుపై సీరియస్ గా దృష్టిపెట్టింది. అదే సమయంలో మ్యానిఫెస్టో అమలు కోసం నిధుల కొరత ఏర్పడటంతో అప్పుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఊపిరి సలపనంత పనుల ఒత్తిడి నెలకొంది. ఇదే అదనుగా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వం బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ ఎక్కువగా ఫోకస్ లేని అంశాలతో పాటు కీలకమైన ప్రభుత్వ విభాగాలనూ వదిలిపెట్టడం లేదు. ఇదే కోవలో రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలానాల స్కాం, ముఖ్యమంత్రి సహాయనిధి నిధుల గోల్ మాల్, తెలుగు అకాడమీ స్కాం.. ఇలా వరుసగా అక్రమాలకు తెరలేపుతున్నారు.

వరుస స్కాంలపై జగన్ సీరియస్

వరుస స్కాంలపై జగన్ సీరియస్

వైసీపీ ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకుంటున్న స్కాంలపై సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నారు. నకిలీ చలానాల స్కాం కొన్నేళ్లుగా జరుగుతుంటే అధికారులు మౌనంగా ఎందుకు ఉండిపోయారంటూ గతంలో ప్రశ్నించిన జగన్.. ఆ తర్వాత చోటు చేసుకున్న సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్ మాల్, తెలుగు అకాడమీ వ్యవహారాల్లోనూ అక్రమార్కుల్ని వదిలిపెట్టొద్దని సీరియస్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పటికే పోలీసులతో పాటు దర్యాప్తు సంస్ధలు కూడా కొరడా ఝళిపిస్తున్నాయి. అయినా పరిస్ధితిలో ఎలాంటి మార్పు లేదని తాజా స్కాంలు నిరూపిస్తున్నాయి. ఇవాళ ఇలాంటి రెండు వ్యవహారాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

 గిడ్డంగుల కార్పోరేషన్, ఆయిల్ ఫెడ్ స్కాంలు

గిడ్డంగుల కార్పోరేషన్, ఆయిల్ ఫెడ్ స్కాంలు

ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ తో పాటు ఏపీ ఆయిల్ ఫెడ్ లోనూ చోటు చేసుకున్న అక్రమాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలో ప్రభుత్వ శాఖల ఫిక్స్ డ్ డిపాజిట్ల నిధుల గల్లంతుపై విజయవాడలోని రెండు పీఎస్‌లలో ఇవాళ ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో రూ.9 కోట్లు కొల్లగొట్టిన ఘటనపై భవానీపురంలో ఫిర్యాదు రాగా.. ఏపీ ఆయిల్‌ఫెడ్‌లో రూ.5 కోట్లు కొట్టేసిన ఘటనపై కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. దీంతో ఈ రెండు వ్యవహారాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిసారిస్తోంది.

 తాజా స్కాంలు జరిగిన విధానమిదే

తాజా స్కాంలు జరిగిన విధానమిదే


తాజాగా దాఖలైన ఫిర్యాదుల ప్రకారం చూస్తే.. ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్, ఏఫీ ఆయిల్ ఫెడ్ లకు ఐఓబి, సప్తగిరి బ్యాంక్‌లలో ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లను నిందితులు తమ సొంత అకౌంట్లకు మళ్లించారు. దీంతో ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అధికారుల నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్‌ డాక్యుమెంట్లు, అదనపు సమాచారం కోరినట్లు తెలిపారు. గల్లంతైన సొమ్ము చెల్లించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఆయా బ్యాంకు యాజమాన్యాలు ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు మొదలు పెట్టినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ రెండు స్కాంలపై దర్యాప్తు జరుగుతోంది.

  Weather : Heavy Rains Till Oct 17 Due To Low Pressure || Oneindia Telugu
  జగన్ సర్కార్లో ఏం జరుగుతోంది. ?

  జగన్ సర్కార్లో ఏం జరుగుతోంది. ?

  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా చోటుచేసుకుంటున్న స్కాంలు ప్రభుత్వవర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ ఇలా విచ్చలవిడిగా నిధుల దుర్వినియోగం జరిగేది కాదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అసలే ప్రభుత్వం నిధుల కొరతతో అల్లాడుతున్న వేళ.. అక్రమార్కులు కోట్లాది రూపాయల్ని దారి మళ్లిస్తుండటం, వాటిని ప్రభుత్వం అడ్డుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఓవైపు అప్పుల కోసం పరుగులు తీస్తున్న ప్రభుత్వం.. ఇలాంటి స్కాంలకు అడ్డుకట్ట వేయగలిగితే ఆ మేరకు ఊరట దక్కుతుందనే చర్చ కూడా జరుగుతోంది.

  English summary
  after serial scams in andhrpradesh, there are two more complaints registered on ware housing corporation scam and oilfed scam in the state today.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X