వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావోస్ వెళ్ళొచ్చి చంద్రబాబు కోతలు ..ఒక్కటైనా నిజమైందా.. విజయసాయి ట్వీట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

దావోస్ వెళ్ళొచ్చి చంద్రబాబు కోతలు ఒక్కటైనా నిజమైందా : విజయసాయి || Oneindia Telugu

ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడే విజయసాయిరెడ్డి చంద్రబాబు కోతల రాయుడని అభివర్ణించారు. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై ట్విట్టర్ లో స్పందించే విజయ సాయి చంద్రబాబు ఏపీకి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత 2015లో దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సుకు వెళ్లి వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నించారు.

<strong>నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే .. పోలీసుల వెల్లడి </strong>నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన కల్పనను మింగేసింది సైకో శ్రీనివాసరెడ్డినే .. పోలీసుల వెల్లడి

చంద్రబాబు రాష్ట్రానికి రానున్నాయని చెప్పిన ఏ కంపెనీ కూడా ఇంతవరకూ రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో విమర్శించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టిన ఆయన "దావోస్ ఆర్థిక సదస్సు- 2015 నుంచి తిరిగొచ్చాక బుల్లెట్ ట్రెయిన్ కోసం స్పెయిన్ ను, డ్వాక్రా ఉత్పత్తులు మార్కెటింగుకు వాల్ మార్ట్ ను ఒప్పించానని, కొబ్బరి నీళ్లను పెప్సీ అమ్ముతుందని చంద్రబాబు కోతలు కోశాడు అని అన్నారు.

After the Davos Financial Conference chandrababu said so many things ..Is it true either? Vijayasai tweeted

ఇక చంద్రబాబు విమానాల ప్లాంట్ పెట్టేందుకు ఎయిర్ బస్ వస్తోందని అన్నాడు. ఇందులో ఒక్కటన్నా నిజమైందా?" అని ప్రశ్నించారు. ఆపై "టిడిపి నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు అంటూ విజయసాయి టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు.

English summary
YCP MP Vijayasai Reddy fired on Chandrababu about The Davo's tour .YSR Congress Party MP Vijayasai Reddy criticized inTwitter Chandrababu . He Tweeted on his Twitter account, he said, "After the Davos Financial Conference - 2015, after returningSpain has been convinced for bullet train , and the Dwakra brand has convinced Wal-Mart for marketing, and that PepsiCo sells the coconut water," said Chandrababu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X