గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవును వారిద్దరూ కలిశారు, రెండున్నర ఏళ్ళ తర్వాత బాబు ఇలా...

అవును వారిద్దరూ కలిసిపోయారు.ఉప్పు,నిప్పులాగా ఉన్న తెలుగు తమ్ముళ్ళు పాలు, నీళ్ళలా కలిసిపోయారు. ఏలూరు ఎంపి మాగుంట బాబు, నూజివీడు టిడిపి ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావులు కలిసిపోయారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నూజివీడు:అవును వారిద్దరూ కలిశారు. వారి మద్య కొంత కాలంగా ఉన్న మనస్పర్థలు తొలగిపోయాయి.పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు నాయకులు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రెండున్నర ఏళ్ళపాటు పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్న ఎంపి ఎట్టకేలకు పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు ఎంపి మాగంటి బాబు, నూజివీడు టిడిపి ఇన్ చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావు లు కలిసిపోయారు.

ఏలూరు ఎంపి మాగంటి బాబు రెండున్నర ఏళ్ళ కాలంలో నూజివీడు వచ్చినా పార్టీ కార్యాలయానికి ఇంతవరకు రాలేదు. ఇందుకు నూజివీడు పార్టీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావుతో మాగంటి బాబుకు ఉన్న విబేధాలే కారణం.

ఒకరిపై మరోకరు పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేసుకొన్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కోసం కూడ పార్టీ నాయకత్వం శ్రద్ద చూపలేదు. ఈ కారణంగానే ఇద్దరు నాయకులు ఎడముఖం, పెడముఖంగానే ఉన్నారు.ఈ కారణంగానే నూజివీడులో పార్టీ కార్యక్రమాలకు హజరైనా, ఇతరత్రా కార్యక్రమాలకు హజరైన మాగంటి బాబు మాత్రం పార్టీ కార్యాలయానికి వెళ్ళేవారు కాదు.

after two years eluru mp magunta babu went to nuzvid party office

అగిరిపల్లిలో నూజివీడు నియోజకవర్గానికి తానే ఇంచార్జ్ గా ఉన్నానని మాగంటి బాబు ప్రకటించారు.దీంతో వెంకటేశ్వర్ రావు బాబు తీరుతో మనస్థాపానికి గురయ్యారు. బాబు తీరును తప్పుబడుతూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. ముద్దబోయిన వెంకటేశ్వర్ రావుకు బాబు అంతగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. దీంతో ముద్దబోయిన వెంకటేశ్వర్ రావు కూడ ఎంపి కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించేవారు.

అయితే మంగళవారం నాడు ఏలూరు ఎంపి మాగంటి బాబు మాత్రం రోటీన్ భిన్నంగా వ్యవహరించారు. నూజివీడు నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావుకు ఫోన్ చేశాడు. కార్యక్రమాలున్నాయి రావాలని ఆహ్వనించాడు. దీంతో ఎంపి కార్యక్రమాన్ని బహిష్కరించకుండానే ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావు ఎంపి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అయితే ఎంపి కార్యక్రమాలకు తనను ఆహ్వానించడంతో ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావు కూడ పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా ఎంపి మాగుంట బాబును ఆహ్వనించారు. ముద్దరబోయిన ఆహ్వనాన్ని పురస్కరించుకొని బాబు పార్టీ కార్యాలయానికి వెళ్ళారు.దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది.

పార్టీలో గ్రూపులు లేవు.బాబు
మాగంటి బాబు, ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావు గ్రూపుల మధ్య విబేధాలు సమసిపోయాయా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే పార్టీలో గ్రూపులు లేవంటూ బాబు సమాధానం ఇచ్చారు. నాయకుల మధ్య అబిప్రాయ బేధాలు ఉండడం సహజం అంతే తప్ప మా మధ్య విబేధాలు లేవంటూ బాబు సమాధానం ఇచ్చారు. ఎంపిగా తాను, నియోజకవర్గ అభివృద్ది కోసం ముద్దరబోయిన వెంకటేశ్వర్ రావు పనిచేస్తారని ఆయన ప్రకటించారు. దీంతో స్థానిక పార్టీ శ్రేణులు కూడ నాయకుల మద్య విబేధాలు సమసిపోవడంతో సంతోషంగా ఉన్నారు.

English summary
after two years eluru mp magunta babu went to nuzvid party office. differences between eluru mp babu nuzvid tdp in charge venkateshwar rao.recently they became friends, magunta babu went to nuzvid party office on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X