వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాపికొండల విహారం కోసం...పడవులకు మళ్లీ పచ్చజెండా

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి:తూర్పుగోదావరి: చుట్టూ గోదావరి గలగలలు...అంతటా ఆకు పచ్చని ప్రకృతి సోయగాలు...మధ్యలో సమున్నత పర్వత పంక్తులు...చల్లగా వెదురు గుడిసెల్లో గడిచే రాత్రుళ్లు...సూర్యోదయమైనా...సూర్యాస్తమయమైనా...కొండల మధ్యనే...ఇవీ పాపికొండల యాత్రకు వెళ్లే ప్రతి పర్యాటకుడికి ఎదురయ్యే అందమైన అనుభూతులు...

అయితే దాదాపు రెండు వారాల నుంచి పర్యాటకులకు ఈ మధురానుభూతి పొందే వీలే లేకుండా పోయింది. ఇటీవల పడవ ప్రమాదం నేపథ్యంలో ఈ పాపికొండల విహారానికి అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. అయితే ఈ విరామంలో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన లాంచీలను, బోట్లను ముమ్మరంగా తనిఖీ చేసిన అనంతరం ఆరు లాంచీల్లో యాత్రికులను తరలించేందుకు అంగీకరిస్తూ తాత్కాలిక అనుమతులిచ్చారు.

కారణం ఇదే... పడవ ప్రమాదం

కారణం ఇదే... పడవ ప్రమాదం

ఈ నెల 15న జరిగిన లాంచీ ప్రమాదంలో 19 మంది మృత్యువాతతో అప్రమత్తమైన యంత్రాంగం లాంచీలు, బోట్లను క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ మేరకు మంగళవారం రెండు లాంచీల్లో యాత్రికులు వెళ్లారు. ఉభయగోదావరి జిల్లాల్లో 73 బోట్లతోపాటు ‘ఫెర్రీ'ల్లో లాంచీలు నిలిచిపోయాయి. పాపికొండల పర్యాటకం కంటే దేవీపట్నం-సింగనపల్లి, పురుషోత్తపట్నం-పోలవరం, గూటాల-వంగలపూడి ఫెర్రీలు నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ఎట్టకేలకుఫెర్రీ రేవులతోపాటు పాపికొండలుకు ఆరు బోట్లు వెళ్లేలా మంగళవారం పోర్టు అధికారులు అనుమతులు ఇచ్చారు.

లోపాల పరిశీలన...క్షుణ్ణంగా

లోపాల పరిశీలన...క్షుణ్ణంగా

అధికారులు సింగనపల్లి రేవులో 18 బోట్లు, ఆరులాంచీలను తనీఖీ చేయగా అనేక లోపాలు బైటపడ్డట్లు తెలిసింది. కొన్ని లాంచీల్లోనైతే అధికారులు కాలుతో ఇలా నెడితేనే వాటికి కన్నం పడిన పరిస్థితి ఉందట. దీంతో ఈ విషయాలను అత్యంత తీవ్రంగా పరిగణించిన అధికారులు చాలా స్ట్రిక్ట్ గా తనిఖీలు జరిపి పనికిరాని వాటికి అనుమతి నిరాకరించారట. అలాగే 15 సంవత్సరాల కాలపరిమతి దాటిన ఎనిమిది బోట్లను నిలిపివేశారట. మరో 16 బోట్లలో లైఫ్‌ జాకెట్లు లేవని ఆపేశారు.

అన్నీ...సవ్యంగా ఉన్నవాటికే

అన్నీ...సవ్యంగా ఉన్నవాటికే

2017 ఐవీ యాక్టు ప్రకారం లాంచీలకు ఉపయోగించే రేకు 8 ఎం.ఎం. నుంచి 10 ఎం.ఎం. మందం ఉండాలి. ప్రస్తుతం ఉన్న బోట్లలో నాలిగింటికే ఆ ప్రమాణాలు ఉన్నట్లు తెలిసింది. ఆ ఉన్న నాలిగిటికే అనుమతి ఇచ్చారని సమాచారం. అలాగే ఫెర్రీ రేవులకు వచ్చే సరికి ప్రయాణికులను తగ్గించి ఎక్కించుకోవడం, ద్విచక్రవాహనాలను తగ్గించడం, బరువు వస్తువులు వేయకూడదనే అనే పలు నూతన నిబంధనలు విధించినట్లు తెలిసింది. పోర్టు, మత్స్యశాఖ, అగ్నిమాపకశాఖ సంయుక్తంగా అన్ని లాంచీలు, బోట్లు, ఫెర్రీలను తనిఖీ చేశామని... సామర్థ్యం ఉన్న వాటికే అనుమతులిచ్చామని అధికారులు ీ సందర్భంగా తెలిపారు. అయితే అధికారులు నిబంధనలు విధించి వదిలేయడం కాకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ ఉంటేనే పరిస్థితి మెరుగుపడుతుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Esat Godavari:For almost two weeks tourists have not been able to visit the Papi hills. In the wake of a recent boat accident, the authorities are not giving permission to the Boats. However, in the interim, the passengers of both the Godavari districts have been temporarily permitted to move the passengers in six boats after checking the boats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X