వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కంటికి మళ్లీ ఆపరేషన్, అందుకే: ఇక ఆ తర్వాత నో బ్రేక్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి మరోసారి శస్త్ర చికిత్స

అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటికి మరోసారి ఆపరేషన్ జరగనుంది. ఆయన కొన్ని నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. గతంలో ఓసారి కంటికి ఆపరేషన్ జరిగింది. అయితే సరైన విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి తీసుకోకపోవడంతో మళ్లీ శస్త్ర చికిత్స జరగనుంది.

జగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుకజగన్ వ్యాఖ్యలకు బలమంటూ తేల్చేసిన సాక్షి! బ్రాహ్మణిని కూడా: టీడీపీ ఆగ్రహం వెనుక

ఎడమ కంటిపై కురుపు ఏర్పడటంతో నెల రోజుల క్రితం పవన్‌కు ఆపరేషన్ జరిగింది. దీని కారణంగా ఆయన ఇబ్బందిపడ్డారు. అందుకే నల్లటి అద్దాలు వాడుతూ జనసేన ప్రజా పోరాట యాత్రలో పాల్గొన్నారు. అది తీవ్రం కావడంతో ఆ తర్వాత హైదరాబాదులోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు.

సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్

సాధ్యమైనంత త్వరగా ఆపరేషన్

పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జనసేన ప్రజా పోరాట యాత్ర సందర్భంగా పవన్ ఇబ్బంది పడ్డారు. త్వరలో పార్టీపై, ఎన్నికల ప్రచారంపై ఆయన దృష్టి సారించనున్నారు. మధ్యలో డిస్టర్బ్ కాకుండా సాధ్యమైనంత త్వరలో కంటికి మరోసారి ఆపరేషన్ చేయించుకొని, మళ్లీ ప్రచార రంగంలోకి దిగనున్నారు.

 పవన్ పర్యటనలో ఇక మరింత చేరికలు

పవన్ పర్యటనలో ఇక మరింత చేరికలు

పవన్ కళ్యాణ్ పర్యటనలో ఆయా జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి లేదా ఇన్నాళ్లు క్రియాశీలకంగా లేని నాయకులు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు జనసేన ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పవన్ వారిని చేర్చుకోనున్నారు. ఇప్పటి వరకు అప్పుడప్పుడు కొందరు నేతలు చేరారు. ఇక ముందు చేరికల వేగం పెరగనుందని తెలుస్తోంది.

బ్రేక్‌కు సెలవు!

బ్రేక్‌కు సెలవు!

ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పలువురు నేతలు జనసేనాని రాక కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు ఇతర పార్టీలకు రాజీనామా చేసి, పవన్ సమక్షంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీలపై ఆయన తన ప్రచారంలో విమర్శలు గుప్పించనున్నారు. ఇటీవలి వరకు కూడా ఆయన జిల్లాల్లో పర్యటించారు. ఎన్నికలు క్రమంగా దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ ప్రచారం మరింత వేగం కానుందని అంటున్నారు. ఇప్పటికే జగన్, చంద్రబాబు ఓ విధంగా ప్రచారం ప్రారంభించారు. పవన్ కూడా ప్రారంభించారు కానీ మధ్యలో బ్రేక్ వస్తోంది. ఇక దాదాపు బ్రేక్ తీసుకోరని తెలుస్తోంది. ఇప్పటి దాకా చేసిన ప్రచారం ఓ ఎత్తు అయితే, ఇకముందు ప్రచారం మరో ఎత్తు అంటున్నారు.

త్వరలో ప్రచారం ప్రారంభం

త్వరలో ప్రచారం ప్రారంభం

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పవన్ దూకుడు పెంచుతున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార డేట్స్‌ను ఫిక్స్ చేశారు. అలాగే జనసేన మేనిపెస్టోను ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు సూచించారు. మహిళలకు ఉచిత గ్యాస్, రేషన్ బదులు రూ.2500 నుంచి రూ.3000 నగదు, మహిళకు 33 శాతం రిజర్వే,న్ వంటి అంశాలు ప్రతి ఒక్కరికి తెలియాలని ఆదేశించారు. సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ విషయాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు.

English summary
Again Jana Sena chief Pawan Kalyan need eye surgery. Over the few months, Jana Sena chief has been sporting sunglasses at events.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X