నిరుద్యోగులకు ఏపీ సర్కారు తీపి కబురు
అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురును అందించింది. ఏపీపీఎస్సీ ద్వారా నియామకం జరిగే ప్రభుత్వ కొలువులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగ అభ్యర్థుల వయో పరిమితిని 34ఏళ్ల నుంచి 42ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం శనివారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. కాగా, ఈ వయోపరిమితి పెంపు 2017, సెప్టెంబర్ 30 వరకు భర్తీ చేసే ఉద్యోగ నోటిఫికేషన్లకు మాత్రమే వర్తించనుంది.
గతకొంత కాలంగా వయోపరిమితి పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో భారీ ఎత్తున నిరుద్యోగ అభ్యర్థులు లభ్ది పొందే అవకాశం ఉంది. కాగా, త్వరలోనే ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications