Ysrcp: ఏజెన్సీలో "నియంత" అరాచకాలు
తన మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ బాబు అరెస్టైన సంగతి తెలిసిందే. అరెస్టైన్ తర్వాత ఒక్కొక్కరుగా అతను ఏజెన్సీ ప్రాంతంలో చేసిన అరాచకాలను వెల్లడిస్తున్నారు. రంపచోడవరం ఏజెన్సీలో నియంతలా వ్యవహరించేవాడని, మంత్రులున్నా, ఎమ్మెల్యేలున్నా పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం వల్ల అతని హవానే నడిచేదని చెబుతున్నారు. అతని అక్రమాలకు సంబంధించిన విషయాలను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు మన్యం ప్రాంతంలోని స్థానికులు కూడా తెలిపారు. వారు చెప్పిన వివరాల మేరకు వాటిల్లో కొన్ని..

ఫొటోలు తీసిన ప్రయాణికులను బెదిరించారు
నర్సీ పట్నం నుంచి మారేడుమిల్లి వెళ్లే ఆర్టీసీ బస్స డ్రైవర్ ను అనంతబాబు తన అనుచరులతో కొట్టించారు. దాడి జరుగుతున్న సమయంలో ఈ సంఘటనను కొందరు ప్రయాణికులు ఫొటోలు తీశారు. ఫొటోలు తీసినందుకు ఆ ప్రయాణికులను కూడా బెదిరించి వాటిని బలవంతంగా డిలిట్ చేయించారు.

గోకవరం డిపో బస్సు డ్రైవర్ పై దాడి
అనంతబాబు అనుచరులు సైడ్ ఇవ్వడంలేదంటూ గోకవరం ఆర్టీసీ డిపో బస్సు డ్రైవర్ పై చేయిచేసుకున్నారు. ఆర్టీసీ వర్గాలన్నీ ఆ డ్రైవర్ కు మద్దతు పలకగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని స్టేషన్లోనే ఇరువర్గాలు రాజీచేసుకున్నాయి.

అనంతబాబుపై ఉన్న 12కేసులు తీసేశారు?
ఎమ్మెల్సీ అనంతబాబుపై మొత్తం 12 కేసులు ఉండేవి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కేసులు తీసేయించారని సమాచారం.

రైతు రుణాల సొమ్ము రూ.25 కోట్లు స్వాహా
రైతులకు రుణాల కింద చెల్లించాల్సిన రూ.25 కోట్లను అనంతబాబు అనుచరులు బినామీ పేరుతో స్వాహా చేశారు. ఈ విషయమై రైతులు అధికారులను నిలదీయడంతో విషయం పెద్దది గాకుండా ఉండేందుకు దీన్ని కూడా సెటిల్ చేశారు.

అక్రమ మద్యం సరఫరాలో కీలక సూత్రధారి
తెలంగాణ నుంచి అక్రమంగా మధ్యం తెప్పించి ఏజెన్సీ ప్రాంతంలో అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ కేసులో అనంతబాబే కీలకసూత్రాధారి అని తెలిపారు.

పోలవరం ప్రాజెక్టులో రూ.కోట్లలో అక్రమాలు
పోలవరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు ఇచ్చే నష్టపరిహారాన్ని బినామీల పేరుతో కొట్టేసినట్లు తెలుస్తోంది. దొంగ డీ పట్టాలు సృష్టించి కోట్లరూపాయలు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

అజ్ఞాతంలో కిషోర్?
అనంతబాబుకి కిషోర్ అనే వ్యక్తి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. అయితే అనంతబాబు చేసే అక్రమాలన్నీ 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన వంతల రాజేశ్వరికి చెప్పేవారు. ఈ విషయంపై ఒకసారి అనంతబాబు కిషోర్ పై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. అనంతరం కిషోర్ బాబు ప్రోద్భలంతో రాజేశ్వరి తెలుగుదేశం పార్టీలో చేరారు. తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేసిన రాజేశ్వరి ఓటమి పాలైంది. వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రాణరక్షణ కోసం మూడు సంవత్సరాలనుంచి కిషోర్ అజ్ఞాతంలోనే ఉన్నారు.