వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏ విద్యార్హత ప్రామాణికం .. మాకు న్యాయం చెయ్యండి.. గ్రామ సచివాలయ బాధిత ఉద్యోగార్ధుల ఆందోళన

|
Google Oneindia TeluguNews

గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ ఇప్పుడు గందరగోళంగా మారింది. సరైన విద్యార్హతలు లేని వారికి తమ పోస్ట్ లు కట్టబెడుతున్నారు అంటూ , ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందంటూ గ్రామ సచివాలయ పరీక్షలు రాసి అర్హత సాధించిన బాధిత అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు రాసే అర్హత సాధించిన తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా , నోటిఫికేషన్ లోని విద్యార్హతలు పరిగణలోకి తీసుకోకుండా ఎవరికి పడితే వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 గందరగోళంగా కేటగిరి 3 లోని వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీపోస్టుల భర్తీ

గందరగోళంగా కేటగిరి 3 లోని వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీపోస్టుల భర్తీ

మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మహాప్రభో అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగుల భర్తీ నోటిఫికేషన్ లో కేటగిరి 3 లోని వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకు పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులు పోస్టింగ్ వస్తుందో రాదో తెలీక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేటగిరి 3 లోని వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుల ఉద్యోగాల కోసం ముందు ఇచ్చిన జీవోలో సోషియాలజీ, ఆంత్రోపాలజీ, సోషల్ వర్క్ లో డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టుకు అర్హులు అంటూ పేర్కొన్నారు.

నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హత ఆర్ట్స్ లో డిగ్రీ

నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హత ఆర్ట్స్ లో డిగ్రీ

ఇక ఆ తర్వాత ఇచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ లో ఇదే పోస్టుకు ఆర్ట్స్ లో డిగ్రీ కానీ, హ్యుమానిటీస్ సబ్జెక్టులో ఉత్తీర్ణులైన వారు కానీ ఉన్నారు. రెండు వేరు వేరు గా ఉండటంతో కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు నోటిఫికేషన్ లో ఉన్నదే అంతిమం అని తీర్పు ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్ ప్రకారం ఆర్ట్స్ లో డిగ్రీ ఉన్నవారు చాలా మంది పరీక్ష రాశారు. ఉత్తీర్ణులయ్యారు. మొత్తం ఈ పోస్ట్ ల కోసం 4188 మంది అర్హత సాధించారు .

ఇతర విద్యార్హతలు ఉన్నవారికి కూడా పోస్టింగ్ ఇస్తున్నారని బాధితుల ఆందోళన

ఇతర విద్యార్హతలు ఉన్నవారికి కూడా పోస్టింగ్ ఇస్తున్నారని బాధితుల ఆందోళన

మొత్తం 3786 పోస్టులుండగా ఇప్పుడు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి, పోస్టింగ్ ఇవ్వనున్న నేపథ్యంలో గతంలో ఇచ్చిన జీవోలోని అర్హతలను గానీ, నోటిఫికేషన్‌లోని విద్యార్హతలను గానీ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. బీకామ్‌, బీఎస్సీ, బీటెక్‌ విద్యార్హతలున్న వారిని కూడా పిలిచారని , వారి సర్టిఫికెట్లు వెరిఫై చేయడం కూడా పూర్తయి, నేడు వారికి నియామక పత్రాలు అందజేయనున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు.

గోపాల కృష్ణ ద్వివేదిని కలిసిన బాధితులు .. న్యాయం చెయ్యండని వేడుకోలు

గోపాల కృష్ణ ద్వివేదిని కలిసిన బాధితులు .. న్యాయం చెయ్యండని వేడుకోలు

ఇక దీంతో ఆర్ట్స్ కు సంబంధించి పరీక్షలు రాసిన 13 జిల్లాల నుంచి వచ్చిన బాధిత అభ్యర్థులు శుక్రవారం పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదిని కలిశారు. ఇక ఇదంతా ఆయన దృష్టికి సైతం తీసుకువెళ్లారు. గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్‌లో ఉన్న విద్యార్హత ప్రకారమే నియామకాల ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నట్లు అభ్యర్థులు తెలిపారు. అయితే నేడు నోటిఫికేషన్లో ప్రకటించిన విద్యార్హత కాకుండా ఇతరత్రా బీఎస్సీ, బీటెక్‌, బీకామ్‌ విద్యార్హతలు ఉన్న అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనున్నారు అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయండి మహాప్రభో అంటూ దీనంగా వేడుకుంటున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

English summary
Recruitment of village secretariat employees is now confusing. Victim candidates who have passed the Examination have been demanding that their posts are being tampered with and that the government is being unfair to them. They are worried about the criteria of the educational qualifications. In the notification government mentioned the arts qualified candidates are eligible to the posts . but government is giving jobs to the other subjects also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X