గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీని అడ్డుకుంటే త‌గిన మూల్యం త‌ప్ప‌దు : ప్ర‌ధాని నిజాలు చెబుతార‌నే : బిజెపి నేత‌లు..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ధాని మోదీ గుంటూరు ప‌ర్య‌ట‌న పై నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర‌స‌న లకు పిలుపునిచ్చారు. వామ‌ప‌క్ష నేత‌లు నిర‌స‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ప‌లు చోట్ల మోదీకి ఏపిలోకి ఎంట్రీ లేదంటూ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసారు. దీని పై బిజెపి నేత‌లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మోదీ ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటే త‌గి న మూల్యం చెల్లించుకుంటార‌ని హెచ్చ‌రిస్తున్నారు..

ప్ర‌ధాని రాక‌ను నిరిసిస్తూ..

ప్ర‌ధాని రాక‌ను నిరిసిస్తూ..

ప్ర‌ధాని మోదీ గుంటూరు స‌భ‌ను అడ్డుకుంటామ‌ని వామ‌ప‌క్ష నేత‌లు ప్ర‌క‌టించారు. మోదీ రాష్ట్ర పర్య‌ట‌న‌కు వ్య‌తిరేకం గా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి పిలుపునిచ్చారు. విజ‌య‌వాడ -గుంటూరు లో మోదీకి ఏపికి వ‌చ్చే అర్హ‌త లేదంటూ పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు ఏర్పాటు చేసారు. ముఖ్య‌మంత్రి సైతం మోదీ ఎందుకు వ‌స్తున్నార‌ని నిల‌దీస్తు న్నారు. ఇదే స‌మ‌యంలో బిజెపి నేత‌లు తీవ్రంగా స్పందించారు. నాలుగున్నరేళ్లలో ఏపీకి ఏం చేశారో చెప్పేందుకే ప్రధాని మోదీ గుంటూరు పర్యటనకు వస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని

చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని

మోదీ పర్యటనను అడ్డుకోడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ సభకు బస్సులు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ప్రైవేటు వాహనాలను ఎక్కికక్కడ సీజ్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ప్రజలు కూడా మోదీ చెప్పబోయే వాస్తవాలు తెలుసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు

త‌గిన మూల్యం చెల్లించుకుంటారు..

త‌గిన మూల్యం చెల్లించుకుంటారు..

ప్రధాని పర్యటనను అడ్డుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని బిజెపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవిఎల్ న‌ర‌సింహారావు హెచ్చ‌రించారు. ఏపీకి ఇచ్చిన హామీల కంటే ఎక్కువగానే నిధులను ఇచ్చామని స్పష్టం చేశా రు. ప్రధాని మోదీ గుంటూరు సభకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు ఏపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించా రు. మోదీ సభను విజయవంతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఏపీకి చెందిన వివిధ ప్రాజక్టులకు కేంద్రం కేటా యించిన నిధులను చంద్రబాబు వాటికి ఖర్చు పెట్టకుండా, వేరే ప్రాజక్టులకు వాడుకుని, ఇప్పుడు దొంగ అరుపులు అరుస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు కేంద్ర విద్యాసంస్థల కోసం వేల కోట్ల నిధులను కేంద్రం ఇచ్చిందన్నారు. ఇంత చేసినా ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

English summary
AP political parties opposing PM Modi AP tour. TDP and Left parties call for protest on Modi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X