వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌కు బాబు 'సంక్రాంతి' కానుక, చిరంజీవికి అలా: జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం అంటూ

|
Google Oneindia TeluguNews

Recommended Video

క్లీన్ సెలిబ్రిటీస్‌ : జూ.ఎన్టీఆర్, రాజమౌళి

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోలకు అనుమతించారు. దీనిపై వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక కథనం రాసింది. తనకు మద్దతుగా నిలుస్తున్నందునే సీఎం చంద్రబాబు జనసేనానికి సంక్రాంతి కానుక ఇచ్చారని విమర్శించారు.

సీఎంలకు 'అజ్ఞాతవాసి' షాక్: డిఫెన్స్‌లో పడ్డారా? పవన్ కళ్యాణ్ రాయబారం, ట్విస్ట్సీఎంలకు 'అజ్ఞాతవాసి' షాక్: డిఫెన్స్‌లో పడ్డారా? పవన్ కళ్యాణ్ రాయబారం, ట్విస్ట్

కేవలం అజ్ఞాతవాసి సినిమాకే ఇలా ఇస్తే, మిగతా వాటి పరిస్థితి ఏమిటని ఆ వార్తలో ప్రశ్నించారు. ఈ సందర్భంగా గతంలో బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇచ్చారని, రుద్రమదేవికి మాత్రం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇప్పుడు కమర్షియల్ సినిమాకు అసాధారణ రాయితీ ఇవ్వడం ఏమిటని అందులో ప్రశ్నించారు.

 ఆపద్భాందవుడికి రాయితీ, సినీ వర్గాల ఆశ్చర్యం

ఆపద్భాందవుడికి రాయితీ, సినీ వర్గాల ఆశ్చర్యం

గతంలో ఏ తెలుగు సినిమాకు ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనల అనుమతి ఇవ్వలేదని, పలు సందేశాత్మక, చారిత్రాత్మక, సాంఘిక సినిమాలు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, తనకు అప్పుడప్పుడు ఆపద్భావందవుడిలా మారిన పవన్ కమర్షియల్ చిత్రానికి మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు అదనంగా మూడు షోలకు రాయితీ ఇవ్వడంపై సినీ వర్గాలే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అదనంగా ఒక షోకు అనుమతి ఇఛ్చిందని గుర్తు చేసింది.

 తన వారికి రాయితీ అంటూ

తన వారికి రాయితీ అంటూ

సందేశం ఇచ్చే సినిమాలకు అప్పుడప్పుడు రాయితీలు ప్రకటించడం ఆనవాయితీ. మన చరిత్ర, సంస్కృతి, వాతావరణాన్ని ప్రతిబింబించే వాటికి, చిన్న పిల్లల సినిమాలకు రాయితీలు ప్రకటిస్తారు. కమర్షియల్ సినిమాలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటించిన దాఖలాలు లేవని. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదనపు షోల ద్వారా ఈ రకంగా పవన్ సినిమాకు రాయితీలు ప్రకటించిందని పేర్కొన్నారు. గతంలో బాలయ్య సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారని పేర్కొన్నారు.

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాపై

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాపై

చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ వేడుకకు విజయవాడలో అనుమతి ఇవ్వలేదని పేర్కొన్నారు. రుద్రమదేవి సినిమాకు రాయితీ ఇవ్వలేదని పేర్కొన్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన బాహుబలి సినిమాకు కూడా అజ్ఞాతవాసి సినిమాకు ఇచ్చినట్లుగా అవకాశం ఇవ్వలేదని సినీ వర్గాలు అంటున్నాయని పేర్కొన్నారు.

జూఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం అంటూ

జూఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం అంటూ

గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజీ, నాన్నకు ప్రేమతో సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని, ఇప్పుడు పవన్ సినిమాలకు మాత్రం ఇలా ఇవ్వడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారని పేర్కొన్నారు.

 టిక్కెట్ రేట్లపై

టిక్కెట్ రేట్లపై

ఇదిలా ఉండగా, అజ్ఞాతవాసి సినిమా ప్రీమియర్ షోల టిక్కెట్ల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని కూడా పేర్కొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఉదయం పది గంటల వరకు ప్రత్యేక అనుమతి ఉండటంతో మూడు షోలతో కలిపి మొత్తం ఏడు షోలకు ఇష్టానుసారంగా టిక్కెట్లు అమ్ముతున్నారని వస్తున్న ఆరోపణలను కూడా పేర్కొన్నారు. టిక్కెట్ రేట్ల కారణంగా సామాన్య అభిమాని ఆందోళన చెందుతున్నాడని పేర్కొన్నారు.

 ఒక కమర్షియల్ సినిమాకు ఇలాగా

ఒక కమర్షియల్ సినిమాకు ఇలాగా

మరోవైపు రాత్రి ఒంటిగంట నుంచే సినిమాలకు అనుమతి ఉండటంతో ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లేదంటే భద్రతాపరమైన ఇబ్బందులతో అల్లర్లకు అవకాశం ఉంటుందని, ఒక కమర్షియల్ సినిమాకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవడం అధికార దుర్వినియోగం అనే వాదన వినిపిస్తోందని పేర్కొన్నారు.

English summary
The much awaited movie Agnyaathavaasi of leading Telugu actor Pawan Kalyan, released on Wednesday, have seven shows in cinema theatres in Andhra Pradesh and five in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X