గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అగ్రిగోల్డ్ విశ్వరూపం: బినామీ పేర్లతో 700 కోట్లు కాజేసిన వైనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన అగ్రిగోల్డ్‌ కంపెనీ కుంభకోణంలో తవ్విన కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. బినామీల పేర్లతో సుమారు 700 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ఆర్జించట్లు తేలింది. విజయవాడ సహా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు 350 కోట్ల రూపాయలు పైగా విలువైన ఆస్తులను కూడబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సంపాదించిన భూములను క్రమబద్దీకరించుకోవడానికి చేస్తోన్న ప్రయత్నాల్లో ఈ బినామీల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ పేర్లతో బినామీలను సృష్టించగలిగారు గానీ వారి పేరు మీద సరైన సాక్ష్యాధారాలను పుట్టించలేకపోయారు. అడ్డంగా దొరికినట్లు సమాచారం. బినామీల పేర్లతో లాక్కున్న భూములను క్రమబద్దీకరించుకోవడానికి చేసిన ప్రయత్నాల వల్ల అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

<strong>శ్రీకాకుళం లోక్ స‌భ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జిగా జెయింట్ కిల్ల‌ర్‌</strong>శ్రీకాకుళం లోక్ స‌భ వైఎస్ఆర్ సీపీ ఇన్‌ఛార్జిగా జెయింట్ కిల్ల‌ర్‌

భూములను క్రమబద్దీకరించుకోవాలంటే ఆధార్‌కార్డు తప్పనిసరి. బినామీల పేర్ల మీద ఆధార్ కార్డులను నిర్వాహకులు పుట్టించలేకపోయారు. దీనితో బండారం బట్టబయలైంది. అగ్రిగోల్డ్‌, దాని అనుబంధ గ్రూపుల డైరెక్టర్‌, చైర్మన్‌ సహా లక్ష్మీనరసింహం, లక్ష్మీనరసింహ ప్రసాద్‌, లక్ష్మీ ప్రసాదశర్మ, వెంకటేశ్వర వరప్రసాద్‌, లక్ష్మీప్రసాద్‌, లక్ష్మీ భారతి, నరసింహ భారతి, లక్ష్మీనరసింహశర్మ, నరసింహభారతి అనే పేర్ల మీద 2011లో గుర్తింపు కార్డులను తయారు చేశారు. వారి పేర్ల మీద పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను తీసుకున్నారు. దీనికోసం నకిలీ అడ్రస్‌లు సృష్టించారు. విజయవాడ నగరం, దాని చుట్టుపక్కల నరసింహ భారతి, ప్రసాద్‌ శర్మ, లక్ష్మీప్రసాద్‌ల పేరిట 350 కోట్ల రూపాయల విలువ చేసే భూములు, ఇళ్లస్థలాలను కొనుగోలు చేశారు. గుంటూరు జిల్లాలో మరో 190 కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అలాగే- కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా భీమిలీ పరిధిలో 200 కోట్ల రూపాయల విలువైన భూములను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Agrigold scam creates sensation after benami names came out

అవన్నీ ఆధార్‌ గుర్తింపు రాకముందు అంటే ముందు రిజిస్ట్రేషన్‌ అయినవి. అప్పట్లో ఆధార్ కార్డు ఉపయోగం పెద్దగా లేదు. దీనితో దొంగ గుర్తింపు పత్రాలను సృష్టించుకున్నారు. ఆధార్ కార్డు విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. ప్రస్తుతం ఆధార్‌ తప్పనిసరి. అది లేకపోతే కనీసం పాస్‌పోర్టు అయినా చూపించాల్సి ఉంటుంది. దీనితో ఆధార్‌, పాస్‌పోర్టులు సృష్టించడం కుదరట్లేదు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 350 కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్న నరసింహభారతి, లక్ష్మీప్రసాద్‌ మరణించినట్లుగా మీసేవ నుంచి మరణ ధృవీకరణ పత్రాలను పొందారు. ఈ విషయం కొందరు బాధితుల దృష్టికి వెళ్లింది. దీనితో వారు ఆందోళనకు దిగారు. వారంరోజులుగా విజయవాడ కేంద్రంగా బాధితులు దీనిపైనే కేంద్రీకరించారు.
English summary
The Agri Gold company lured several lakh customers on the promise that their investment would come back to them with the higher returns. The company allegedly took the money (more than Rs 7,000 Cr) and invested heavily in real estate, and finally duped the customers. Yet, the bigwigs of the company are able to get away without any arrests or prosecution. Everything is as usual with the Agri Gold Company. Though CID has taken up the investigation thanks to the intervention of the High Court and arrested couple of Agri Gold directors, who were out on bail within no time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X