వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిపై తొందరపడ్డామేమో, వెనక్కీ వెళ్లలేం: ఆహ్మద్‌పటేల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: విభజనపై నిర్ణయం తీసుకోవడంలో తొందరపడ్డామని, పరిస్థితి ఇలా మారుతుందని తాము ఊహించలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు, కేంద్ర మంత్రులతో అన్నారట. అదే సమయంలో వెనక్కి వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పారట. ఆయన వ్యాఖ్యలతో రాష్ట్ర విభజనపై తీసుకున్న నిర్ణయం అమలు చేయడం అంత సులభం కాదని కాంగ్రెస్ అధిష్ఠానం గ్రహించినట్లు సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు.

బుధవారం అహ్మద్ పటేల్, ఆంటోనీ కమిటీ సభ్యుడు వీరప్ప మొయిలీతో భేటీతో సీమాంధ్ర నేతలు భేటీ అయ్యారు. ఆంటోని కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతనే విభజనపై ముందుకు వెళ్తామని మొయిలీ, తొందరపడ్డామని పటేల్ చెప్పడంతో విభజన కష్టసాధ్యమని అధిష్టానానికి తెలిసిపోయిందని సీమాంధ్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. తనను కలిసిన సీమాంధ్ర నేతలతో పటేల్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట.

సీమాంధ్రలో పరిస్థితులు తమ దృష్టికి వచ్చాయని, వాటిని బాగా అర్థం చేసుకున్నామని, ఇంత జరుగుతుందని ముందుగా అంచనా వేయలేకపోయామని, తెలంగాణపై వచ్చిన సమాచారం ఆధారంగానే ముందుకు వెళ్లాం తప్ప సీమాంధ్రలో పరిణామాలను సరిగ్గా అంచనా వేయడంలో కొంత పొరపాటు జరిగిందని అహ్మద్ పటేల్ అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. విభజన విషయంలో ప్రస్తుతానికి ముందుకైతే వెళ్లడం లేదని అహ్మద్ పటేల్ స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

అదే సమయంలో వెనక్కు వెళ్లడంపై ఏమీ తేల్చుకోలేదని కూడా చెప్పారట. 'వెనక్కు వెళ్లకుంటే సీమాంధ్రలో పరిస్థితి ఎలా చల్లబడుతుంది? మీ నిర్ణయం కారణంగానే అక్కడ ఉద్యమం మొదలైంది. దానిని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మీదే. ఎలాగోలా బయటపడేలా చర్యలు తీసుకోండి'' అని ఎంపీలు కోరారు.

'ఏం చేయాలో మీరూ చెప్పండి' అని అహ్మద్ పటేల్ ప్రశ్నించగా.. "సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాన్ని చల్లార్చకుండా, ప్రజాభిప్రాయాలను గౌరవించకుండా, ఏకాభిప్రాయం సాధించకుండా ముందుకు వెళ్లం' అని ఓ ప్రకటన చేస్తే బాగుంటుందని నేతలు సూచించారు. అందుకు అది తన చేతుల్లో లేదని అహ్మద్ పటేల్ బదులిచ్చారట. వారు ఉద్యమ తీవ్రతను సోనియా గాంధీకి తెలిపేందుకు ఆమె అపాయింటుమెంటు కోరారు.

English summary
Congress Party senior leader Ahmed Patel responded 
 
 on Telangana issue with Seemandhra leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X