• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Chiranjeeviకి రాహుల్ గాంధీ కాల్ : జగన్‌ను ఎదుర్కోవాలంటే "మెగా" జోష్ కావాల్సిందే..!!

By Lekhaka
|

కేంద్ర మంత్రి చిరంజీవి పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఇంకా ఆశలు పెట్టుకుంది. కాంగ్రస్ పార్టీలో తిరిగి జోష్ నింపటానికి కాంగ్రెస్ అధినాయకత్వం రోజుకో రాష్ట్ర వ్యవహారాల పైన ఫోకస్ పెట్టింది. తెలంగాణ లో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బాధ్యతలు ఇచ్చిన తరువాత పార్టీలో జోష్ పెరిగిందని పార్టీ గుర్తించింది. దీంతో...పంజాబ్ లో సిద్దూ..రాజస్థాన్ లోనూ తాజాగా నిర్ణయం తీసుకోనుంది. ఈ సమయంలో ఈ ఉదయం పార్టీ నేత రాహుల్ ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీతో పాటుగా ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

 చిరంజీవి పై రాహుల్ ఆరా..

చిరంజీవి పై రాహుల్ ఆరా..

ఏపీలో పరిస్థితుల పైన వాకబు చేసారు. ఏపీలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీలోనే ఉన్నా..ఇంత స్తబ్దుగా ఉండటానికి కారనం ఏంటని ఆరా తీసారు. పార్టీలో జోష్ నింపే నాయకుడు కావాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అందులో భాగంగా..రాహుల్ కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి గురంచి తెలుసుకొనే త్నం చేసారు. చిరంజీవి పూర్తిగా సినిమాలకు-సేవా కార్యక్రమాలను పరిమితం అవుతున్నారని పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ చెప్పుకొచ్చారు. అమరావతిలో-హైదరాబాద్ లో పార్టీ సమావేశాలు నిర్వహించినా దూరంగా ఉంటున్నారని వివరించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ లోనే ఉంటే..ఎందుకిలా..

కాంగ్రెస్ లోనే ఉంటే..ఎందుకిలా..

తాను వియజవాడలో జరిగిన పార్టీ సమావేశంలో చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు-పీసీసీ వివరణ గురించి సైతం వివరించారు. అదే సమయంలో వైసీపీ నుండి చిరంజీవి రాజ్యసభకు వెళ్తారంటూ సాగుతున్న ప్రచారం..బీజేపీ నేతలు తమ వైపు తిప్పుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలను సైతం కాంగ్రెస్ నేతలు రాహుల్ కు వివరించారు. దీంతో..చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా ..అంటూ..ఆయన సేవలు మనం ఎందుకు వినియోగించుకోలేమని ప్రశ్నించినట్లుగా సమాచారం.

 పీసీసీ పదవి ఆఫర్-గతంలో తిరస్కరించినా..

పీసీసీ పదవి ఆఫర్-గతంలో తిరస్కరించినా..

ఆయన పార్టీలో..రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అయ్యే విధంగా కీ రోల్ అప్పగించేందుకు ఆయనతో చర్చించాలంటూ ఉమెన్ చాందీకి సూచించినట్లుగా విశ్వసనీయ సమాచారం. చిరంజీవికి పీసీసీ పదవి ఇచ్చే అంశం పైనా చర్చ జరగ్గా..గతంలోనే ఆ ప్రతిపాదన రాగా..చిరంజీవి తిరస్కరించిన అంశాన్ని పార్టీ నేతలు గుర్తు చేసారు. దీంతో..చిరంజీవితో మాట్లాడాలంటూ ఉమెన్ చాందీకి సూచించిన రాహుల్..తాను ఆయనతో మాట్లాడటానికి సిద్దమనేని చెప్పినట్లుగా తెలుస్తోంది.

 జగన్ ను ఎదర్కోవాలంటే తప్పదు..

జగన్ ను ఎదర్కోవాలంటే తప్పదు..

ఏపీలో జగన్ ను ఎదుర్కోవాలంటే చిరంజీవిని తిరిగి కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడినట్లుగా సమాచారం. టీడీపీ అంతగా పంజుకోవటం లేదని.,,వైసీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైందని పార్టీ నేతలు రాహుల్ కు వివరించినట్లుగా సమాచారం. ఇందు కోసం త్వరలోనే ఉమెన్ చాందీ హైదరాబాద్ వస్తారని తెలుస్తోంది. ఇటు చిరంజీవి మాత్రం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నారు. సినీ పరిశ్రమ అంశాల పైన యాక్టివ్ గా ఉంటున్నారు.

చిరంజీవి మనసు మార్చుకుంటారా..

చిరంజీవి మనసు మార్చుకుంటారా..

తమ్ముడు జనసేన వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవటం లేదు.అయితే, ఏపీలో రాష్ట్ర విభజన తరువాత దాదాపుగా తెర వెనక్కు వెళ్లి పోయిన కాంగ్రెస్ బాధ్యతలు తిరిగి స్వీకరించటానికి చిరంజీవి అంగీకరిస్తారా అంటే సందేహమే. అదే సమయంలో అసలు తాను రాజకీయాల పైన ఆసక్తిగా లేననే విషయాన్ని పలు సందర్బాల్లో స్పష్టం చేసారు. కానీ, కాంగ్రెస్ అధినాయకత్వం అడిగితే , చిరంజీవి ఏం చెబుతారనేది ఆసక్తి కరం. అందునా పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న సమయంలో తిరిగి కాంగ్రెస్ లో యాక్టివ్ అయి..కాంట్రవర్సీకి చిరంజీవి సిద్దపడరనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం చిరంజీవి పైన భారీ ఆశలతో కనిపిస్తోంది.

English summary
AICC leaders wants Chirnajeevi's re entry in AP party matters. Rahul Gandhi asked party incharge to speak to Chiaranjeevi on taking key post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X