హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎయిర్ హోస్టెస్ హత్య: పరారీలో భర్త ఫ్యామిలీ, టెక్కీపై కేసు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు ఉప్పల్ హత్య కేసులో మిస్టరీ వీడింది. భర్త సచిన్ హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య చేసిన సచిన్‌ను, హత్యా నేరాన్ని దాచినందుకు అతడి స్నేహితుడు రాకేష్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

ఉప్పల్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవిచందన్ రెడ్డి, ఇన్స్‌పెక్టర్ నర్సింహా రెడ్డి వివరాలు తెలిపారు. హర్యానాకు చెందిన సుభాష్ షెరిన్ కుమార్తె రీతు షెరిన్(28)కు పంజాబ్‌లోని అమృత్ సర్‌కు చెందిన సచిన్ ఉప్పల్ (29)తో 2013లో వివాహం జరిగింది.

వీరికి ప్రస్తుతం ఐదు నెలల బాబు ఉన్నాడు. వివాహానికి ముందు రీతు ఎయిర్ హోస్టెస్‌గా కోల్‌కతా జెట్ ఎయిర్ వేస్‌లో మూడేళ్ల పాటు పని చేసింది. పెళ్లి అనంతరం దంపతులు రామంతాపూర్ ఇందిరానగర్లో ఉంటున్నారు. సచిన్ కోఠిలో వ్యాపారం చేస్తున్నాడు.

కాగా, రీతూపై సచిన్‌కు అనుమానం ఎక్కువ. రూ.16 లక్షల కట్నం ఇచ్చినా అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. సచిన్ తల్లిదండ్రులు సీమా ఉప్పల్, రమేష్ ఉప్పల్, సోదరుడు నితిన్ ఉప్పల్ కూడా వేధించేవారు. ఈ ముగ్గురి పైన కూడా కేసు నమోదు చేయగా ముగ్గురు పరారీలో ఉన్నారు.

కాగా, నేరాన్ని దాచినందుకు సఫిల్ గూడకు చెందిన మిత్రుడు రాకేష్ పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. రాకేష్ ఇన్ఫోసిస్‌లో సాఫ్టువేర్ ఉద్యోగి. సచిన్‌కు స్నేహితుడు. సచిన్, రీతు మధ్య గొడవ జరిగిన సమయంలో రాకేష్ ఉన్నాడు. విచారణలో హత్య చేసినట్లు సచిన్ ఒప్పుకోవడంతో, నేరాన్ని దాచాడని రాకేష్ పైన కేసు నమోదు చేశారు.

 రీతు

రీతు

పోలీసుల విచారణలో బుధవారం నాడు సచిన్ తన తప్పును అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సచిన్, అతని స్నేహితుడు రాకేష్‌ను విచారించారు. రాకేష్ ఇన్ఫోసిస్ ఉద్యోగి.

 రీతు

రీతు

సమాచారం మేరకు, విచారణలో రాకేష్... అతను, సచిన్ ఆదివారం రాత్రి బార్లో మందు తాగారు. తర్వాత సచిన్ ఇంటికి బిర్యానీ పార్సిల్ తీసుకొని వెళ్లారు.

 రీతు

రీతు

ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు సచిన్ రిమోట్ అడిగాడు. దీనిపై భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కాసేపటికి బిర్యానీ వడ్డించమని సచిన్ అడిగాడు. అయితే, రీతు వడ్డించేందుకు నిరాకరించింది.

 రీతు

రీతు

అంతేకాకుండా, సచిన్ పైన ఆమె ఉమ్మేసింది. కొట్టింది. దీంతో ఆగ్రహోద్రుడైన సచిన్ ఆమెను కొట్టాడు. రాకేష్ కలుగజేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, సచిన్ పర్సనల్ విషయంలోకి రావొద్దని సచిన్ అతనిని హెచ్చరించాడు.

 రీతు

రీతు

పోలీసుల విచారణలో సచిన్... గొడవ అనంతరం రీతు బెడ్ రూంకి వెళ్లి కూర్చుంది. ఆమె సచిన్ కుటుంబ సభ్యులను తిట్టింది. దీంతో అతను ఆగ్రహానికి లోనయ్యాడు.

 రీతు

రీతు

దిండు ముఖం పైన పెట్టి అదిమాడు. ఆ తర్వాత కాసేపటికి ఆమె కదలలేకపోవడం చూశాడు. దీంతో, ఆమె తండ్రికి ఫోన్ చేసి పిలిపించాను. ఆసుపత్రికి తీసుకెళ్లాం. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు.

 రీతు

రీతు

సచిన్ దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేయడం వల్ల ఆమె చనిపోయిందని పోలీసులు చెప్పారు. మొదటి పోస్టుమార్టంలో పెద్దగా ఆనవాళ్లు తేలకపోవడంతో రెండోసారి రీతు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.

English summary
After smothering his wife Ritu Sareen to death, a drunk Sachin Uppal had taken the help of his friend and Infosys techie, K. Rakesh Kumar, to cover up the murder. Mr Kumar, who has been arrested for concealing evidence, had seen a pillow on her face after she died but hid the fact from the police for two days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X