పైలట్ అలిగి వెళ్లడంతో ఆగిన విమానం: అశోక్‌తో మాట్లాడిన కామినేని
విజయవాడ: ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం నాడు హైడ్రామా చోటు చేసుకుంది. చివరి నిమిషంలో పైలట్ అలిగి వెళ్లిపోవడంతో విమానం నిలిచిపోయింది. గంటలపాటు ప్రయాణీకులు పడిగాపులు కాశారు.
ఈ విమానం ఢిల్లీ - విజయవాడ ఎయిర్ ఇండియా విమానం. ఈ విమానంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, మంత్రి కామినేని శ్రీనివాస రావు తదితరులు ఉన్నారు.

గంటన్నర రెండు గంటల తర్వాత అధికారులు మరో పైలట్‌ను పంపిస్తున్నారు. విమానంలో ఉన్న మంత్రి కామినేని.. కేంద్రమంత్రి అశోగ్ కజపతి రాజుతో మాట్లాడారు. దీంతో మరో పైలట్‌ను పంపించారు. విమానంలో 120 మంది ప్రయాణీకులు ఉన్నారు.