వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఏయిరిండియా సర్వీసుల పునరుద్దరణ: కొత్త సర్వీసులు ప్రారంభం..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో రద్దు చేసిన ఏయిరిండియా సర్వీసులను పునరుద్దించటానికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ చైర్మన్‌ అశ్వనీ లొహానీ పేర్కొన్నారు. ఈ సర్వీసులతో పాటుగా కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసారు. గత జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రూట్లలో ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో విమాన ప్రయాణీకులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా చైర్మన్ లొహానీతో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు.

రద్దు చేసిన విమాన సర్వీసులను సత్వరమే పునరుద్ధరించడంతో పాటు వైజాగ్-విజయవాడ-బెంగుళూరు, వైజాగ్-విజయవాడ-తిరుపతి మధ్య రోజూ విమాన సర్వీసులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో..తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డికి రాసిన లేఖలో ఈ అంశాలను పేర్కొన్నారు.

Air India seriveces resumed from AP shortly and also decided for new services

పునరుద్దరణ..కొత్త సర్వీసులు
ఆంధ్రప్రదేశ్‌లో రద్దు చేసిన ఎయిర్ ఇండియా విమాన సర్వీసులను పునరుద్ధరిస్తామని సంస్థ చైర్మన్‌ అశ్వనీ లొహానీ ప్రకటించారు. సర్వీసుల పునరుద్ధరణతో పాటుగా విజయవాడ-తిరుపతి-వైజాగ్, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు రూట్లలో కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభించే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ప్రస్తుతం ఢిల్లీ-విజయవాడ మధ్య వారానికి మూడుసార్లు నడుపుతున్న ఎయిర్ ఇండియా విమాన సర్వీసును అక్టోబర్ 27 నుంచి ఢిల్లీ-విజయవాడ-తిరుపతి-విజయవాడ-ఢిల్లీ సర్వీసుగా నడపనున్నట్లు తెలియచేశారు.

వీటితో పాటుగా.. డిమాండ్ కు అనుగుణంగా విధంగా విజయవాడ, వైజాగ్, తిరుపతి, విజయవాడ-షిర్డీ, విజయవాడ-బెంగుళూరు మధ్య కొత్త విమాన సర్వీసులను ప్రారంభించాలని కూడా కోరుతూ ఆయనకు లేఖ రాశారు. ఈ లేఖపై సానుకూలంగా స్పందిస్తూ లొహానీ మంగళవారం విజయసాయిరెడ్డికి ప్రత్యుత్తరమిచ్చారు.

కాగా ఎయిర్‌ ఇండియా నిర్ణయం పట్ల విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వనీ లొహానీకి ధన్యవాదాలు తెలియజేశారు. దీంతో..ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల నుండి గమ్య స్థానాలకు చేరుకుంటున్న ఏపీ ప్రయాణీకులకు ఇక నుండి కొత్తగా సేవలు అందుబాటులోకి రానున్నాయి.

English summary
Air India seriveces resumed from AP shortly. Air India Chairman Aswani Lohani letter to Rajyasabha member Vijaya sai reddy on this matter. He also assured for start new services for demand routes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X