వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియోకు కౌంటర్.. ఏడాది పాటు డేటా ఫ్రీ!: ఎయిర్‌టెల్ బంపరాఫర్, ఎవరికి.. ఎలా వర్తిస్తుందంటే..

ఎయిర్ టెల్ భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక ఏడాది పాటు 4జీ డేటాను అందించనున్నట్లు తెలిపింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎయిర్ టెల్ భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక ఏడాది పాటు 4జీ డేటాను అందించనున్నట్లు తెలిపింది. 4జీ ఫోన్లు కలిగి ఎయిర్ టెల్‌ నెట్ వర్క్‌ వినియోగించని వారు, అదే విధంగా ఎయిర్ టెల్‌ నెట్‌వర్క్‌ వినియోగిస్తూ కొత్త 4జీ హ్యాండ్‌సెట్లకు అప్‌గ్రేడ్‌ అయిన వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

4 జనవరి 2017 నుంచి 28 ఫిబ్రవరి 2017 మధ్య ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద వినియోగదారులు ప్రతి నెలా 3 జీబీ ఉచిత డేటాను 31 డిసెంబర్‌ 2017 వరకు ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్‌ ప్యాక్‌ల ద్వారా పొందవచ్చు.

దేశవ్యాప్తంగా 4జీ ఫోన్ల వినియోగం పెరుగుతోందని, ఎక్కువమంది వేగవంతమైన బ్రాండ్‌ సేవలను అందిపుచ్చుకునేందుకు ఎయిర్‌టెల్‌ ఈ ఆకర్షణీయ పథకం అందిస్తోందని ఎయిర్ టెల్ వెల్లడించింది.

Airtel offers free data for a year to customers who switch to 4G

4జీ హ్యాండ్‌ సెట్లు కలిగిన ప్రీ పెయిడ్‌ వినియోగదారులు రూ.345తో రీఛార్జ్‌ చేసుకుంటే ఈ పథకం కిందకు వస్తారు.

రూ.345 రీఛార్జ్‌తో ఏ నెట్ వర్క్‌కైనా ఉచిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ 4జీబీని ప్రతి నెల పొందొచ్చు. ఇందులో 1జీబీ రెగ్యులర్‌ ప్యాక్‌ కాగా, 3జీబీ ఉచిత డేటా. ఇది 28రోజుల పాటు ఉంటుంది. డిసెంబర్‌ 31 వరకు కేవలం 13 సార్లు మాత్రమే రీఛార్జ్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

పోస్ట్ పెయిడ్‌ వినియోగదారులు రూ.549 ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌తో పాటు 6జీబీ డేటాను పొందవచ్చు. ఇందులో 3జీబీ రెగ్యులర్‌ డేటా కాగా, 3జీబీ ఉచిత డేటా. రూ.799 ప్లాన్‌ కింద అపరిమిత కాల్స్‌తో పాటు 8జీబీ డేటాను పొందుతారు. ఇందులో 5జీబీ రెగ్యులర్‌ డేటా కాగా, 3జీబీ ఉచిత డేటా. కాగా, ఇది జియోకు కౌంటర్‌గా చెప్పవచ్చు.

English summary
Airtel offers free data for a year to customers who switch to 4G.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X