వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు 'బ్రాండ్' షాక్: విసుగెత్తి తప్పుకుంటున్న అజయ్ దేవగణ్?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆంధ్రప్రదేశ్ అంబాసిడర్‌గా తప్పుకోనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం తీరు పైన అజయ్ దేవగణ్ సంతృప్తిగా లేరని, అందుకే తప్పుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.

హైద్రాబాద్‌కు బాబు ఎంతో చేశారు: అజయ్ దేవగణ్, బాలీవుడ్‌ను దింపిన సీఎంహైద్రాబాద్‌కు బాబు ఎంతో చేశారు: అజయ్ దేవగణ్, బాలీవుడ్‌ను దింపిన సీఎం

అజయ్ దేవగణ్, తన భార్య కాజోల్‌లో కలిసి ఏపీ పర్యాటక శాకకు అంబాసిడర్లుగా నియమితులైన విషయం తెలిసిందే. కానీ, ఇంత వరకు అడ్వర్టయిజ్‌మెంట్ నిమిత్తం ఒక్క యాడ్ ఫిల్మ్‌ను కూడా అజయ్ దేవగణ్‌తో చిత్రీకరించలేదు.

Ajay Devgn not to be Andhra's brand ambassador due to 'unprofessional' approach?

అజయ్ దేవగణ్‌కు ఏదో ఒక కార్యక్రమంలో ఏపీలో గల పర్యాటక ప్రాంతాల గురించి వివరించిన సందర్భాలు లేవని అంటున్నారు. కేవలం ప్రకటనకే పరిమితం కావడంపై అజయ్ దేవగణ్ అప్ సెట్ అయ్యారని అంటున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం తాను ఎలాంటి డబ్బులు తీసుకోకపోయినా టాప్ ఏజెన్సీల ద్వారా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అజయ్ దేవగణ్ భావించారని, ఇందుకోసం అజయ్ - కాజోల్‌లు లింటాస్, ఒజిల్వీ వంటి సంస్థలను కూడా చూపించారని చెబుతున్నారు.

అమరావతిలో 'రియల్' బిజినెస్: 'రామకృష్ణ'కు మహేష్ అంబాసిడర్కానీ, ఏపీ అధికారులు మాత్రం స్థానిక ఏజెన్సీతో పట్టాలెక్కించాలని భావిస్తోంది. అజయ్ దేవగణ్ చెప్పిన ప్రముఖ యాడ్ సంస్థల సూచనను పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు. స్థానిక పీఆర్ ఎజెన్సీల ద్వారానే ముందుకెళ్లలని ప్రభుత్వం భావించడంతో అజయ్ దేవగణ్ దంపతులు అప్ సెట్ అయ్యారని వార్తలొస్తున్నాయి.

English summary
After reports that Bollywood actor Ajay Devgn was going to be the brand ambassador of Andhra Pradesh, the actor may soon opt out as he is reportedly upset with AP's 'lack of professional approach.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X