వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ వెళ్లిపోవడం బీజేపీకి దెబ్బ: అకాలీదల్, పట్టించుకోవట్లేదు: షాకు బాబు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం నేపథ్యంలో ఎన్డీయే మరో భాగస్వామ్య పక్షం అకాలీదళ్.. భారతీయ జనతా పార్టీపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో మోడీపై నమ్మకం ఉంచింది. భాగస్వాములు లేకుండా బీజేపీ అధికారంలోకి రాలేదని విమర్శించింది.

చదవండి: మీతో కలిసి ఉండంలో అర్థంలేదు: అమిత్ షాకు బాబు లేఖ, కారణాలు చెప్పిన సీఎం

తెలుగుదేశం పార్టీ వెళ్లిపోవడం బీజేపీకి పెద్ద దెబ్బ అని అభిప్రాయపడింది. ఎన్డీయేలో టీడీపీ అతిపెద్ద కూటమి అని, అది వెళ్లిపోవడం వల్ల బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొంది. భాగస్వాములను బీజేపీ పట్టించుకోవడం లేదన్నారు. అదే సమయంలో అకాలీదల్ మోడీపై విశ్వాసం కూడా ఉంచింది.

చదవండి: పరిస్థితి చేజారాక, ఎదుర్కోవాల్సిందే: చంద్రబాబుపై మళ్లీ పవన్

బీజేపీకి మాకు పాత మిత్రపక్షం

బీజేపీకి మాకు పాత మిత్రపక్షం

అకాలీ దళ్ మహిళా నాయకురాలు, కేంద్రమంత్రి హర్ సిమ్రాత్ కౌర్ టీడీపీ అవిశ్వాసంపై మాట్లాడుతూ.. తమ పార్టీకి బీజేపీ ఎప్పటి నుంచో మిత్రపక్షమని, ప్రస్తుతం తాము ఒక్కటిగా ఉండాల్సి ఉందని, గతంలోను ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు.

అమిత్ షాకు చంద్రబాబు

అమిత్ షాకు చంద్రబాబు

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాశారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డీయేతో జత కట్టామని అందులో పేర్కొన్నారు. అవి నెరవేరక పోవడం వల్ల ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.

హోదాను ప్రజలు కోరుకుంటున్నారు

హోదాను ప్రజలు కోరుకుంటున్నారు

ప్రత్యేకహోదాను ఏపీ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నా*రు. ఏపీకి ఇచ్చిన హామీని నెరవేర్చనందున ఇంకా ఎన్డీయేలో కొనసాగడం సరికాదన్నారు. రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.

 పొత్తులో అర్థం లేదు

పొత్తులో అర్థం లేదు

బీజేపీతో పొత్తు ద్వారా తాము ప్రజలకు చేయాల్సింది చేయలేకపోతున్నామని, అలాంటప్పుడు కలిసి ఉండటంలో అర్థం లేదని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిణామాలను కూడా వివరించారు. బీజేపీతో పొత్తు లక్ష్యం నెరవేరలేదన్నారు. విభజన హామీలు అమలు చేయడం లేదని, బీజేపీ ఏపీ ప్రజల మనోభావాలు పట్టించుకోవడం లేదని షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

English summary
BJP ally Akali Dal on Friday backed the Modi government, saying it has full confidence in it after the TDP exited the ruling alliance and tabled a no-trust motion in the Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X