ఆళ్లగడ్డ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుకోలేదు: శోభ కూతురు అఖిల, బాబుకు విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhil Priya says on her political entry
కర్నూలు: తొలి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆ దిశగానే తన తల్లిదండ్రులు కూడా తనను ప్రోత్సహించారని ఆళ్లగడ్డ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అన్నారు. అమ్మానాన్నలిద్దరూ రాజకీయాల్లో మునిగి తేలుతుండే వారని, వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమని చెప్పారు.

అయితే, రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉండేవారమన్నారు. అమ్మలేని లోటు తీర్చలేనిదన్నారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎన్నడూ ప్రస్తావన రాలేదన్నారు. అమ్మ స్థానంలో పోటీ చేయాల్సి వస్తుందని తాను ఊహించలేదన్నారు. నాన్న సహకారంతో పేదలకు మేలు చేయాలనే అమ్మ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని చెప్పారు.

చంద్రబాబుకు విజ్ఞప్తి

త్వరలో జరగనున్న ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికకు గానూ భూమా నాగిరెడ్డి కుమర్తె భూమా అఖిలప్రియను తమ అభ్యర్థిగా వైయస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని ఏకగ్రీవం చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు చంద్రబాబుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సమావేశం ఉప ఎన్నికలో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టరాదని విజ్ఞప్తి చేశారు. అయితే, వారి వినతికి చంద్రబాబు నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు. స్థానిక నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం పైన ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే.

భూమా నాగిరెడ్డి కూడా ఈ అంశంపై స్పందించారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా మరణించినప్పుడు వారి కుటుంబసభ్యులు ఎన్నికల బరిలోకి దిగితే వారిపై పోటీకి నిలుపకుండా ఇంత కాలం అన్ని పార్టీలు ఒక ఆచారాన్ని పాటిస్తూ వచ్చాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఆళ్లగడ్డ ఉపఎన్నికలో కూడా టీడీపీ ఇదే సంప్రదాయాన్ని పాటిస్తుందని భావిస్తున్నానని తెలిపారు.

English summary

 Sobha Nagi Reddy daughter Akhil Priya says on her political entry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X