వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిమ్మల్ని చూసి కాదు, ఛాన్స్ మిస్: జగన్‌కు అఖిలప్రియ షాక్, వైసిపి అధినేత ఆశ్చర్యం

మా ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులను ఎరగా వేస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాయడంపై మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: మా ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవులను ఎరగా వేస్తున్నారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాయడంపై మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండిపడ్డారు.

చదవండి : వీపు బాగుంది: ఎన్టీఆర్ మరో బయోపిక్‌పై వర్మ, భర్తను వదిలి.. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా?

మేం రాజీనామాకు సిద్ధమే కానీ

మేం రాజీనామాకు సిద్ధమే కానీ

ఆమె కర్నూలు జిల్లాలో మాట్లాడారు. అవసరమైతే తాము రాజీనామాలకు సిద్ధమని అఖిలప్రియ ప్రకటించారు. కానీ తాము అభివృద్ధి కోసమే టిడిపిలో చేరామని స్పష్టం చేశారు. వైసిపి అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు.

నంద్యాల ఫలితమే పునరావృతం

నంద్యాల ఫలితమే పునరావృతం

తాము రాజీనామా చేసి, తిరిగి ఉప ఎన్నికలు వస్తే నంద్యాల ఫలితమే వస్తుందని అఖిలప్రియ అన్నారు. నంద్యాలలో టిడిపి ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. తాము రాజీనామా చేసినా ఆ ఫలితమే ఉంటుందని వ్యాఖ్యానించారు.

జగన్‌, వైసిపిని చూసి ఓటేయలేదు

జగన్‌, వైసిపిని చూసి ఓటేయలేదు

నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలు వైసిపిని, ఆ పార్టీ అధినేత జగన్‌ను చూసి ఓటేయలేదని అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ కుటుంబాన్ని, భూమా నాగిరెడ్డిని చూసి ఓటు వేశారని స్పష్టం చేశారు.

వైసిపి, జగన్ మంచి అవకాశాన్ని కోల్పోయారు

వైసిపి, జగన్ మంచి అవకాశాన్ని కోల్పోయారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలను బహిష్కరించడంపై అఖిలప్రియ స్పందించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ మంచి వేదిక అన్నారు. ఇప్పుడు బహిష్కరణ ద్వారా వైసిపి మంచి అవకాశం కోల్పోయిందన్నారు.

టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై జగన్ ఆశ్చర్యం

టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలపై జగన్ ఆశ్చర్యం

కాగా, రాష్ట్రపతి కోవింద్‌కు జగన్ సుదీర్ఘ లేఖ రాసిన విషయం తెలిసిందే. 21 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారని, అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారని పేర్కొన్నారు. ఆ 21 మంది ఎమ్మెల్యేలను ఇప్పటికీ వైసిపి ప్రజాప్రతినిధులుగా చూపెట్టడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, వారికి అధికార పార్టీ వైపు సీట్లు ఇచ్చారని, పార్టీ (వైసిపి) అనుమతి లేకుండా వారికి మాట్లాడే అవకాశమిస్తున్నారని చెప్పారు.

English summary
Andhra Pradesh Minister and Allagadda MLA Bhuma Akhila Priya on Friday gave counter to YSR Congress Party chief YS Jaganmohan Reddy for his letter to president Ramnath Kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X