నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శిల్పా సోదరులు బెదిరించారు, కన్నెత్తిచూడకుండా..: అఖిల సంచలనం

శిల్పా మోహన్‌రెడ్డి సోదరులపై ఏపీ మంత్రి అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను శిల్పా సోదరులు బెదరించారని, అందుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: శిల్పా మోహన్‌రెడ్డి సోదరులపై ఏపీ మంత్రి అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను శిల్పా సోదరులు బెదరించారని, అందుకు సంబంధించిన రికార్డులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని అఖిలప్రియ ధీమా వ్యక్తం చేశారు.

నంద్యాలపై కన్నెత్తి చూడకుండా తీర్పు..

నంద్యాలపై కన్నెత్తి చూడకుండా తీర్పు..

ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు శిల్పా సోదరులు తీవ్రంగా ప్రయత్నించారని అఖిలప్రియ ఆరోపించారు. అయినా, మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. శిల్పా మోహన్‌రెడ్డి మరోసారి నంద్యాల వైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా నంద్యాల ఉప ఎన్నిక తీర్పు ఉంటుందని ఆమె అన్నారు.

Recommended Video

Nandyal By-Poll : A Big War Between Akhila Priya And Silpa Mohan Reddy
గెలుపు ఖాయం.. బాబు, లోకేష్లపై బ్రహ్మానందరెడ్డి

గెలుపు ఖాయం.. బాబు, లోకేష్లపై బ్రహ్మానందరెడ్డి

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌, ఇతర మంత్రులు చేసిన కృషి మరువలేనిదని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం తనకు ఉందని బ్రహ్మానందరెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

అనుకున్నదానికంటే..

అనుకున్నదానికంటే..

కాగా, నంద్యాల ఉప ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడంపై టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఎవరికివారే గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువ మెజార్టీని నంద్యాల ప్రజలు టీడీపీకి అందిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కిమిడి కళా వెంకట్రావు అభిప్రాయపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్‌ వాడిన భాష.. తమ పార్టీకి మెజార్టీని పెంచేదిగా మారిందన్నారు.

జగన్ పార్టీ అసాంఘిక కార్యకలాపాలు..

జగన్ పార్టీ అసాంఘిక కార్యకలాపాలు..

అరాచకాన్ని అంతమొందించాలన్నట్లుగా ఈ రోజు నంద్యాల ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌ సహా అసాంఘిక కార్యకలాపాల్లో జగన్ పార్టీ నేతలే ఉంటున్నారని ధ్వజమెత్తారు.

జాప్యంపై సోమిరెడ్డి అనుమానాం

జాప్యంపై సోమిరెడ్డి అనుమానాం

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌పై చర్యలు తీసుకోవాలని ఆగస్టు 21న సీఈసీ ఆదేశాలు జారీ చేసిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. అయితే ఆ ఆదేశాలపై రెండు రోజులు ఎందుకు గోప్యత పాటించారని ప్రశ్నించారు. సగం ఓటింగ్‌ జరిగాక అర్ధాంతరంగా ఎందుకు బయటపెట్టారని నిలదీశారు.ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు.

English summary
Andhra Pradesh minister Akhila Priya on Wednesday fired at YSRCP leaders Shilpa Mohan Reddy brothers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X