కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకు సమస్యలు చెప్పారు: అఖిలప్రియ, 'వారిని నమ్మి జగన్ మార్చుకోవడమా'

కర్నూలు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో చొరవ చూపుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

|
Google Oneindia TeluguNews

ఆళ్లగడ్డ: కర్నూలు జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో చొరవ చూపుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

ఆళ్లగడ్డ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ఆళ్లగడ్డ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చూస్తామని, పర్యాటక పరంగా జిల్లాను మొదటి వరుసలోకి తీసుకు వెళ్తానని అఖిలప్రియ చెప్పారు. తన సొంత నియోజకవర్గమైన ఆళ్లగడ్డ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు.

సమస్యలు నాకు చెప్పారు

సమస్యలు నాకు చెప్పారు

ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో ప్రజలు పలు సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చారని అఖిలప్రియ చెప్పారు. వాటిని నెరవేర్చి ప్రభుత్వం తమకు అండగా ఉంటుందనే భరోసాను కల్పిస్తానని చెప్పారు. కర్నూలు జిల్లాలో రైతుల కంట కన్నీరు రాకుండా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు.

నీటి సమస్యపై నేను ఉప ముఖ్యమంత్రి మాట్లాడుకుంటున్నాం

నీటి సమస్యపై నేను ఉప ముఖ్యమంత్రి మాట్లాడుకుంటున్నాం

వ్యవసాయ, ఉపాధి రంగాల్లో జిల్లా ముందంజ వేసేలా చర్యలు తీసుకుంటానని అఖిలప్రియ చెప్పారు. ముఖ్యంగా నీటి సమస్యను పరిష్కరించే విషయంలో నేను, ఉప ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూనే ఉన్నామని చెప్పారు. పండగ తర్వాత సమావేశం నిర్వహించి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు కూడా ఇందుకు పూర్తిగా సహకరించాలన్నారు.

వారిని నమ్మి పాదయాత్ర తేదీని మార్చుకోవడమా

వారిని నమ్మి పాదయాత్ర తేదీని మార్చుకోవడమా

జగన్ రాయలసీమ ద్రోహి అని మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ మండిపడ్డారు. ఏపీ అక్రమంగా నీటిని తోడేస్తోందని సాక్షి పత్రికలో ప్రచురించి రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిందన్నారు. జ్యోతిష్యుల మాటలు నమ్మి జగన్ పాదయాత్ర తేదీని మార్చుకోవడం విడ్డూరమన్నారు.

English summary
Andhra Pradesh Minister and Telugu Desam Party leader Akhila Priya promises Allagadda over development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X