వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ సాయం, జగన్ మరిచారు, రెచ్చగొట్టొద్దు: అఖిల హెచ్చరిక

వైసిపి అధినేత జగన్ జైలులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు చేసిన సాయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత జగన్ జైలులో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు చేసిన సాయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని మంత్రి భూమా అఖిలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు.

రోజా! నీ క్యారెక్టర్ ఏంటి?: టిడిపి ఎమ్మెల్సీ, వస్త్రధారణపై అఖిలప్రియరోజా! నీ క్యారెక్టర్ ఏంటి?: టిడిపి ఎమ్మెల్సీ, వస్త్రధారణపై అఖిలప్రియ

శోభానాగిరెడ్డిని గౌరవిస్తామని చెబుతున్నారే గానీ

శోభానాగిరెడ్డిని గౌరవిస్తామని చెబుతున్నారే గానీ

శోభా నాగిరెడ్డిని గౌరవిస్తున్నామని వైసిపి నేతలు చెబుతున్నారని, ఆమె పార్టీలో ఉండి మృతి చెందడం వల్లనే అలా అంటున్నారే తప్ప పార్టీలో లేకుంటే విమర్శలు చేసేవారన్నారు. ఈ విమర్శలకు మేం వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించకుండా రాజకీయాలు చేస్తామన్నారు.

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
ప్రశాంతంగా ఉంటారు.. వారిని రెచ్చగొట్టొద్దు

ప్రశాంతంగా ఉంటారు.. వారిని రెచ్చగొట్టొద్దు

13 ఏళ్లుగా ఉన్న దరిద్రాన్ని తొలగించి నంద్యాలను అభివృద్ధి చేస్తున్నట్లు అఖిలప్రియ తెలిపారు. పేదల కోసం నిర్మించే ఇళ్లపై వైసిపి నాయకులు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. నంద్యాల మహిళలు చాలా ప్రశాంతంగా ఉంటారని, వారిని వైసిపి నాయకులు రెచ్చగొట్టకూడదన్నారు.

శిల్పా చక్రపాణి రెడ్డి మాటల వల్లే

శిల్పా చక్రపాణి రెడ్డి మాటల వల్లే

మహిళలను కించపరచడం వల్లనే ధర్నా చేస్తున్నారని, శిల్పా చక్రపాణి రెడ్డికి ఇది పద్ధతి కాదని, దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దని అఖిలప్రియ కోరారు. ఎలాంటి చిచ్చు పెట్టకుండా కార్యక్రమాలు సజావుగా సాగడానికి సహకరించాలని కోరారు.

48 నామినేషన్లు

48 నామినేషన్లు

నంద్యాల ఉప ఎన్నికల బరిలో మొత్తం 30 మంది అభ్యర్థులు 48 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ప్రక్రియ జులై 29న ప్రారంభమైంది. భూమా బ్రహ్మానంద రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డిలతో పాటు మజ్లిస్, అన్న వైయస్సార్, కాంగ్రెస్‌, రాయలసీమ పరిరక్షణ సమితి, సమాజ్‌వాది సహా పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గడువు చివరి రోజు శనివారం ఏకంగా 28 నామినేషన్లు దాఖలయ్యాయి. నవతరం పార్టీ, అన్న వైయస్సార్ పార్టీ, మజ్లిస్, బీసీ యునైటైడ్‌ ఫ్రంట్‌, రాయలసీమ పరిరక్షణ సమితి, సమాజ్‌వాది పార్టీ, రాజ్యాధికార పార్టీలు నామినేషన్ పత్రాలు దాఖలు చేశాయి. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులు.

English summary
Minister and Telugu Desam Party leader Bhuma Akhila Priya warned YSR Congress Party leaders over nandyal bypoll. She said Nandyal women are very peaceful women.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X