గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ తో నాగార్జున భేటీ : గుంటూరు ఎంపీ సీటు పై చ‌ర్చ‌లు : ఆ పారిశ్రామిక వేత్త కోస‌మేనా..!

|
Google Oneindia TeluguNews

ప్ర‌ముఖ సినీ న‌టుడు నాగార్జున వైసిపి అధినేత జ‌గ‌న్ లో స‌మావేశ‌మ‌య్యారు. ఎన్నిక‌ల హీట్ లో నాగార్జున లోట‌స్ పాండ్ కు రావ‌టం..జ‌గ‌న్ తో అర‌గంట‌కు పైగా స‌మావేశం కావ‌టంతో ఇప్పుడు ఈ భేటీకి రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఏర్ప డింది. అయితే, ఈ భేటీలో గుంటూరు లోక్‌స‌భ సీటు పైనే చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం..

ఎంతో కాలంగా జ‌గ‌న్ తో మైత్రి..

ఎంతో కాలంగా జ‌గ‌న్ తో మైత్రి..

సినీ న‌టుడు నాగార్జున‌..వైసిపి అధినేత జ‌గ‌న్ మ‌ధ్య ఎంతో కాలంగా మైత్రి ఉంది. వైయ‌స్ హ‌యాంలో త‌ర‌చూ నాగార్జు న వైయ‌స్ ను క‌లిసేవారు. వైయ‌స్సార్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌య్యారు. అనేక ప‌ర్యాయాలు జ‌గ‌న్ తో స‌మావే శాలు జ‌రిపారు. అయితే, ఇప్పుడు ఎన్నిక‌ల వేళ‌..అందునా గుంటూరు జిల్లా వైసిపి నేత‌లు జ‌గ‌న్ వ‌ద్ద ఉన్న స‌మ‌యం లో నాగార్జున హాజ‌రు కావ‌టం చ‌ర్చ నీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా నాగార్జున కుటుంబ స‌భ్యులు గుంటూరు నుండి వైసిపి త‌ర‌పున పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో నాగార్జున గుంటూరు జిల్లా సీట్ పంచా యితీ స‌మ‌యంలో లోట‌స్ పాండ్ కు జ‌గ‌న్ ఆహ్వానించారు. గుంటూరు లోక్‌స‌భ గురించి చ‌ర్చ జ‌రిగిన‌ట్లు విశ్వ‌స నీయ స‌మాచారం. అయితే, నాగార్జున వైసిపి నుండి నేరుగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవకాశాలు త‌క్కువ‌ని పార్టీ నేత‌లు చెబు తున్నారు. జ‌గ‌న్ - నాగార్జున ఇద్ద‌రికీ స‌న్నిహితంగా ఉండే ఓ వ్య‌క్తికి గుంటూరు లోక్‌స‌భ సీటు ఇవ్వాల‌ని కోరుతున్న‌ట్లు గా తెలుస్తోంది.

ఆ పారిశ్రామిక వేత్త కోస‌మేనా..

ఆ పారిశ్రామిక వేత్త కోస‌మేనా..

ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఉన్న ఆ వ్య‌క్తికి వైసిపి నుండి లోక్‌స‌భ సీటు కోస‌మే నాగార్జున లోట‌స్ పాండ్ కు వెళ్లి జ‌గ‌న్ తో భేటీ అయిన‌ట్లు చెబుతున్నారు. ఆ పారిశ్రామిక వేత్త జ‌గ‌న్ కేసుల్లోనూ ఉన్నారు. కొద్ది కాలం జైలు శిక్ష అనుభ‌వించారు. వైయ‌స్ హ‌యాంలో భారీ ప్రాజెక్టు ద‌క్కించుకున్నారు. సొంత జిల్లా గుంటూరు కావ‌టంతో ఆయ‌న గుంటూరు నుండి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. అయితే, నాగార్జునే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని కొద్ది రోజులు ప్ర‌చారం జ‌రిగింది. దీంతో..జ‌గ‌న్ స్వ‌యంగా నాగార్జున మ‌న‌సులోని మాట తెలుసుకొనే ప్ర‌య త్నం చేసారు.

ఇద్ద‌రికీ స‌న్నిహితుడైన

ఇద్ద‌రికీ స‌న్నిహితుడైన

నాగార్జున తాను ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని..ఇద్ద‌రికీ స‌న్నిహితుడైన ఆ పారిశ్రామిక వేత్త‌కు సీటు ఇవ్వాల‌ని కోరిన‌ట్లు స‌మాచారం. అవ‌స‌ర‌మైతే తాను పార్టీ త‌ర‌పున ఎన్నిక‌ల్లో ప్రచారం చేస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక‌, గుంటూరు లోక్‌స‌భ సమ‌న్వ‌య‌క‌ర్త‌గా ప్ర‌స్తుతం ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అల్లుడు కిలారి రోశ‌య్య ఉ న్నారు. జ‌గ‌న్ ఒక‌వేళ ఆ పారిశ్రామిక వేత్త‌కు సీటు ఖ‌రారు చేస్తే..రోశ‌య్య కు ప్ర‌త్య‌మ్నాయం చూపించాల్సి ఉంటుంది. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటార‌నేది వేచి చూడాల్సిందే.

English summary
Cine Hero Nagarjuna Akkienei met YCp Cheif Jagan in Lotus pond. sources said he discussed about Guntur Loksabha seat for his closed associate. Jagan also positively respond on Nagarjuna Request.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X