వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలీకి జ‌గ‌న్ ఇచ్చిన హ‌మీ ఇదే : టిడిపి..జ‌న‌సేన‌లో ఎందుకు చేర‌లేదంటే : ఇక‌ ప్ర‌చారంలోకి..!

|
Google Oneindia TeluguNews

సినీ న‌టుడు అలీ వైసిపి లో చేరారు. కొంత కాలంగా ఆయ‌న ఏ పార్టీలో చేరుతార‌నే దాని పై స‌స్పెన్స్ కొన‌సాగింది. ఆలీ కి టిడిపి నుండి టిక్కెట్ ఖ‌రారైంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. సరిగ్గా ఇదే స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా ఆలీ వైసిపి లో చేరేం దుకు మొగ్గు చూపారు. వైసిపి లో చేరిన స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీకి ఆలీ సంతృప్తి చెందారు..

<strong>ఎన్నిక‌లకు సిద్దం : ఓట్ల విష‌యంలో జాగ్ర‌త్త : జ‌గ‌న్ కు ఒక్క సీటు వ‌చ్చినా కేసీఆర్ దే..!</strong>ఎన్నిక‌లకు సిద్దం : ఓట్ల విష‌యంలో జాగ్ర‌త్త : జ‌గ‌న్ కు ఒక్క సీటు వ‌చ్చినా కేసీఆర్ దే..!

నాడు టిడిపిలో ఇప్పుడు వైసిపిలో.

నాడు టిడిపిలో ఇప్పుడు వైసిపిలో.

స‌రిగ్గా 20 ఏళ్ల క్రితం టిడిపిలో చేరాన‌ని..అప్పుడు ఆ పార్టీ కండువా క‌ప్పుకుంటే..ఇప్పుడు వైసిపి లో చేరి ఈ పార్టీ కండు వా క‌ప్పుకున్నాన‌ని ఆలీ చెప్పారు. లోట‌స్ పాండ్‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో ఆలీ వైసిపి లో చేరారు. ఆయ‌న జ‌న‌సేన అధినే త ప‌వ‌న్ తో ఉన్న సాన్నిహ‌త్యం కార‌ణంగా జ‌న‌సేన‌లో చేరుతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌రువాత ముఖ్య‌మంత్రితో భేటీ అయ్యారు. ఆయ‌న‌కు గుంటూరు తూర్పు సీటు ఇస్తార‌ని లెక్కలు క‌ట్టారు. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో వైసిపి లో చేరా ల‌ని ఆలీ నిర్ణ‌యించారు.

పోటీ చేసే అవ‌కాశం

పోటీ చేసే అవ‌కాశం

అయితే, జ‌గ‌న్ ఇదే స‌మ‌యంలో ఓ స్ప‌ష్ట‌మైన విష‌యం చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో ఇప్ప‌టికే సీట్ల స‌ర్దుబాటు పై మాట ఇచ్చాన‌ని..పోటీ చేసే అవ‌కాశం ఇవ్వ‌లేన‌ని స్ప‌ష్టంగా చెప్పారు. ఈ ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం కోసం ప్ర‌చారం చేయాల‌ని..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత స‌ముచిత ప్రాధాన్య‌త ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. దీనికి ఆలీ సైతం అంగీకించారు. తాను జ‌గ‌న్ ను సీయం చేసేందుకు ప్రచారం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.

ఆ పార్టీల్లోకి ఎందుకు వెళ్ల‌లేదంటే...

ఆ పార్టీల్లోకి ఎందుకు వెళ్ల‌లేదంటే...

ఆలీ తొలుత జ‌న‌సేన‌..టిడిపిలో చేరుతార‌ని భావించిన ఆ పార్టీల్లో చేర‌లేదు. అయితే, దీనికి ఆలీ స్వ‌యంగా స‌మాధా నం ఇచ్చే ప్ర‌న‌య‌త్నం చేసారు. టిడిపి లో త‌న‌కు భ‌విష్య‌త్ కు భ‌రోసా క‌న్పించ‌లేద‌ని చెప్పుకొచ్చారు. వ‌ప‌న్ తో త‌న కు మంచి రిలేష‌న్ ఉంద‌న్నారు. స్నేహం వేరు..రాజ‌కీయం వేరు అని వివ‌రించారు.త‌న‌కు మంత్రి కావాల‌నేది క‌ల అని..ఆ దిశ‌గా ప్ర‌తిపాదించిన విష‌యం నిజ‌మేన‌ని స్ప‌ష్టం చేసారు. త‌న‌ను సోష‌ల్ మీడియా లో ఎవ‌రైనా టార్గెట్ చేస్తే వారిని పిచ్చోళ్లుగా చూస్తాన‌ని చెప్పుకొచ్చారు. తన‌కు చిన్ప‌ప్ప‌టి నుండి వైయ‌స్ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంద‌ని.. 2004 లో వైయ‌స్ ముఖ్య‌మంత్రి అవుతార‌ని ఆనాడే ఆయ‌న‌కే చెప్పాన‌ని..ఇప్పుడు జ‌గ‌న్ ను సీయం చేయ‌టం కోసం క‌ష్ట‌ప‌డ‌తాన‌ని చెప్పుకొచ్చ‌రు. జ‌గ‌న్ మాట ఇస్తే త‌ప్ప‌ర‌ని కితాబిచ్చారు. తాను వెంట‌నే ప్ర‌చారం లోకి దిగుతున్న‌ట్లు ఆలీ ప్ర‌క‌టించారు.

English summary
Cine actor Ali joined in YCP in presence of Jagan, At the time of joining Jagan clarified Ali that no chance for Assembly ticket he requested for stand for party. Ali also say that he is not contesting in this election and work for YCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X