• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ వ్యాఖ్యలకు ఆలీ కౌంటర్ .. పవన్ కు పలు ప్రశ్నలను సంధించిన ఆలీ

|
  Ap Assembly Election 2019 : నువ్వేమైనా నాకు సాయం చేసావా ? పవన్‌పై అలీ ఫైర్ ! || Oneindia Telugu

  రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రముఖ నటుడు, వైసీపీ నాయకుడు ఆలీ పైన సంచలనమైన వాఖ్యలు చేశారు . పవన్ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఆలీ పవన్ వ్యాఖ్యలపై ఎవరూ ఊహించని విధంగా ఘాటుగా స్పందించారు. పవన్ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను ఎవరి మీద ఆధారపడి పైకిరాలేదని , తాను తన కష్టాన్ని నమ్ముకునే ఎదిగానని ఆలీ అన్నారు .

  పవన్ లా చిరంజీవిగారు వేసిన బాటలో రాలేదు.. కష్టాన్ని నమ్ముకుని వచ్చానన్న ఆలీ

  పవన్ లా చిరంజీవిగారు వేసిన బాటలో రాలేదు.. కష్టాన్ని నమ్ముకుని వచ్చానన్న ఆలీ

  ఇక పవన్ పై వ్యాఖ్యలు చేసిన ఆలీ మీలా చిరంజీవిగారు వేసిన బాటలో రాలేదని చెప్పారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాక ముందునుండీ తాను నటుడినని , పవన్ ఇండస్ట్రీ కి వచ్చే సమయానికి తాను మంచి పొజిషన్ లోనే ఉన్నానని ఆలీ చెప్పుకొచ్చారు .అప్పటికి ఇప్పటికి నేను నా కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నానన్న ఆలీ నేను ఆకలికి చచ్చిపోతాను కానీ, దేహి అని ఎవరి దగ్గరకు వెళ్ళాను అంటూ పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు .

  పవన్ వ్యాఖ్యలతో మనస్తాపం చెందానన్న ఆలీ

  పవన్ వ్యాఖ్యలతో మనస్తాపం చెందానన్న ఆలీ

  నేను పుట్టింది, పెరిగింది రాజమండ్రి. నేను పుట్టిన గడ్డకు నా తండ్రి పేరున ట్రస్ట్ పెట్టుకొని కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్నానన్నారు ఆలీ .నేను పవన్ కళ్యాణ్ కి చాలా గౌరవం ఇస్తాను కానీ తన మాటలు బాధించాయని అన్నారు ఆలీ. తానెప్పుడూ పవన్ మంచి కోరుకుంటానని జీవితకాలం పవన్ తన గుండెల్లోనే ఉంటారని కానీ ఊహించని విధంగా పవన్ నాపై వ్యాఖ్యలు చేయటం ఏమిటని ఆలీ ఆవేదన చెందారు .

  జ‌గ‌న్ లా టిక్కెట్లు అమ్ముకోను : ఆయ‌న మామ న‌న్ను బెదిరించారు: ఆలీ..ఇదే నా స్నేహం: ప‌వ‌న్ ఫైర్‌..!జ‌గ‌న్ లా టిక్కెట్లు అమ్ముకోను : ఆయ‌న మామ న‌న్ను బెదిరించారు: ఆలీ..ఇదే నా స్నేహం: ప‌వ‌న్ ఫైర్‌..!

  ఆలీ కష్టాల్లో పవన్ ఏ విధంగా సాయపడ్డారో చెప్పాలి అని ప్రశ్నించిన ఆలీ

  ఆలీ కష్టాల్లో పవన్ ఏ విధంగా సాయపడ్డారో చెప్పాలి అని ప్రశ్నించిన ఆలీ

  ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్నారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైనా సినిమాలు చెప్పరా ? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా? అని ఆలీ పవన్ కళ్యాణ్ కు సూటిగా ప్రశ్నలు వేశారు . నేను ఏ పార్టీలోకి వెళ్లాలనే అంశం నా ఇష్టం .. మీరు ఎవరు డిసైడ్ చేయటానికి ?. నాకు నచ్చిన పని నేను చేస్తున్నా ..మీ అనుమతి నాకెందుకు ?అని అలీ పేర్కొన్నారు . మీరు నేను పుట్టిన రాజమండ్రిలో నాగురించి తప్పుగా కామెంట్స్ చేయడం సరికాదని అన్నారు. వైయస్సార్ సీపీలో వెళ్లటం తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో ఏమైనా రాసిపెట్టారా వైసీపీలోకి వెళ్లకూడదని అంటూ వాగ్బాణాలు సంధించారు .

  వైసీపీ లో చేరటం నా నిర్ణయం .. నా స్వేఛ్చ .. మీరెలా ప్రశ్నిస్తారన్న ఆలీ

  వైసీపీ లో చేరటం నా నిర్ణయం .. నా స్వేఛ్చ .. మీరెలా ప్రశ్నిస్తారన్న ఆలీ

  నాకు నచ్చిన నిర్ణయం తీసుకునే స్వేఛ్చ నాకు లేదా? మీ గురించి నేను ఎప్పుడైనా తప్పుగా వ్యాఖ్యానించానా ? అలా వ్యాఖ్యానిస్తే మీరు నాగురించి కామెంట్ చేయాలి. నా నెంబర్ మీ దగ్గర ఉంది. 14 ఏళ్లు నుంచి ఒకే నెంబర్ మెయింటైన్ చేస్తున్నాను. పార్టీలోకి రమ్మని నన్ను మీరు ఎప్పుడైనా అడిగారా? అడగనప్పుడు ఇంత పెద్ద కామెంట్ చేయటం ఎందుకు? అని ఆలీ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద ఆలీ సంధించిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారో మరి.

  English summary
  Pawan Kalyan's latest comments on his friend Ali in Rajahmundry meeting turned sensation as many did not expect this from Janasena chief. Pawan Kalyan in his Rajahmundry election campaign alleged that Ali chose his own benefits even when he gave the Narasaraopet MP ticket to a person in Ali's family.Pawan made several other comments in the same campaign on why Ali preferred YSRC to Janasena and those particular comments maligned Ali's image and also left the comedian turned politician upset.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X