హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందరూ వెయిటింగ్: సుజయ, 'దాడి గురించి జగన్‌కు ముందే తెలుసు, అందుకే అలా'

|
Google Oneindia TeluguNews

విజయనగరం/అమరావతి: విశాఖపట్నం విమానాశ్రయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌పైన దాడికి కారకులు ఎవరో తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తున్నారని మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజయ కృష్ణ రంగారావు సోమవారం విజయనగరంలో అన్నారు.

బాబుపై డౌట్, జగన్‌ని లేకుండా చేస్తే అలా అవుతుందనే, సెల్యూట్ చేస్తా: మేకపాటిబాబుపై డౌట్, జగన్‌ని లేకుండా చేస్తే అలా అవుతుందనే, సెల్యూట్ చేస్తా: మేకపాటి

విచారణకు సహకరించకున్నా నిజాలు తెలుస్తాయి

విచారణకు సహకరించకున్నా నిజాలు తెలుస్తాయి

దాడిపై జగన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఎయిర్ పోర్టులో దాడి జరిగితే పోలీసులపై నిందలు వేయడం ఎందుకని ప్రశ్నించారు. జగన్ విచారణకు సహకరించకపోయినా నిజాలు తేలుస్తామని చెప్పారు. ప్రతిపక్ష నేత విచారణకు సహకరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

దాడి గురించి జగన్‌కు ముందే తెలుసు, ఎలాంటి హావభావాలు లేవు

దాడి గురించి జగన్‌కు ముందే తెలుసు, ఎలాంటి హావభావాలు లేవు

అంతకుముందు, కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. దాడి గురించి జగన్‌కు ముందే తెలుసునని ఆరోపించారు. పాదయాత్రకు ఏపీ పోలీసులు కావాలని, కానీ విచారణ జరపడానికి అవసరం లేదా అని నిలదీశారు. మానసికంగా సిద్ధమైనందునే ఘటన తర్వాత జగన్‌లో ఎలాంటి హావభావాలు లేవని చెప్పారు.

దాడికి పాల్పడిన వ్యక్తిని కొట్టొద్దని వారించారు

దాడికి పాల్పడిన వ్యక్తిని కొట్టొద్దని వారించారు

దాడికి పాల్పడిన వ్యక్తిని కొట్టొద్దని జగన్ వారించినట్లు విచారణలో తేలిందని కాల్వ శ్రీనివాసులు అన్నారు. ఘటన తర్వాత జగన్ నవ్వుతూ హైదరాబాద్ వెళ్లారని, సానుభూతి కోసం ప్రయత్నించారని ఆరోపించారు. జగన్ పైన జరిగిన దాడిని తాము ఖండించామని చెప్పారు. జగన్ డ్రామా రక్తికట్టలేదని, ప్రజలు దీనిని నమ్మలేదన్నారు.

ఏపీ పోలీసుల సహకారం లేకుండానే నడిచారా?

ఏపీ పోలీసుల సహకారం లేకుండానే నడిచారా?

జగన్‌పై దాడి కేసును పక్కదారి పట్టించేందుకే వైసీపీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. జగన్‌పై దాడి కేసులో ప్రభుత్వం అన్ని కోణాల్లో విచారణ చేస్తోందన్నారు. రాష్ట్ర పోలీసుల సహకారం లేకుండానే జగన్ మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారా అని ప్రశ్నించారు. జగన్ ఆడుతున్న నాటకం అందరికీ అర్థమైందన్నారు. టీడీపీ నకిలీ సభ్యత్య నమోదు కార్డు తయారు చేసి తమపై నిందలు వేయడం ఏమిటన్నారు. జగన్ సీఎం కావడం కోసమే దాడి చేసినట్లు నిందితుడు చెప్పాడని, ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఆరోపణలు సరికాదన్నారు.

English summary
Telugudesam Party leader and Minister Sujaya Krishna Ranga Rao on Monday said that All are waiting for who is behind Srinivas Rao, Who was YS Jagan attacker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X