వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఇక ఉద్యోగులతో మొదలు, 21 నుంచే ఆరంభం

|
Google Oneindia TeluguNews

కరోనావైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుండటంతో 60 రోజులకు పైగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. దీంతో తీవ్రమైన నష్టం వాటిల్లింది. ఆర్థికంగా దేశం మొత్తం నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఇక మరింతగా కృంగిపోకూడదని భావించిన కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూనే పలు ఆంక్షలు ఎత్తివేస్తూ వస్తోంది. తాజాగా దేశంలో లాక్‌డౌన్ 4.0 అమల్లో ఉంది. అయితే ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుని చాలావరకు సడలింపులను ఇస్తూ లాక్‌డౌన్‌ను పొడిగించింది. దీంతో మే 18 నుంచి దేశవ్యాప్తంగా పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అన్ని నిబంధనలు పాటిస్తూనే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ప్రారంభం అవుతాయని చెప్పిన కొద్ది గంటల్లోనే ఏపీ ప్రభుత్వం కూడా ఇదే రకమైన నిర్ణయంను వెల్లడించింది.

ఆర్థికంగా నష్టపోయిన రాష్టం

ఆర్థికంగా నష్టపోయిన రాష్టం


నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఆ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వెంటాడాయి. ఇబ్బందుల సుడిగుండంలోనే గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వాలు నెట్టుకొస్తున్నాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్‌పై కరోనావైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపింది. దీంతో లాక్‌డౌన్ అమల్లోకి రావడం ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థికంగా ఈ రాష్ట్రం చాలా నష్టపోయింది. కరోనావైరస్‌ నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ చాలావరకు సడలింపులు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కార్.

21వ తేదీనుంచే షురూ...

21వ తేదీనుంచే షురూ...

ఈ నెల 21వ తేది నుంచి 100శాతం ఉద్యోగులతో ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకాలపాలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. అయితే కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన గైడ్‌లైన్స్‌ను తప్పకుండా పాటించాలని ఆదేశాలిచ్చింది. ఇక గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇంటినుంచే పనిచేసేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఇక ప్రతి గవర్నమెంట్ ఆఫీసు గేటుముందు శానిటైజర్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి ఉద్యోగి మాస్కులు ధరించే ఉండాలని వెల్లడించింది. ఇక అదే సమయంలో సామాజిక దూరాన్ని మెయిన్‌టెయిన్ చేయాలని సూచించింది.

Recommended Video

Gold Price Reduced Today, 10 grams Gold Now 47,980
నిబంధనలు ఉల్లంఘిస్తే...

నిబంధనలు ఉల్లంఘిస్తే...

ఇక కరోనావైరస్ జాగ్రత్తచర్యల్లో భాగంగా ఉద్యోగులు వీలైనంత వరకూ ఎక్కువసార్లు చేతులు కడుక్కోవాలని వెల్లడించింది. ఇక ఆఫీసుల్లో ఛైర్లను కనీసం అంటే ఆరడుగుల దూరంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గుట్కాలు, నిషేధిత పదార్థాలు , ఉమ్మివేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఇక మీటింగులు ఇతరత్ర డిబేట్లు పెట్టరాదని కచ్చితంగా చెప్పిన ప్రభుత్వం అత్యవసరమైతే వీడియో టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా మీటింగ్‌లు నిర్వహించాలని సూచించింది. ఇక ఈ ఫైలింగ్ ద్వారానే ఫైల్స్‌ను వర్కౌట్ చేయాలని సూచించింది.

English summary
AP govt had decided to open all govt offices from May 21st
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X