వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులందరూ సచివాలయానికి రండి...సీఎం కార్యాలయం ఆదేశాలు

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:అందుబాటులో ఉన్న మంత్రులంతా సచివాలయానికి రావాలంటూ సీఎంవో నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మంత్రి నారా లోకేష్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు.

శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ నేపథ్యంలో అనంతరం పరిణామాలపై మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు చర్చించేందుకే ఈ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగం అనంతరం ఏపీ వైఖరిని ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

All ministers have to come to the secretariat ... CM office orders

ఆ క్రమంలో లోక్‌సభలో పరిణామాలపై సిఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఢిల్లీలోని ఎంపీలు, అధికారుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే విషయమై ఆర్థికమంత్రి యనమలతో ఫోన్లో మాట్లాడిన సీఎం చంద్రబాబు అక్కడి పరిణామాలను, యనమల నుంచి ఫీడ్ బ్యాక్ ను అడిగి తెలుసుకుంటున్నారు.

English summary
Amaravati: All the available ministers have got information from the CMO to come to the secretariat. In this backdrop Minister Nara Lokesh canceled the tour of the West Godavari district visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X