గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి శంకుస్థాపనకి వెళ్తున్నారా: ఇదిగో రూట్‌మ్యాప్‌(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయనున్న వీఐపీల భద్రత కోసం తెలంగాణ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తెప్పించినట్లు ఏపీ డీజీపీ రాముడు అన్నారు. మంగళవారం ఆయన అమరావతి శంకుస్థాపన కార్యక్రమంపై జరుగుతున్న ఏర్పాట్ల గురించి మాట్లాడారు.

రాజధాని శంకుస్థాపన, దసరా పండుగ, ప్రధాని మోడీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే సామాన్య ప్రజలకు సైతం ఉండవల్లి మీదుగా అమనుతించేలా ఏర్పాట్లు చేశామన్నారు. విదేశీ అతిథులు, రాయబారులతో పాటు ఇతర వీఐపీల కోసం వివిధ రోడ్లను కేటాయించామన్నారు.

ట్రిపుల్ ఏ పాస్‌లు కలిగిన వారికి కరకట్ట మీదుగా, డబుల్ ఏ పాస్‌లు కలిగిన వీఐపీలకు కరకట్ట దిగువ రోడ్డు మీదుగా శంకుస్థాపన స్థలానికి వెళ్లేలా మ్యాప్‌లను రూపొందించామని డీజీపీ పేర్కొన్నారు. సాధారణ ప్రజల కోసం ఉండవల్లి, మంగళగిరి నుంచి వెళ్లే దారులను కేటాయించామన్నారు.

గుంటూరు, మంగళగిరి, మందడం మీదుగా వేదిక వద్దకు చేరుకోవచ్చని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు తరలి వస్తుండడంతో అన్ని రకాల బలగాలతోపాటు డ్రోన్స్ వంటి అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

రాజధాని అమరావతి శంకుస్థాపనకు వెళ్లే వాహనాలు ట్రాఫిక్ జాంలో ఇరుక్కోకుండా ఉండేందుకు ఎనిమిది రహదారులను సిద్ధం చేశామన్నారు. ఒక్కో వైపు నుంచి వచ్చే వారికి ఒక్కో దారిని ప్రకటించారు. హైదరాబాద్, విశాఖపట్నం, కడప, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలకు ముఖ్యమైన సూచనలు చేశారు.

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

గన్నవరం విమానాశ్రయంలో దిగి వేదికకు వచ్చే వారు బెంజ్ సర్కిల్‌కు చేరుకుని, అక్కడి నుంచి గుంటూరు దారిలో కనకదుర్గ వారధి మీదుగా తాడేపల్లి చేరుకోవాలి. తాడేపల్లి వద్ద వంతెన కింద నుంచి కుడివైపు తిరిగి పంప్ హౌస్, ఎన్టీఆర్ కట్ట మీదుగా ఉండవల్లి జంక్షన్‌కు, అక్కడి నుంచి ఉండవల్లి వంతెన దాటి ఎడమవైపు తిరిగి భీష్మాచార్య రోడ్డు మీదుగా ఉద్ధండరాయుని పాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు చేరుకోవచ్చు.

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

ఇది వీఐపీ పాసులున్న వారికి మాత్రమే. సాధారణ పాసులు ఉన్నవారు ఇదే దారిలో ఉండవల్లి జంక్షన్ నుంచి స్క్రూ బ్రిడ్జి మీదుగా వేదిక వద్దకు వెళ్లాల్సి వుంటుంది. గుంటూరు వైపు నుంచి వచ్చే వారు సైతం తాడేపల్లి వరకూ వచ్చి ఇదే దారిలో చేరుకోవచ్చు.

 అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

ఇక హైదరాబాద్ నుంచి వచ్చే వారు నందిగామ, ఇబ్రహీంపట్నం దాటాక గొల్లపూడి బైపాస్, సితార జంక్షన్, రామవరప్పాడు మీదుగా బెంజ్ సర్కిల్ చేరి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వెళ్లాల్సి ఉంటుంది.

 అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

వీటితో పాటు గుంటూరు జిల్లా అమరావతి నుంచి మద్దూరు కొండ మీదుగా తుళ్లూరు వరకూ వచ్చే జిల్లా రహదారి, మంగళగిరి నుంచి పెనుమాక వరకూ వెళ్లే రహదారులను సైతం అధికారులు సిద్ధం చేశారు.

 అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

దీంతో పాటు పెదకూరపాడు నుంచి అమరావతి, గుంటూరు రోడ్డును క్రాస్ చేస్తూ తుళ్లూరు వెళ్లే రోడ్డును, తాడికొండ నుంచి పెదపరిమి మీదుగా ఉన్న రహదారిని విస్తరించారు.

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

గుంటూరు దాటిన తరువాత కంతేరు, నిడమర్రు, ఐనవోలు మీదుగా రహదారిని సైతం రెడీ చేశారు. ట్రాఫిక్ ను బట్టి ఏ వాహనం ఏ దారిలో వెళ్లాలన్న విషయాన్ని వాహనదారులకు ఎప్పటికప్పుడు తెలిపేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చే సాధారణ ప్రజలు వాహనాల కోసం విజయవాడ-అమరావతి రోడ్డు మార్గంలో పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

 అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

అన్ని రోడ్లు అటు వైపే: అమరావతికి వెళ్లే వారు ఏ రూట్లో ఎలా

రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని తెలుగు ప్రజలు పండుగలా జరుపుకోవడం తోపాటు సుమారు 2 లక్షల మంది వరకూ హాజరయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి 1500 వీఐపీలు వస్తున్నారు.

English summary
All Roads Lead to Andhra Pradesh capital Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X