వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP Bandh on 5th March 2021 : రేపు ఏపీ బంద్‌- విశాఖ ఉక్కుకు మద్దతుగా

|
Google Oneindia TeluguNews

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కార్మికసంఘాల పిలుపు మేరకు రేపు తలపెట్టిన ఏపీ బంద్‌కు సర్వం సిద్ధమైంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికసంఘాలతో పాటు వామపక్ష పార్టీలకు చెందిన అన్ని కార్మికసంఘాలు ఏపీలోని 13 జిల్లాల్లో రేపు బంద్‌ నిర్వహించనున్నాయి. దీనికి ఇప్పటికే విపక్ష టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు ఈ బంద్‌ను విజయవంతం చేయాలని కార్మికసంఘాలు భావిస్తున్నాయి. అయితే మున్సిపల్‌ ఎన్నికల వేళ బంద్‌కు టీడీపీ, వామపక్ష పార్టీల మద్దతు కీలకం కానుంది.

విశాఖ ఉక్కుపై రేపు ఏపీ బంద్‌

విశాఖ ఉక్కుపై రేపు ఏపీ బంద్‌


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతున్న వేళ దాన్ని అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని కార్మికసంఘాలు భావిస్తున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి పేరుతో ఏర్పాటైన కమిటీతో పాటు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ఇప్పటికే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి. దీన్ని మరింత తీవ్రతరం చేసేందుకు వీలుగా రేపు ఏపీ బంద్‌కు కార్మికసంఘాలు పిలుపునిచ్చాయి. విపక్ష పార్టీల మద్దతు కూడా లభిస్తున్న నేపథ్యంలో బంద్‌ను పరిపూర్ణం చేసేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అటు బంద్‌కు ప్రభుత్వంతో పాటు అధికార వైసీపీ కూడా అనివార్యంగా సహకరించాల్సిన పరిస్ధితి ఉంది.

 బంద్‌కు టీడీపీ, వామపక్షాల మద్దతు

బంద్‌కు టీడీపీ, వామపక్షాల మద్దతు


స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రధాన విపక్షం టీడీపీతో పాటు సీపీఎం, సీపీఐ వంటి వామపక్ష పార్టీలు కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. కార్మికులతో కలిసి బంద్‌ను ఊరూవాడా విజయవంతం చేయాలని ఆయా పార్టీలు నిర్ణయించాయి. ఈ బంద్‌ విజయవంతమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుందని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌పై దూకుడుగా ముందుకెళ్తున్న కేంద్రానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ బంద్‌ను వాడుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయి.

బంద్‌కు అనివార్యంగా వైసీపీ మద్దతు

బంద్‌కు అనివార్యంగా వైసీపీ మద్దతు


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటన వచ్చినప్పటి నుంచి పోరులో కార్మిక సంఘాలకు సంఘీభావం ప్రకటిస్తూ వస్తున్న అధికార వైసీపీ ఈ బంద్‌కు మాత్రం నేరుగా మద్దతిచ్చే పరిస్ధితి లేదు. ప్రభుత్వంలో ఉంటూ బంద్‌కు మద్దతిచ్చారన్న విమర్శలను తప్పించుకునేందుకు పరోక్షంగా మద్దతిచ్చేందుకు వైసీపీ సిద్దమవుతోంది. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో భారీ పాదయాత్ర నిర్వహించిన వైసీపీ నేతలు రేపటి బంద్‌లోనూ ఒంటరిగానే నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. అసలే విశాఖలో జీవీఎంసీ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ ఎన్నికల అంశంగా మారిపోయిన నేపథ్యంలో వైసీపీ అనివార్యంగా బంద్‌కు సహకరించక తప్పని పరిస్ధితి.

ఏపీ బంద్‌కు బీజేపీ-జనసేన దూరం

ఏపీ బంద్‌కు బీజేపీ-జనసేన దూరం

కేంద్రం తీసుకున్న వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయంతో ఇరుకున పడ్డ వారిలో బీజేపీ-జనసేన పార్టీలు ముందువరుసలో ఉన్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేక, అలాగని అంగీకరించి స్ధానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్ధితి లేక ఇరుపార్టీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికీ కేంద్రం స్టీల్‌ ప్లాంట్‌పై నిర్ణయం తీసుకోలేదని చెప్పుకుంటన్న బీజేపీ నేతలు ఈ బంద్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. స్టీల్‌ ప్లాంట్ వ్యవహారాన్ని ఏఫీలో అధికార, విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న బీజేపీ-జనసేన కూటమి రేపటి బంద్‌కు దూరంగా ఉండనుంది.

మరో ఉక్కు పోరాటానికి నాంది

మరో ఉక్కు పోరాటానికి నాంది

స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు తలపెట్టిన రాష్ట్రబంద్‌ను విజయవంతం చేసేందుకు టీడీపీతో పాటు కమ్యూనిస్టులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే విశాఖలో కార్మికసంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ సమితితో కలిసి ఆందోళనలు చేపడుతున్న ఆయా పార్టీలు ఇప్పుడు రేపటి బంద్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే విషయంలో తడబడుతున్న టీడీపీ, సీపీఐ ఇప్పుడు బంద్‌ను కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకోబోతున్నాయి.. బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా మరో ఉక్కు పోరాటానికి నాంది పలుకుతున్నట్లు టీడీపీ-సీపీఐ నేతలు చెప్తున్నారు. గతంలో స్టీల్‌ ప్లాంట్‌ కోసం సాగించిన ఉద్యమం అనుభవాల్ని గుర్తు చేసేలా ఈ బంద్ నిర్వహించనున్నారు.

English summary
all set for tomorrow's andhra pradesh bandh call given by vizag steel plant trade unions against privatisation of the industry. tdp and communist parties already extend their support to the bandh call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X