వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడ కార్పోరేషన్ ఫలితం నేడే, గెలుపుపై టిడిపి, వైసీపీ ధీమా

By Narsimha
|
Google Oneindia TeluguNews

కాకినాడ: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 1వ, తేదిన విడుదల కానున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసింది. సెప్టెంబర్ 1వ, తేదిన ఉదయం 8 గంటలకు కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

All set for kakinada corporation counting

ఓట్ల లెక్కింపునకు సంబంధించి మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా, 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. 14 డివిజన్లకు సంబంధించిన 1వ నెంబర్ ఈవీఎంలను తొలుత లెక్కిస్తారు. కొన్ని డివిజన్లకు సంబంధించిన ఫలితాలు 3 రౌండ్లలోనే వెలువడే అవకాశం ఉంది. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి 14 డివిజన్ల ఫలితాలు తెలియనున్నాయి. ఒక్కో రౌండ్ కు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టవచ్చని, ప్రతి గంటకు సగటున 14 డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని అంచనా.

కాగా, ఈ నెల 29న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. మొత్తం 50 డివిజన్లు ఉండగా, 48 డివిజన్లకే పోలింగ్ జరిగింది. హైకోర్టులో విచారణ కారణంగా మిగిలిన రెండు డివిజన్లకు పోలింగ్ నిర్వహించలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలసి పోటీ చేశాయి. టీడీపీ 39 డివిజన్లలో, బీజేపీ 9 డివిజన్లలో బరిలోకి దిగగా, వైసీపీ 48 డివిజన్లలోనూ పోటీ చేసింది.

కాంగ్రెస్ పార్టీ 17 చోట్ల, సీపీఐ, సీపీఎం రెండు చోట్ల, బీఎస్పీ 3 చోట్ల పోటీ చేశాయి. మొత్తంగా 48 డివిజన్లలోనూ బరిలోకి దిగిన అభ్యర్థుల సంఖ్య 241. ఇదిలా ఉండగా, నంద్యాల ఉపఎన్నిక ఫలితమే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

English summary
Arrangements for counting of votes pertaining to the Kakinada Municipal Corporation (KMC) have been completed. The counting will begin at 8 a.m. at Rangaraya Government Medical College on September 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X