హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొద్ది గంటల్లో సమైక్య సభ: జగన్ ఫ్లెక్సీలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్య శంఖారావం సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం సాయంత్రం పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

శనివారం ఉదయం నుంచే సభకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. జగన్ ఫ్లెక్సీలు ధరించి వారు నగరానికి చేరుకుంటున్నారు. కాగా, సమైక్య శంఖారారం సభ వాయిదా పడదని, శనివారం సభ యధాతధంగా జరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు.

సీమాంధ్ర ప్రజల ఆవేదనను ఢిల్లీకి తెలియజేసేందుకే సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విభజనకు రాష్ట్రం సహకరిస్తోందని ఆరోపించారు. తుపాను కంటే రాష్ట్ర విభజన సమస్య తీవ్రమైందని ఆయన అన్నారు. తుపాను కార్యక్రమాల్లో పాల్గొనే కార్యకర్తలు సభకు రావాల్సిన అవసరంలేదని కొణతాల తెలిపారు.

మైదానం తడిసింది...

మైదానం తడిసింది...

ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం తడిసిపోయింది. అయినా సభకు ఈ విధంగా ఏర్పాట్లు చేశారు.

గొడుగు సాయంతోనే ఏర్పాట్లు..

గొడుగు సాయంతోనే ఏర్పాట్లు..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డికి ఏర్పాట్ల పర్యవేక్షణ సందర్భంగా ఈ విధంగా గొడుగు పట్టారు. వర్షం కారణంగా సభను వాయిదా వేయడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇష్టపడడం లేదు.

ఇలా కనిపించిన దృశ్యం..

ఇలా కనిపించిన దృశ్యం..

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్య శంఖారావం సభకు ఏర్పాట్లు చేసే క్రమంలో ఇలా కనిపించింది. ఇది శుక్రవారం సాయంత్రం దృశ్యం.

తనిఖీ చేసి పంపిస్తున్నారు..

తనిఖీ చేసి పంపిస్తున్నారు..

పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరినీ ఎల్బీ స్టేడియంలోకి పంపిస్తున్నారు. వర్షం కారణంగా హైదరాబాదులో తీవ్రమైన చలి వాతావరణం నెలకొని ఉంది.

జగన్ ఫ్లెక్సీ ఇలా...

జగన్ ఫ్లెక్సీ ఇలా...

హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం వద్ద వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఫ్లెక్సీని ఇలా నెలకొల్పారు. శనివారం ఉదయం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఎవరూ మైదానం వద్దకు రాలేదు

మైదానం వద్ద జగన్ చిత్రాలే..

మైదానం వద్ద జగన్ చిత్రాలే..

ఎల్బీ స్టేడియం వద్ద రోడ్లపై వైయస్ జగన్ సమైక్య శంఖరావం ఫ్లెక్సీలను, పోస్టర్లను పెద్ద యెత్తున నెలకొల్పారు. సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. పోలీసుల షరతుల ప్రకారం సాయంత్రం ఐదు గంటలలోపు పూర్త చేయాలి.

English summary
All set to YSR Congress party president YS Jagan's Samaikya Shankharavam public meeting at LB stadium in Hyderabad opposing the creation of Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X