వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో అన్ని వైన్ షాపుల వద్ద కిటకిట ... ఆ ఒక్క మద్యం షాపు కొనేవారు లేక వెలవెల .. రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

ఏపీలో లిక్కర్ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం 75 శాతం లిక్కర్ ధరలను పెంచినా సరే మందుబాబులు మాత్రం కొనుగోలుకు ఏ మాత్రం వెనకడుగు వెయ్యటం లేదు. ఇక మద్యం షాపుల వద్ద కరోనా వైరస్ ప్రబలకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలని , మాస్కులు ధరించాలని , ఒకరికి ఒకరు తాకవద్దని చెప్పి పలు నిబంధనలతో మద్యం షాపులు ఓపెనింగ్ చేసిన సర్కార్ అవాక్కయ్యేలా మందుబాబులు భారీగా మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. ఒక తిరునాళ్ళలాగా ఏపీలో లిక్కర్ షాపుల వద్ద వాతావరణం మారింది.

నిన్నటి దాకా రోడ్ల మీద లాక్ డౌన్ విధులు నిర్వర్తించిన పోలీసులకు మందు బాబుల క్యూ లైన్లు మెయిన్ టైన్ చెయ్యటం కష్టంగా మారింది .ఏపీలో సోమవారం ఒక్కరోజు రూ. 68 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి అంటే మందుబాబులు ఎంతగా మద్యం కొనుగోలు చేస్తున్నారో అర్ధం అవుతుంది . ఇక ఇదే సమయంలో అన్ని లిక్కర్ షాపుల వద్ద జోరుగా వ్యాపారం సాగుతుంటే ఒకే ఒక్క లిక్కర్ షాప్ కొనేవారు లేక వెలవెలబోతుంది. ఇక అన్ని మద్యం షాపుల పరిస్థితి మూడు బీర్లు ,ముప్పై లిక్కర్ సీసాలుగా ఉంటె, అనంతపురం జిలాల్లోని మడకశిరలో మద్యం షాపుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉన్నది. మడకశిరలో మద్యం షాపు తెరిచినప్పటికీ కూడా ఎవరూ కూడా మద్యం కొనుగోలు చేసేందుకు షాపులకు రాని పరిస్థితి లిక్కర్ షాపుల వాళ్లకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది .

All wine shops are busy in ap .. only one shop has no liquor sales .. this is the reason

ఇక ఇక్కడి వారు మద్యం తాగరు కావచ్చు అనుకుంటే తప్పులో కాలేసినట్టే . అక్కడ వైన్స్ లో స్థానికులు మద్యం కొనకపోవటానికి కారణం ఈ షాపు కర్ణాటక బోర్డర్ లో ఉండటమే.
ఏపీలో మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో మడకశిర వాసులు అక్కడ మద్యం కొనుగోలు చెయ్యటం లేదు . బోర్డర్ లో ఉన్న వ్యక్తులు మడకశిర షాపులో మద్యం కొనుగోలు చేయకుండా అక్కడికి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకకు వెళ్లి మద్యం షాపులో మద్యం కొనుగోలు చేస్తున్నారని తెలుస్తుంది . రాష్ట్రంలో అన్ని షాపుల వద్ద సందడి కనిపిస్తుంటే మడకశిరలోని మద్యం షాపు వద్ద మాత్రం జనాలు లేక వెలవెలబోయింది. ఇక అక్కడి ప్రజలు లిక్కర్ కోసం బోర్డర్ దాటి కర్ణాటక బాట పట్టారు .

English summary
all the wine shops in AP are busy with liquor lovers' purchases, then the situation of liquor shops in the district of Anantapur is different. No one has come forward to buy liquor even though the liquor shop has opened in Madakashira. The reason is that this shop is located in Karnataka Border. With alcohol prices soaring in the AP, people in the Border are moving to Karnataka, ten kilometers away from buying liquor at a liquor store.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X