అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని భూములపై చీకటి ఒప్పందాలు: బాబును ఏకేసిన జగన్ పార్టీ నేత ఆళ్ల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాజధాని ప్రాంతంలో విదేశీ సంస్థలతో కుదుర్చుకుంటున్న ఒప్పందాలన్నింటినీ బహిర్గతం చేయాలనీ, వెంటనే లావాదేవీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

ఆయన బుధవారం వైయస్సార్‌ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను, ఇవ్వని రైతులను కూడా చంద్రబాబు దారుణంగా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సింగపూర్ సంస్థలైన సెమ్‌కార్ప్, సెమ్‌బ్రిడ్జి, అసెండాస్‌కు 1,700 ఎకరాల భూమిని ధారాదత్తం చేస్తూ సీఆర్‌డీఏ ఒప్పందం చేసుకుందని తెలిపారు.

chandrababu naidu-alla ramakrishna reddy

చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు భూములిచ్చిన రైతులకు కచ్చితంగా ఈ 1,700 ఎకరాల్లోనే వాణిజ్య ప్లాట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఒప్పందాలు చేసుకునేటపుడు ఎక్కడైనా ప్రైవేటు వాటా తక్కువగా ఉంటుందని కానీ, చంద్రబాబు కొత్త పద్ధతికి తెరలేపుతూ తొలి దశ ఒప్పందంలో 58% ప్రైవేటుకు ఇచ్చి 42% ప్రభుత్వ సంస్థలు తీసుకుంటున్నాయని విమర్శించారు. పైగా ప్రైవేటుకు ఇస్తున్న 58% భూముల్లో 32% ఎవరికైనా అమ్ముకోవచ్చనడం దారుణమన్నారు.

ఇది ఇలా ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో నేత వాసిరెడ్డి పద్మ కూడా చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు తన ఏకపక్ష విధానాలతో పరిపాలనలో టైజాన్ని సృష్టిస్తున్నారని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ... ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధికారులందరూ టీడీపీ నేతలు చెప్పిన విధంగానే నడుచుకోవాలని బాబు ఆదేశాలివ్వడం దారుణమన్నారు.

English summary
YSRCP leader and MLA alla ramakrishna reddy on Wednesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X