• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చంద్రబాబు నుండి ప్యాకేజ్ అందితే ఒకలా.. అందకుంటే ఒకలా .. పవన్ పై ఆళ్ళ ఘాటు వ్యాఖ్యలు

|
  పవన్ పర్యటనపై మండిపడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డి | Alla Ramakrishna Reddy Strong Comments On Pawan Kalyan

  పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటన పై మంగళగిరి ఎమ్మెల్యే, సీఆర్డీఏ చైర్మన్ ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ మాస్టర్ అని విమర్శలు గుప్పించారు. గతంలో రాజధాని కోసం భూ సేకరణ చేస్తే ఆందోళన చేస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూ టర్న్ తీసుకొని రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు ఆళ్ల రామకృష్ణారెడ్డి.

  టీడీపీకి జ్యోతుల..త్రిమూర్తులు గుడ్ బై !! నెహ్రూ కు జగన్ ఛాన్స్ ఇస్తారా: తోట రూటు వైసీపీ వైపే..!!

  పవన్ ప్యాకేజీల మాస్టర్ అని మండిపడిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి

  పవన్ ప్యాకేజీల మాస్టర్ అని మండిపడిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డి

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం అమరాతి పర్యటన చేపట్టి రాజధాని సమీప గ్రామాలలో పర్యటించి, అతడి ప్రజలతోనూ, రైతులతోనూ మాట్లాడారు. రాజధాని రైతులకు అండగా ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్, రాజధాని మారిస్తే జనసేన ఒప్పుకోదు అని తేల్చి చెప్పారు. రాజధానిపై క్లారిటీ కావాలన్నారు.ఇక పవన్ పర్యటనపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ అందినప్పుడు ఒక విధంగా.. అందనప్పుడు మరో విధంగా మాట్లాడటం పవన్ కి అలవాటు అయ్యిందని విమర్శలు గుప్పించారు.

   దమ్ముంటే చంద్రబాబు హయంలో జరిగిన మోసాలను బయటపెట్టాలని పవన్ కు ఆళ్ళ సవాల్

  దమ్ముంటే చంద్రబాబు హయంలో జరిగిన మోసాలను బయటపెట్టాలని పవన్ కు ఆళ్ళ సవాల్

  గతంలో బేతపూడి గ్రామంలో పర్యటించినప్పుడు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దమ్ముంటే చంద్రబాబు హయంలో జరిగిన మోసాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు చంద్రబాబు పైన పోరాటం చెయ్యలేని పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్ మీద పోరాటానికి సిద్ధమయ్యారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ సేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్, నాలుగుసార్లు భూసేకరణ జరిగినప్పుడు ఎందుకు ఆమరణ దీక్ష చేయలేదని, అప్పుడు పవన్ ఏమయ్యారని ఆళ్ల ప్రశ్నించారు. పవన్ కి నిజంగా రాజధాని అంటే అభిమానం ఉంటే మంగళగిరి నుండి ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.

  ఇన్ని రోజులు పత్తాలేకుండా పోయిన పవన్ కి ఇప్పుడు ఉన్నపళంగా రైతులపై ప్రేమ ఎందుకో అన్న ఆళ్ళ

  ఇన్ని రోజులు పత్తాలేకుండా పోయిన పవన్ కి ఇప్పుడు ఉన్నపళంగా రైతులపై ప్రేమ ఎందుకో అన్న ఆళ్ళ

  కనీసం జనసేన అభ్యర్థిని కూడా ఎందుకు పోటీకి దింపలేదని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా సీటు ఇచ్చారని అనుకున్నా,వారి కోసం ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోరాటం చేస్తానని మాట్లాడటం విడ్డూరమని మండిపడ్డారు. లోకేష్ ని గెలిపించడానికి క పవన్ తెర వెనుక ఎన్నో ప్రయత్నాలు చేశారని, ఇక అవన్నీ రాజధాని రైతులకు తెలుసునని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పవన్ మంచి నటుడని అయితే ఇన్ని రోజులు పత్తాలేకుండా పోయిన పవన్ కి ఇప్పుడు ఉన్నపళంగా రైతులపై ప్రేమ పుట్టుకొచ్చిందంటే ఎవరూ నమ్మరని ఆళ్ల అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ మాస్టర్ అని ఘాటుగా విమర్శించిన ఆళ్ల రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటనను ఆక్షేపించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానన్న పవన్ మాటలను తప్పుబట్టారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Mangalagiri MLA and CRDA chairman Alla Ramakrishna Reddy on Pawan Kalyan's capital visit. Pawan Kalyan has been criticized for being a package master. Pawan Kalyan, who had previously expressed concern over land acquisition for the capital, is now taking the U-turn and fighting for the capital's farmers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more